Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
తన పదహారవ ఏట ఒకసారి, ఇరవయ్యో ఏట మరోసారి షిరిడిలో అడుగు పెట్టి, అరవై ఏళ్ళ పాటు షిరిడిలో సంచరించిన దేవదేవుడు సాయిబాబా!
వారి జన్మ రహస్యాలు ఎవరికీ తెలియవు. కాని వారి జీవిత విశేషాలు అందరూ తెలుసుకోదగినవి. పదే పదే పఠించదగినవి. ఆ విశేషాల సమాహారమే ఈ సాయి పారాయణం.
షిరిడి మహారాష్ట్రలో ఓ చిన్న గ్రామం. అప్పుడే తెల్లగా తెల్లారింది. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. మారుతి మందిరంలో పువ్వులు కోసుకుని, పూజ చేసుకునేందుకు ఇంటి నుంచి బయల్దేరింది ఓ వృద్ధురాలు.
అడుగులో అడుగు వేసుకుని మెల్లగా నడుస్తోంది. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడాలనుకుందామె. తలెత్తి చూసింది. వేపచెట్టు మీదుగా ఉదయిస్తున్న సూర్యుడితో పాటు, ఆ చెట్టు కింద ధ్యానంలో ఉండి, సూర్యుడిలా వెలిగిపోతున్న ఓ యువకుడు కనిపించాడామెకి.
కనిపించిన ఆ యువకునికి పదహారేళ్ళ వయసు ఉంటుంది. తెల్లటి పొడుగాటి కఫిని ధరించాడతను. తలకి టోపిలా రుమాలు చుట్టి ముడి వేశాడు. భుజాన్న జోలె వేలాడుతోంది. ఎడమ వైపున సటకా ఉంది.ఎవరితడు? పట్టి పట్టి చూసిందామె.
ఈ ఊరి వాడు కాదు.మరెక్కడి వాడు?ఎక్కడి వాడయితేనేం? ముస్లిం అయితే ఉండేందుకు మసీదు ఉంది. హిందువయితే ఉండేందుకు మారుతి మందిరం ఉంది. అక్కడెక్కడా ఉండక, ఈ వేపచెట్టు కింద ఉన్నాడేం పాపం?
‘‘బాబు’’ అని పిలవబోయిందామె. అయితే ఆ మాట ‘బాబా’గా ఆమె నోటి వెంట వెలువడింది. ‘బాబా’ అంటే తండ్రి అని అర్థం.‘‘బాబా’’కళ్ళు తెరిచాడు బాబా. కరుణతో చూశాడామెను. చల్లగా అనిపించిందామెకు.
‘‘నీ పేరేమిటి?’’ అడిగింది. నవ్వాడు బాబా.‘‘పేరడిగితే నవ్వుతావేమిటి? నీ పేరేమిటి?’’ రెట్టించిందామె.‘‘నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను.’’ అన్నారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా అని ముందు పిలిచింది ఎవరు (2వ. భాగం)
- బాబా అని ముందు పిలిచింది ఎవరు (1వ. భాగం)
- సాయిబాబా నా తోడు ఉన్నాను అని చెప్పారు.
- ‘‘ముందు దాని గొలుసులు తొలగించండి. బయటికి తీసుకుని రండి.’’
- అంతా బాబా వల్లనే అయ్యింది అని భావించిన వారికి కష్టాలు దరి చేరవు అని తెలుసుకున్న భక్తురాలు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments