Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంత దాస్ గారి అనుభవములు మొదటి భాగం
నా పేరు అనంత దాస్. మేము మీర్ పేట్ హైదరాబాద్ లో ఉంటాం.
మాది బార్బర్ షాప్. మా మేనమామ గారికి షాప్ ఉంది. ఆయన ఆ షాప్ లో బాబా ఫోటోను పెట్టుకున్నాడు. ఆయన అది ఎప్పటినుండి ఉంచాడో తెలియదు. నా వయసు అప్పుడు 3 , 4 సంవత్సరాలు ఉంటాయి.
ఆ వయసులో నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్లి మా మామతో నేను షాప్ కి వెళ్లి అక్కడ ఆ ఫోటోను చూసాను.
ఆ ఫోటో పైన ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని రాసి ఉంది. మా మామయ్య ఆ షాప్ తలుపు తీయంగానే లోపలి వెళ్లి ‘బాబా’ ముందు నిలబడి అగర్బత్తీలు వెలిగించి దండం పెట్టుకునేవాడు.
నేనా ఫోటో కేసి తదేకంగా చూసేవాడిని. ఎవరీయన అనుకునే వాడిని.
ఆ తరువాత నేను 7 th class చదువుతున్నప్పుడు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళే వాడిని. హనుమాన్ చాలీసా కూడా పాడుకుంటుండేవాడిని.
10th క్లాస్ చదువుకునేటప్పుడు మా బావ, మా అన్నయ ఇద్దరూ కలిసి షిరిడి వెళ్లి వచ్చారు. వచ్చేటపుడు బాబా ఫోటో ఒకటి, గంధం డబ్బా ఒకటి తెచ్చారు. నాకు ఇచ్చారు.
అప్పటి నుండి ఆ గంధం బొట్టు పెట్టుకొని దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఊది కూడా ధారణ చేస్తుండేవాడిని.
మా అన్నయ తెచ్చిన ఫోటోకి దండం పెట్టుకుంటుండేవాడిని. నేను మా అమ్మకి 11వ సంతానం. నాకు ముగ్గురు అన్నలు 7 మంది అక్కలు నేను అందరికంటే చిన్నవాడిని ఆఖరివాడిని.
నేనా గంధం బొట్టు పెట్టుకునే ఇంటర్మీడియట్ లో కాలేజీకి వెళ్ళేవాడిని. మేమున్నది ముస్లిం ఏరియా. పిల్లలందరూ ముస్లిం పిల్లలు.
నేనొక్కడినే గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని వెళితే నన్ను చూసి నవ్వే వారు.
నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాకు ITI లో సీట్ వచ్చింది. ఇంటర్ చదవటం ఆపేసి ITI కాలేజీలో చేశాను.
పూర్తి అయ్యాక నేను HMT కంపెనీలో నేను అప్రెంటిస్ చేశాను. ఆ సమయం లోనే నేను షిరిడి వెళ్ళాలనుకున్నాను. కానీ నాకు ఎలా వెళ్ళాలో తెలియదు.
1984 సంవత్సరం అది. నాతో ఎవరూ రానన్నారు. మా అన్నయ ముందుగానే షిరిడి వెళ్ళాడు కాబట్టి తనకి ఎలా వెళ్ళాలో తెలుసు.
అతను అన్నాడు నువ్వు బయపడాల్సింది ఏమి లేదు. తిన్నగా CBS కి వేళ్ళు షిరిడి బస్సు ఉంటుంది అది ఎక్కు నేరుగా షిరిడి లో దింపుతాడు. వెళ్ళమన్నాడు.
నేను అలాగే అని బస్టాండ్ కి వెళ్లి ‘షిరిడి’కి బస్సు ఎక్కాను. ‘షిరిడి’ లో మర్నాడు ఉదయం దిగాను.
రూమ్ కోసం వెళ్ళాను. ఒక్కళ్ళకి రూమ్ ఇవ్వనన్నారు. లాకర్ తీసుకోమన్నారు. నేను సరేననుకొని లాకర్ తీసుకుని స్నానం చేసుకుని సమాధి మందిరానికి బాబా దర్శనం కోసం వెళ్ళాను.
లోపల ఎవరైనా నాకు తెలిసిన వారు కనపడతారేమో అని చూసాను. లైన్ లో వెడుతూ అంతా వెతుకుతున్నాను. మాకు తెలిసినాయన గబుక్కున మందిరంలో కనపడ్డాడు.
నేను వెంటనే ఓ సెట్ అంటూ గట్టిగా పిలిచాను. పెద్దగా అరిచాను. అక్కడ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. నేను గట్టిగా మాట్లాడుతున్నాను అని నాకు నేనే సిగ్గుపడ్డాను.
బాబా మందిరంలో పాదాల దగ్గర దండం పెట్టుకోవడానికి వెళ్లి నేను బాబాని వేడుకోవాలనుంది ఏంటంటే నాకు మంచి ఉద్యోగం రావాలి, నేను అసలు షిరిడి వెళ్ళింది దాని కోసమే
తీరా బాబా పాదాల మీద నేను తలా పెట్టి బాబా నాకు మంచి భార్యనివ్వు అని వేడుకున్నాను. నేను ఎందుకలా మొక్కానో కూడా నాకు తెలియదు. ఉద్యోగం విషయం నాకు అసలు జ్ఞాపకం రాలేదు.
తిరిగి వచ్చి హాల్ లో లాకర్ దగ్గరికి వచ్చాను. మూడు చాపలు వేసి ఉన్నాయక్కడ. ఆ మూడు చాపల పైన ముగ్గురు వ్యక్తులు పడుకుని ఉన్నారు అక్కడ.
నాకు ఇక్కడైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడతారా అని చూస్తున్నాను. ఆ ముగ్గురి వ్యక్తులతోటి మాటలు కలిపాను.
ఆ ముగ్గురు కూడా ఎవరికివారు వచ్చినవారే. వాళ్ళతో నేను మీతో కలుస్తాను అని అన్నాను. వాళ్ళు సరే అన్నారు.
మేము నలుగురము మరునాడు మళ్ళీ దర్శనం చేసుకుని అక్కడ నుండి ‘సాకోరీ’ వెళ్ళాము. అక్కడ ఏమున్నాయో అన్ని చూసాము.
ఇంటికి తిరిగి వచ్చాక నేను ఉద్యోగం కోసం ఎదురు చూసాను కానీ రాలేదు. మల్లేపల్లి లో నేను ఒక బార్బర్ షాప్ పెట్టాను.
ఆ షాప్ లో ఒక పక్క షిరిడి సాయినాధుడి ఫోటో మరో పక్క ఆంజనేయుని ఫోటో పెట్టాను.
ప్రతి గురువారం బాబాకు మాల వేసేవాడిని. రోజూ బాబా కు అగరుబత్తీలు వెలిగించి దీపం పెట్టేవాడిని. షాప్ కి బాగా గిరాకీ ఉండేది.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru.
అనంత దాస్ గారి అనుభవములు రెండవ భాగం తరువాయి…..
Latest Miracles:
- భక్తురాలి సంకల్పాన్ని కాలాలకు అతీతంగా నిజం చేసిన బాబా వారు
- కష్టాలలో ఆదుకొనే శ్రీ శిరిడి సాయినాధుడు
- బాబా నీ దగ్గర నాకు రెండు పూటలా రెండు రొట్టెలు పెట్టి చీపురు తో ఊడ్చే పని అయినా నాకు ఇప్పించు
- బాబా పేరును మాత్రమే ఉంచి ప్రారంభించిన నా కొత్త వ్యాపారం సక్సెస్ అవ్వుట
- బాబా వారి సేవ చేసిన భక్తురాలి కుమార్తెకు సాయినాథుని దయతో బ్యాంకు జాబ్ వచ్చుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments