Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: లక్కరసు రవి కుమార్
నివాసం: సిద్ధి పేట
నేను 1993 వ సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయిన తరువాత ఇంటర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినాను.
1995లో మా నాన్న గారు జనవరి 12 వ తేదిన చనిపోవడం జరిగినది.
అందువలన నేను చదువును మధ్యలోనే ఆపివేయడం జరిగినది.
మా కుటుంబ భాద్యతలు నాపై పడడం వలన నేను ఏదో ఒక పని గురించి వెతకడం ప్రారంభించాను.
మొదటగా STD లో, తరువాత కిరాణా షాప్ లో, ఆ తరువాత పేపర్ వేయడం, పాల ప్యాకెట్లు వేయడం, ఆ తరువాత డ్రెస్సెస్ షాప్ లో పని చేశాను.
కానీ వారు ఇచ్చే జీతం చాలక పోవడం వలన చాలా చాలా ఇబ్బందిగా ఉండేది.
ఒక గురువారం రోజు తేది. 04.04.1996న సిద్ధిపేటలో శ్రీ శిరిడి సాయి బాబా దేవాలయమునకు వెళ్లి, స్వామి వారిని దర్శించుకొని, నా బాధలు చెప్పుకున్నాను.
నాకు ఏదో ఒక పని దొరికేటట్లు చూడమని ఆ సాయినాధుని ప్రార్ధించాను.
తేది. 08.04.1996 న మా చిన్నాన్న గారు నన్ను ఒక నూనె మిల్లులో పని గురించి తీసుకెళ్ళారు.
మా చిన్నాన్న షాప్ ఎదురుగా ఉన్న షాప్ నుండి ఆ నూనె మిల్లుకు ఫోన్ చేసారు. కానీ, అక్కడ వారు లేరు.
ఆ షాప్ అప్పటి శ్రీ శిరిడి సాయి బాబా దేవాలయం అద్యక్షులు శ్రీ శివ్వా శంకరయ్య గారిది.
ఆయన నన్ను దేవాలయంలో పని చేస్తావా అని అడిగారు.
కానీ నేను దేవాలయంలో పనికి భయపడి చేయనని చెప్పాను. ఇంటికి వచ్చిన తరువాత మా చిన్నాన్న గారు కోప్పడినారు.
ఆ తరువాత నేను తేది. 11.04.1996న బాబా టెంపులులో పనికి చేరాను.
నేను బాబా గారిని వేడుకోవడం, బాబా గారు నన్ను ఆ స్వామి వారి సేవకు రప్పించుకోవడం, శ్రీ శిరిడి సాయి బాబా దేవాలయంలో నాకు సేవ చేసుకొనే అదృష్టం లభించడం నేను చేసుకున్న పూర్వ జన్మ సుకృతం.
అప్పటి నుండి నేను ఆ దేవాలయంలో పని చేసుకుంటూ ఉన్నాను.
2002 నుండి ఆ దేవాలయంలో మేనేజరుగా పని చూసుకుంటున్నాను. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ శిరిడి సాయినాధుడు.
~~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~~
*** సాయి సూక్తి:
“నా భక్తులు అడిగినవన్నీనేను ఇస్తూనే ఉంటాను, నేనివ్వదలచింది వారడిగేంతవరకు”.
Latest Miracles:
- కష్టాలలో ఆదుకొనే శ్రీ శిరిడి సాయినాధుడు–Audio
- ఎనిమిదేళ్ల పసి ప్రాయంలో కృష్ణ ప్రియకు గురోపదేశం ఇచ్చిన శ్రీ సాయినాధుడు
- నాస్తికుడిని ఆస్తికుడిగా మార్చిన సాయినాధుడు
- కష్టాలలో ఉన్న భక్తుని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకొని వచ్చిన అవధూతల దర్శనం…Audio
- నిమోనియాను నివారించిన సాయినాధుడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments