Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘ఏం తల్లీ! ఎక్కడికి ఆ పిండిని పట్టుకుపోతున్నారు?’’ అడిగారు బాబా.
ఆ అడగడంలో కొంచెం గట్టిదనం ఉంది. అది గ్రహించాడు శ్యామా. బాబా కోపంగా ఉన్నారు, ఆ సంగతి స్త్రీలకు తెలీదు. తను కల్పించుకోవాలి. పరిస్థితిని సరిదిద్దాలనుకున్నాడు శ్యామా.‘‘తెలియక బాబా, తెలియక తీసుకున్నారు. ఇచ్చేస్తారు. మీ పిండి మీకే.’’ అన్నాడు శ్యామా.
‘‘తెలియక చేసిన పాపాలన్నీ తిరగలి తిప్పి, పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నా కోసం పిండి మూటగ డుతున్నారు. పిండి నా కోసం కాదు. మీ కోసం, మీ అందరి కోసం.’’ అన్నారు బాబా.అర్థం కాలేదెవరికీ. అయోమయంగా చూశారు.
‘‘ఈ పిండితో పాటుగా నలుగురూ ఊరు నాలుగు దిక్కులా వెళ్ళండి. అక్కడ ఊరి పొలిమేరల్లో పిండిని, జల్లండి. గీత గీసినట్టుగా జల్లండి. సరిహద్దు గీతలా కనిపించాలది. అప్పుడు ఈ ఊరిలోకి కలరా రాదు. వచ్చేందుకు భయపడుతుంది. వెళ్ళండి.’’ అన్నారు బాబా.
ఆయన చెప్పినట్టుగానే ఊరికి నలుదిక్కులా నలుగురు స్త్రీలూ వెళ్ళారు. గోధుమ పిండి గీత గీసినట్టుగా సరిహద్దుగా జల్లి వచ్చారు. దాంతో షిరిడీ పొలిమేరల్లోనే కలరా నిలిచిపోయింది. ఊరిలోకి అడుగుపెట్టేందుకు సాహసించలేకపోయింది.
ద్వారకామాయి ఎదురుగా ఉన్న బడిలోనే శ్యామా నివసించేవాడు. బడి కాగానే ద్వారకామాయికి చేరుకునేవాడతను. పిల్లలకు పాఠాలు చెప్పడం కన్నా బాబాని సేవించడమే అతనికి ఇష్టంగా ఉండేది. బాబా సేవలో తరించేవాడతను. రాత్రి వరకు ద్వారకామాయిలోనే గడిపేవాడు.
బాబా రాత్రి భోజనం కాగానే అందరితో పాటు శ్యామా కూడా అక్కణ్ణుంచి బయటపడేవాడు. బయటపడినా అతని మనసంతా బాబా గురించిన ఆలోచనలతోనే నిండిపోయేది.
నిద్రపట్టేది కాదు అతనికి. కిటికీలోంచి ద్వారకామాయి వైపు చూస్తూ బాబాని గమనిస్తూ గడిపేవాడు శ్యామా.
అర్థరాత్రి వేళ ద్వారకామాయిలోంచి బాబా పెద్దపెట్టున మంత్రాలేవో ఉచ్ఛరిస్తున్నట్టుగా వినవచ్చేది. మంత్రాలతో పాటుగా బాబా ఎవరినో కేకేలేసేవారు. తిడుతూండేవారు.
బాబా తిడుతున్నది ఎవరిని? ఎవరి మీద అంత పెద్దగా కేకలేస్తున్నారు? తెలుసుకోవాలని శ్యామా ఓ రాత్రి ద్వారకామాయి దగ్గరకు వెళ్ళాడు. చాటుగా గమనించాడు.
బాబా ఆవేశంగా ఎవరి మీదో అరుస్తున్నారు. కోపగించుకుంటున్నారు. తానెవరిని కోపగించుకుంటున్నారో ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నట్టుగా బాబా ప్రవర్తిస్తున్నారు. అయితే ఆయన ఎదురుగా ఎవరూ లేరు. అంతా శూన్యం. కళ్ళు నులుముకుని చూసినా, కళ్ళు పెద్దవి చేసుకుని చూసినా ఫలితం లేకపోయింది. శ్యామాకి ఎవరూ కనిపించ లేదు.
తర్వాత తనకు తానే సమాధాన పడ్డారేమో! బాబా సన్నగా నవ్వారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకున్నారు. నృత్యం చేయసాగారు. నృత్యం చేస్తూ పాటలు పాడారు. పాడి పాడి అలసిపోయి, గోడకి చేర బడ్డారు. ‘‘ఇక సెలవు’’ అన్నారు. నిద్ర కమ్ముకొచ్చినట్టుగా కళ్ళు మూసుకున్నారు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నమ్మవద్దు! నన్ను నమ్మమని నీకు చెప్పానా?’’ గట్టిగా అరిచారు బాబా.
- ‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’
- భారీ వర్షంలో కూడా పిండి తడవకుండా ఉంది(సాయి లీలామ్మ గారి అనుభవం)
- ఊది మహత్మ్యం(భాగోజీకి బాబావారి రక్షణ)
- ‘‘నేనే కాపాడతాను. బయిజాకిచ్చిన మాట తప్పుతానా?’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “‘‘తెలియక చేసిన పాపాలన్నీ తిరగలి తిప్పి, పోగొట్టుకున్నారు.”
kishore Babu
January 11, 2017 at 5:56 amSai Baba…Sai Baba…Sai Baba.
http://saileelas.com/m/videos/view/Sai-Baba-Naamam-7