Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి లీలమ్మ గారు 1923 ఆగస్టు 17న విజయవాడలో శ్రీ గోవిందరాజు నాయుడు (మునిసిపల్ ఛైర్మన్ గా మూడుసార్లు పనిచేశారు) మరియు శ్రీ రుక్మిణి భాయ్ పుణ్య దంపతులకు జన్మించారు. ఆమె ఏడు సంవత్సరాల వయస్సు నుండి ఆమె తండ్రి భగవత్ గీతా యొక్క ప్రసస్త్యాన్ని వివరించి చెప్పేవారు. ముందుగా ఆమె శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలుపెట్టారు.
1938లో ఆమె తన మేన మామయ్య శ్రీ వేణుగోపాల్ గారిని కలిసినప్పుడు అక్కడ వారి ఇంటిలో మొదటిసారి బాబా యొక్క అందమైన చిత్రాన్ని చూసే అవకాశం ఆమెకు లభించింది. ఆ ఫోటోలో బాబా యొక్క నోరు హనుమంతుడిని పోలినట్లు ఉందని ఆమె సరదాగా అన్నారు. ఆమె అక్కడ బాబా యొక్క లీలలును మరియు బాబా తన భక్తులను ఇబ్బందులు మరియు అడ్డంకులను ఎలా తొలగించేవారో తెలుసుకున్నారు.
మరుసటి రోజే ఆమెకు మొదటి అనుభవం కలిగింది. ఆమె పాఠశాలకు వెళ్ళడానికి ఆమె ఆతురుతలో ఉన్న సమయంలో ఒక ముఖ్యమైన పుస్తకం కనిపించలేదు. ఆమె శ్రీ సాయినాధుని తలుచుకొని హృదయపూర్వకంగా ప్రార్ధించారు. మరుక్షణమే ఆ పుస్తకం ఆమె తన ముందు ఉండటం గమనించారు. అప్పటినుండి బాబాతో ఆమెకు అనుబంధం మొదలైయింది. ఆమె జీవితంలో రానున్న ప్రతి కష్టాన్ని బాబా ముందుగా హెచ్చరిస్తూ ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకోనేవారు.
1947లో శ్రీమతి సాయి లీలామ్మ గారు కలకత్తాలో నివసించేవారు. ఆమె తన కుమార్తె కోసం ఊలు కోటు అల్లిక నేర్చుకోవాలనుకున్నారు. కాబట్టి ఆమె తన ఇంటికి సమీపంలో ఉండే వాళ్ళ ఇంటికి అల్లిక నేర్చుకోవడం కోసం వెళ్లారు. కొంతసేపటి తరువాత భారీ వర్షం పడింది. వెంటనే ఆమెకు తన ఇంటి మేడపై ఎండబెట్టడం కోసం ఉంచిన మైదా పిండి గుర్తుకు వచ్చింది. ఆమె ఆ సమయంలో చాలా చిన్న వయస్సులో ఉన్నందున ఆమె భర్త తిడతారని బాధపడుతూ ఆమె చాలా ఆందోళన చెందారు. “బాబా మీరే నన్ను కాపాడాలి” అని ప్రార్ధించారు. బాబా అలానే చేసారు కూడా.
ఆమె వర్షం పడటం ఆగిపోయిన తరువాత గాబరాగా ఇంటి మేడపైకి వెళ్లి చూస్తే, ఆశ్చర్యం! మేడ మీద ఉంచిన పిండి ఎవరో గొడుగుతో తడవకుండా రక్షణ ఇచ్చినట్లు మైదా పిండి పొడిగా ఉన్నట్లు గమనించారు. పిండి ఎండబెట్టడం కోసం ఉంచిన స్థలం తప్ప మొత్తం మేడ అంతా తడిగా ఉంది. మధ్యాహ్నం వర్షం పడుతున్నప్పుడు అలా ఎవరు రక్షించగలరు! బాబా కాకుండా!
ఆ యవ్వన గృహిణికి ఇది ఒక రోజువారీ ప్రాముఖ్యమైన లోకిక విషయం అయినప్పటికీ కూడా బాబా తమ యొక్క ప్రమేయంతో ఒక అద్భత అనుభవంగా మారింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆశావరి వైకుల్ గారి అనుభవం
- తమ యొక్క సగుణ రూపాన్ని చూసేందుకు దృష్టిని ప్రసాదించారు బాబా–Audio
- రామబాయి కనిత్కర్
- శంకర్ లాల్ కె. భట్
- శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments