Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
‘‘కూర్చో’’ అన్నారు. కూర్చున్నాడు భాగోజీ.
ధునిలోని ఊదిని తీశారు బాబా. దానిని భాగోజీ శరీరమంతటా పూశారు. అంత వరకు శరీరానికి స్పర్శ లేదు. బాబా ఊది పూస్తూంటే చల్లగా ఉంది. స్పర్శ తెలిసింది.
భాగోజీ కళ్ళు మూసుకున్నాడు.‘బాబా! బాబా’ అంటూ బాబా నామస్మరణ చేయసాగాడు. నిద్ర ముంచుకొచ్చిందతనికి. నిద్రపోయాడు భాగోజీ. తనని స్మరిస్తూ నేల మీద ముడుచుకుని పడుకున్న భాగోజీని జాలిగా చూశారు బాబా. అక్కడ ఉన్న దుప్పటి తీసి కప్పారతని మీద. జో కొడుతూ కూర్చున్నారు.
అదంతా చూస్తూ ఉండలేననుకున్నాడు శ్యామా. బయల్దేరాడు అక్కణ్ణుంచి. అప్పటికే బాగా పొద్దుపోయింది.ఈ రాత్రి గడవనీ! రేపు తెల్లారుతూనే ద్వారకామాయికి చేరుకుంటాను. బాబా లేని వేళ చూసి, భాగోజీని అక్కణ్ణుంచి వెళ్ళగొడతాడనుకున్నాడు శ్యామా.
అనుకున్నదే ఆలస్యం, ఎదుర్రాయి తగిలి తూలిపడబోయాడు. అయినా నిలదొక్కుకున్నాడు.మర్నాడు.తెల్లారింది. కర్ర తీసుకుని పరుగందుకున్నాడు శ్యామా. సూర్యోదయం కాకూడదు. సూర్యోదయం వేళకి, దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని,అడవిలోంచి ద్వారకామాయికి చేరుకుంటారు బాబా.
ఆయన ద్వారకామాయికి చేరుకోకుండానే భాగోజీని అక్కణ్ణుంచి తరిమి కొట్టాలి. లేకపోతే ద్వారకామాయి పవిత్రత పోతుంది అనుకున్నాడు శ్యామా. ఆయాసపడుతూ ద్వారకామాయికి చేరుకున్నాడు.
బాబా కోసం చూశాడు. బాబా లేరు. ఇదే సమయం అనుకున్నాడతను. దుప్పటి కప్పుకుని పడుకున్న భాగోజీని చూశాడు. చేతిలోని కర్రతో పొడిచాడు.‘‘లే’’ గట్టిగా అరిచాడు. లేవలేదు భాగోజీ. కర్రతో దుప్పటిని తొలగించాడు శ్యామా.
సూర్యోదయం అయింది. తొలి కిరణం భాగోజీ శరీరం మీద పడింది. మెరిసిపోసాగాడతను. భాగోజీ ఒంటి మీద ఇప్పుడు ఎటువంటి కురుపులూ లేవు. ఎక్కడా రక్తం కారడం లేదు. చక్కగా బంగారు చాయతో అతని శరీరం మెరిసిపోతోంది.ఆశ్చర్యపోయాడు శ్యామా.
అప్పుడే అక్కడ అడుగిడిన బాబాని చూశాడు.‘‘బాబా’’ అంటూ చేతులు జోడించాడు. తర్వాత భాగోజీని పిలుస్తూ అతన్ని కుదిపి నిద్ర లేపాడు శ్యామా.
తనని ప్రేమగా పట్టుకున్న శ్యామాని చూసి ఆశ్చర్యపోయాడు భాగోజీ.‘‘చూసుకో, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో’’ చెప్పాడు శ్యామా. చూసుకున్నాడు భాగోజీ.
చేతులకి వేళ్ళు వచ్చాయి. కాళ్ళకి కూడా వేళ్ళున్నాయి. శరీరం బాగుంది. ఎక్కడా ఎలాంటి కురుపులూ, స్రావాలూ లేవు. ముఖాన్ని తడిమి చూసుకున్నాడు భాగోజీ. చేతికి అంతా నునుపుగా తగిలింది. పరుగుదీశాడు అక్కణ్ణుంచి,
గోలెం నీటిలో ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. చూడచక్కననిపించింది. ఆ ఆనందంలో గోలెం నీటిని దోసిళ్ళతో తీసుకుని పైన జల్లుకున్నాడు. గెంతసాగాడు.
చూస్తూ బాబా నవ్వుతూ నిల్చున్నారు. అలా నిలున్న బాబా దగ్గరికి ఒక్కంగలో వచ్చాడు భాగోజీ. అయన కాళ్ళ మీద పడ్డాడు.‘‘నువ్వు దేవుడివి బాబా, దేవుడివి’’ అన్నాడు.‘‘అల్లా మాలిక్’’ అన్నారు బాబా.
‘‘ఊది చాలా గొప్పది బాబా! ఒకే ఒక్క రాత్రిలో కుష్ఠువ్యాధిని లేకుండా చేసింది.’’ అన్నాడు శ్యామా.
‘‘అంత గొప్పదయితే నువ్వు కూడా ఊదీని ప్రసాదంగా నాలిక మీద వేసుకో, నీ మనసు కూడా చక్కబడుతుంది.’’ అన్నారు బాబా.
తప్పయిపోయింది అన్నట్టుగా తల వంచుకున్నాడు శ్యామా.
‘‘అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను, అది నా బలహీనత.’’ అన్నారు బాబా.
చేతులు జోడించి నిల్చున్న శ్యామా శిరసును ప్రేమగా నిమిరారు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఊది మహత్మ్యం(భాగోజీకి బాబావారి రక్షణ)
- ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
- షిరిడీలో ప్రతి చెట్టూ పుట్టా బాబాకి బాగా తెలుసు.
- ‘‘నువ్వు నా వాడివి. నిన్ను నేను వదులుకుంటానా? అందుకే రప్పించుకున్నాను.’’
- ‘నీకు ఏం కావాలో నేను అదే! నీకు అక్కరలేనిది కూడా నేనే!’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను”
kishore Babu
January 4, 2017 at 5:06 amVery Good article….Sai Baba…Sai Baba…Sai Baba.
సాయినాథుని ప్రణతి
January 8, 2017 at 7:05 amచాలా బాగుంది ఈ లిలలు చదువుతుంటె మనస్సుకు చాలా ఆనందం కలుగుతుంది. బాబా గురించి ప్రతి ఒకటి చదివెల చెసెరు .ఈ సాయిలీలలు అద్భుతం