బాబా అని ముందు పిలిచింది ఎవరు (1వ. భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

‘‘మాటకారివే’’ అంది ఆమె. నవ్వింది.‘‘ఏ ఊరు మీది?’’

‘‘అన్ని ఊళ్ళూ నావే’’‘‘అవునా? మరి నీ తల్లిదండ్రులెవరు?’’సమాధానంగా ఆకాశాన్ని చూపించాడు బాబా.‘‘అల్లా మాలిక్‌’’ అన్నారు.

వేపచెట్టు కింద చూడముచ్చటగా ఓ కుర్రాడు, అతనితో మాట్లాడుతూ ఆమె…ఏమయి ఉంటుందక్కడ? దారిన పోతున్న వారంతా చుట్టూ మూగారు.‘‘ఏమిటవ్వా? ఎవరితను?’’ అడిగారు.‘‘అల్లామాలిక్‌’’ అందామె. ఆకాశాన్ని చూపించింది. ఆమెను నవ్వుతూ చూశారు బాబా. కళ్ళు మూసుకున్నాడు. ధ్యానంలో మునిగిపోయారు.‘‘పదండి పదండి’’ వృద్ధురాలితో పాటుగా అంతా అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు.

ధ్యానముద్రలో బాబా మిగిలిపోయాడక్కడ. పగలు లేదు, రాత్రి లేదు. ఎప్పుడూ బాబా ధ్యానిస్తూ కనిపించేవాడు. పలకరించినా వినిపించుకునేవాడు కాదు. ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి వణికిపోతూ కూడా బాబా ధ్యానంలో నిమగ్నమయి ఉండేవాడు.ఎక్కణ్ణుంచి వచ్చాడో తెలియదు. ఎవరి బిడ్డడో తెలియదు. అహర్నిశలూ ఆకలి మాటే మరిచిపోయి అలా కూర్చుంటున్నాడంటే ‘అయ్యో’ అనుకున్నారు గ్రామస్తులు. జాలి చెందారు.

ఇంత అన్నం తెచ్చి పెట్టారు. రొట్టెలు పెట్టారు. కళ్ళు తెరిచినప్పుడు చూస్తాడని ఆశ. ఆకలి వేసినప్పుడు తింటాడని ఆశ. అయితే బాబా కళ్ళు తెరవడం, వాటిని చూడడం జరిగినా ఎన్నడూ వాటిని పట్టించుకోలేదు.

తినాలన్న ధ్యాసే ఉండేది కాదతనికి.అన్నాన్ని, రొట్టెల్ని చీమలు పట్టేవి. కుక్కలూ పిల్లులూ పీక్కుని తినేవి. పోట్లాడుకునేవి. అప్పుడు పట్టించుకునేవారు బాబా. సర్ది చెప్పేవాడు వాటికి. అవి తినగా మిగిలింది తిని, కృతజ్ఞతగా వాటిని చూసే వాడు. ప్రేమగా వాటిని నిమిరేవారు.

షిరిడి ఆలయాల్లో ఖండోబా ఆలయం చెప్పుకోదగినది. వీరభద్రుడు గ్రామదేవత ఖండోబాగా వెలిశాడని చెబుతారంతా. అక్కడి పూజారి మహల్సాపతి, ఖండోబా పరమ భక్తుడు.

అతనికి బాబాని గురించి ఖండోబాని అడిగి తెలుసుకోవాలనిపించింది.ఖండోబా జాతర జరుగుతోంది. డప్పుల దరువులతో షిరిడి మారుమ్రోగుతోంది. పిల్లలూ పెద్దలూ గుంపులు గుంపులుగా ఉన్నారు. ఆటలాడుతూ ఆనందిస్తున్నారు.

ఖండోబా ఆవహించాడేమో! గణాచారి ఊగిపోసాగాడు. ఊగిపోతున్న గణాచారిని అంతా ప్రశ్నిస్తున్నారు. భూత భవిష్యత్‌ వర్తమానాలను అడిగి తెలుసుకుంటున్నారు.ఇదే సరయిన సమయం.

బాబా ఎవరన్నదీ ఇప్పుడు తెలిసి పోతుంది అనుకున్నాడు మహల్సాపతి. అనుకుని, గణాచారి కాళ్ళు కడిగాడతను. ధూపం వేశాడు. అడిగాడిలా.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles