ఆపదలో ఆపద్భాందవుడు – బాబా 1వ భాగం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఆపదలో ఆపద్భాందవుడు –  బాబా

మొదటి సారి షిరిడి దర్శనం

1994 లో మొదటి సారిగ మేము షిరిడి ని దర్శించాలనుకున్నాము. 1994 డిశంబర్ 24 న మేము కెకె.ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ కి రిజర్వేషన్ చేయించుకున్నాము. కాని దురదృష్టవశాత్తు నాకు విపరీతంగ వీపు నొప్పి మొదలయింది. నేను బెడ్ మీదే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని అడుగులు కూడా వేయలేక పోయేదాన్ని. మేము షిరిడి కి రిజర్వేషన్ చేయించుకున్న ట్రెయిన్ టికెట్స్ క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికి బాబా నుండి మాకు షిరిడి కి పిలుపు రాలేదు. అనేక రకాల మెడిసన్స్ తీసుకుంటూ రెండు నెలలు  ట్రీట్మెంట్ తీసుకున్నాను. మేము అప్పుడు రోహిణి లో వుండే వాళ్ళము. రోహిణి లో ప్రతి గురువారము బాబా గుడి కి వెళ్ళేవాళ్ళము.  షిరిడి కి వెళ్ళాలని మేము ఎంతో ఆశతో వున్నాము. 

మేము శివరాత్రికి షిరిడి కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. దాని ప్రకారం ట్రెయిన్ టికెట్స్  షిరిడికి (మన్మాడ్ ) రిజర్వేషన్ చేయించుకున్నాము. మాకు రెండు టికెట్స్ మాత్రమే రిజర్వేషన్ కి దొరికాయి. ఒకటి నాకు, మరొకటి మా అమ్మాయి కి (కాలేజీలో చదువుతోంది). మూడవ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో వుంది. రైల్వే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ప్రయత్నం చేసినా  కూడా మూడవ టికెట్ కన్ ఫర్మ్ కాలేదు. మా అబ్బాయి,  డ్రైవర్,  మా వారిని ఆఫీసు నుండి కారు లో ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్ లో వదిలి పెట్టడానికి వచ్చారు. మేము వెళ్ళే ట్రెయిన్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది . స్టేషన్ కి చేరుకోవడానికి   ఒక కిలో మీటర్ వుంది అనగా పహర్గంజ్ దగ్గర రాత్రి 8.45 గంటలకు మా కారు చెడిపోయింది. కారు అస్సలు స్టార్ట్ అవ్వలేదు. మా అబ్బాయి , మా వారు,  డ్రైవర్ ముగ్గురు మూడు దిక్కులకు  మెకానిక్ కోసం వెళ్ళారు. అప్పుడు రాత్రి 9 గంటలు అయింది  .మా అమ్మాయి , నేను కారు లో కూర్చొని వున్నాము. మా అమ్మాయి ఈ సారి ఏమైన సమస్య వచ్చి షిరిడి కి వెళ్ళలేకపొతే ఇక ఎప్పుడు  షిరిడి కి వెళ్ళము అని చెప్పింది. ఇంతకు ముందు కూడ చాలా సార్లు షిరిడి కి వెళ్ళాలని ఎంత ప్రయత్నించిన టికెట్స్  దొరకక వెళ్ళ లేకపోయాము. నేను , మా అమ్మాయి స్టేషన్ కి వెళ్ళడానికి రిక్షా లో ఎక్కి కూర్చున్నాము.  అప్పుడు గూని తో వున్న ఒక ముసలాయన  (ఆయనని  చూస్తే చెత్త పోగుచేసుకునే వ్యక్తిలాగ వున్నారు) వచ్చి కారు రిపేరు చేస్తానని చెప్పాడు.  మా ఆయన నీవేమి రిపేరు చేయగలవని గొణిగి, ఆఖరికి సరే ప్రయత్నించమని అన్నారు.

ఆ ముసలాయన బోనెట్ ని ఓపన్ చేసి ఇంజన్ ని తాకాడు.  కారు స్టార్ట్ అయ్యింది. మా ఆయన ఆ పని చేసినందుకు ఆ ముసలాయనకి 20 రుపాయలు ఇచ్చారు.  నేను,మా అమ్మాయి రిక్షా లో స్టేషన్ చేరాము. మా ఆయన, అబ్బాయి, డ్రైవర్ ముగ్గురు కారు లో స్టేషన్ కి వచ్చారు. ఆశ్చర్యంగ నేను స్టేషన్ బయటి నుండి ప్లాట్ ఫారం వరకు దాదాపు 300 మీటర్లు నడవగలిగాను. మేము ట్రెయిన్ లో కూర్చున్నాము.  ఆ ముసలాయన శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదని మాకర్ధమయింది.  నేను, మా అమ్మాయి  మా బెర్త్ లో కూర్చున్నాము. కాని మా ఆయనకు బెర్త్ లేదు. ట్రెయిన్ బయలుదేరింది. మా కంపార్ట్ మెంట్   లో ఒక బెర్త్ ఖాళీ గా వుంది. రెండు స్టేషన్స్ వరకు ఆ బెర్త్ లోకి ఎవ్వరు రాలేదు. అందువలన మా ఆయన ఆ బెర్త్ లొ కూర్చున్నారు. ఆశ్చర్యంగా మా ప్రయాణము చివరి వరకు ఆ బెర్త్ లోకి ఎవ్వరు రాలేదు. మా ఆయన కూడ ప్రశాంతంగా ప్రయాణము చేయగలిగారు. ఇది అంతా బాబా దయ వలనే జరిగింది.

మరుసటి రోజు సాయంత్రము ఎటువంటి ఇబ్బందులు లేకుండ మేము షిరిడి చేరుకోగలిగాము. మొదటగా మేము బాబా సమాధి మందిరము ను దర్శించాము. అప్పుడు ఎక్కువ రష్ లేదు. అప్పట్లో  సమాధి మందిరము, మందిరము చుట్టు ఇప్పుడు వున్న విధంగ ఎటువంటి కట్టడాలు లేవు   అప్పుడు విజిటర్స్ కోసం వెయిటింగ్ హాల్ , స్పెషల్ దర్శనం కోసం స్పెషల్ లైన్స్  వుండేవి కావు. మరుసటి రోజు మధ్యాహ్నం ట్రెయిన్ కి షిరిడి నుండి బయలుదేరే ముందు  బాబా దర్శనం మరొక సారి చేసుకుందాం అనుకున్నాము.

మరుసటి రోజు ఉదయం దర్శనం కోసం వచ్చినపుడు చాలా రద్దీగా ఉండటంతో  మేము ఆశ్చర్యపోయాము. ఆ రోజు శివరాత్రి కావడం వలన చాలా మంది వచ్చ్హారు.  దర్శనం కోసం వచ్చిన భక్తులు  క్యూ లైన్ లో లెండిబాగ్ నుండి, మెయిన్ రోడ్ లో వున్న షాప్ లు, బజార్లు , బస్ స్టాండ్ వరకు క్యూ లైన్ లో వున్నారు. మేము ఆ క్యూ లైన్ లో వున్నాము. కాని మాకు బాబా దర్శనం అవుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే క్యూ లైన్ నిదానంగా ముందుకు కదులుతోంది.  మేము ట్రెయిన్ కి సరైన సమయానికి  చేరుకోవాలంటే షిరిడి నుండి మధ్యాహ్నం 1.30 కి  బయలుదేరాలి . మేము కనీసం మధ్యాహ్నం 1 గంట కల్ల లెండి బాగ్ ని దాట గలిగితే సమాధి మందిరం దర్శనం చేసుకోగలుగుతాం. లేకపోతే క్యూ లైన్ నుండి వెనక్కివచ్చేద్దాం అనుకున్నాం.  మేము లెండి బాగ్ ని దాట లేకపోయాము. అందువలన క్యూ లైన్ నుండి వచ్చేద్దాం అనుకున్నాము. నంద దీపం దగ్గర మేము క్యూ నుండి అస్సలు బయటికి రాలేకపోయాము. చుట్టూ జనం ఎక్కువ వుండడం తో చిక్కుకుపోయి క్యూ లైన్ నుండి బయటికి రాలేకపోయాము. నంద దీపం దగ్గర కొంతమంది ఆడవాళ్ళు పూజ చేసుకుంటున్నారు . వాళ్ళు మాకు చాల పండ్లు  ఇచ్చి  ఎవరికైన పెళ్ళి అయిన ఆడవాళ్ళకు ఇమ్మని చెప్పారు.  మేము క్యూ లైన్ నుండి ఎప్పటికప్పుడు బయట పడాలని చూశాము.  కాని ఎప్పుడు ప్రయత్నించిన బయటికి రాలేక ఇంకా ముందుకు నెట్ట బడ్డాము.  ఇలా జరుగుతుండగానే మాకు తెలియకుండానే సమాధి మందిరం గేట్ దగ్గరికి వచ్చాము. ఆఖరికి ఇక్కడ కూడా క్యూ నుండి బయటకు రావాలని చూశాము. కాని మమ్మల్ని సెక్యూరిటి గార్డ్ వాళ్ళు సమాధి మందిరం గేట్ లోపలికి తోసేసారు. అదంతా బాబాగారి ప్రేరణతోనే జరిగింది.  ఒకప్రక్క మాకు శివరాత్రికి సాయిబాబా దర్శనం చేసుకోవాలని వున్నామరొకప్రక్క మన్మాడ్ లో మేము వెళ్ళాల్సిన రైలు ఎక్కడ తప్పి పోతుందోనని భయం వేసింది.  మాకు  సమాధి మందిరం లో బాబా దర్శనం చాలా బాగా జరిగింది.  ఆ సంతోషం లో నాకు ఆనంద భాష్పాలు వచ్చాయి.  ఆ అనుభూతి చాల గొప్పగా వున్నది. అంతా బాబా గారి దయ.

మేము మన్మాడ్ కి ట్రెయిన్ కి అందుకోవాలని ఆత్రంగా బయలుదేరాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా మన్మాడ్ కి వెళ్ళడానికి సరైన సమయం లో వాహనాలు కూడా రెడీగా వున్నాయి. అంతా బాబా గారే ఏర్ప్పాటు  చేసినట్లు బాగా జరిగింది.  మేము సరైన సమయానికి వెళ్ళి రైలు అందుకోగలిగాము. అప్పటి నుండి దాదాపు ప్రతి సంవత్సరం బాబా దర్శనం చేసుకుంటున్నాము.

రేపు మరి రెండు అనుభవాలు….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles