Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు పద్మావతి, మా వారి పేరు మల్లిఖార్జున రావు. ఆయన ఈ మధ్యనే పోయారు.
వారు సెక్రటేరియట్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. సాయి నాథుడు మాకిచ్చిన అనుభవాలు, అనుభూతులు ప్రతి క్షణం, ఆ తండ్రి నామం తలచుకుంటుంటే, మనసు శరీరం పులకించి పోతాయి.
బాబా వారు మాకిచ్చిన అనుభవాలు కొన్ని మీకు తెలియచేస్తాను.
మొదటిసారిగా బాబా గారి గురించి మాకు 1988 సం|| లో తెలిసింది, ఆ రోజుల్లో మాకు ఎక్కువగా దేవుని పూజలు తెలియవు,
ఆ సమయంలో నా మిత్రురాలి ఇంట్లో బాబా గారి పటం చూడడం జరిగింది. ఆ పటం లో బాబా గారి స్థానంలో చనిపోయిన మా నాన్న గారు కనిపిస్తున్నారు,
ఏమిటి ఆయన ఎవరు? వీరి స్థానంలో మా నాన్న గారు ఎందుకు కనపడుతున్నారు? అని అనుకుని అదే విషయం మా మిత్రురాలిని అడిగాను,
ఆయన షిరిడీ సాయినాథుడు అని చెప్పింది, వారి జీవిత చరిత్ర చదవమని, చదివితే ఆయన గురించి నీకే తెలుస్తుంది అని బాబా గారి పారాయణ పుస్తకం ఇచ్చింది, దానిని చదివాను,
ఆనాటి నుండి నాకు గురువు, దైవం, తండ్రి అన్నీ ఆ సాయినాథుడే. అలా మేము బాబా గారి పూజ చేయటం ప్రారంభించాము.
1992వ సంవత్సరంలో ఒకసారి మా వారికీ గుండె నొప్పి వచ్చింది, నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నారు, తరువాత ఇంటికి తీసుకువచ్చాము,
కానీ ప్రతిరోజు గుండె నొప్పి వస్తూండేది, ఆయన భాధ చూడలేక పోయేదాన్ని, ఒక రోజు రాత్రి నొప్పి ఎక్కువగా వచ్చింది,
ఏనాడూ ఎవరినీ ఏమీ అడగని నేను ఆ రోజు బాబా గారిని, మా వారి బాధ తగ్గించమని ప్రార్ధించాను, ఆ తండ్రి నా మొర ఆలకించాడు, మరుసటి రోజు ఉదయానికి వారిని ఆరోగ్య వంతుడ్ని చేసారు,
ఆనాటి రాత్రి బాబా గారు మా వారికి దర్శనం ఇచ్చి నీకు ఆరోగ్యం కావాలా? ఐశ్వర్యం కావాలా అని అడిగారట,
అప్పటి వరకు మా వారికి బాబా గారు ఎలా ఉంటారో కూడా తెలియదు, కానీ మా వారు నాకు ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం వద్దు అని అన్నారట,
ఆనాటి నుండి బాబా గారు ప్రతి క్షణం మా ముందు ఉండి మమ్ములను నడిపించారు.
మొదటిసారిగా మేము 1994 సంవత్సరంలో షిరిడీ వెళ్ళాము, అప్పుడు అక్కడ బాబా గారి నామ సప్తాహం జరుగుతోంది, ఎవరో చేస్తున్నారు. అప్పుడు మాకు ఒక రోజు ఏకాహం చేసుకుంటే బావుండు అనిపించింది.
ఇంటికి వచ్చాక, ఆ తండ్రి నామం జరపాలని తేదీ నిర్ణయించాము, నిర్ణయించిన రోజు దగ్గర పడుతోంది ”మన వద్ద డబ్బు లేదు ఎలా” అని మా వారు అన్నారు.
”నామం జరిపించుకోవడం ఆయన నిర్ణయం, అంతా బాబానే చూసుకుంటారు, మధ్యలో మనం ఎవరం” అని చెప్పాను.
నామం ప్రారంభం రోజుకి ముందు రోజు సాయి బంధువులు కొందరు నామం కొరకు అయ్యే ఖర్చు మేము ఇస్తాము అని చెప్పారు, మరునాడు నామం ఏ ఆటకం లేకుండా జరిగింది.
ఒకసారి మా పరిస్థితి బాగా లేక ఇల్లు అమ్మవలసి వచ్చింది, అందరూ నన్ను నిందించారు.
నేను మాత్రం బాబా నీ సేవ తప్ప నాకు మరొకటి తెలియదు నువ్వు నన్ను రోడ్డు పైన ఉంచినా నీ నామం అక్కడే చేస్తాను కానీ నిన్ను మాత్రం వదలను అని బాబాతో చెప్పాను.
ఆ తండ్రి తన బిడ్డలను రోడ్డు పైన ఉంచుతాడా? వేరే వారి ద్వారా డబ్బు సాయం చేయించి తన ఇంటిని నిలుపుకున్నాడు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- పిలిచి అవకాశం ఇవ్వటం బాబా కృప కాకా మరేమిటి–Audio
- కష్టాలలో ఉన్న మాకు రతన్ బాబా గారి ద్వారా అభయం ఇప్పించిన బాబా వారు.
- బాబా ఆజ్ఞ తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన మాకు, ప్రయాణములో జరిగిన ప్రమాదం నుండి రక్షించిన బాబా వారు
- భక్తురాలికి బాబా వారు ప్రసాదించిన దివ్య పూజ అనుభవములు
- నా మేన కోడలిని పెద్ద ప్రమాదం నుండి రక్షించిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments