Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘అంటువ్యాధులకీ, వంట చెరుకుకీ సంబంధం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వంట చెరుకు ఊరిలోకి వస్తే కలరా, ప్లేగు వ్యాపిస్తుందట!
రానీయకుండా దాన్ని అడ్డుకుంటున్నారు. బొగ్గులూ లేక కట్టెలూ లేక వంట ఎలా చేస్తారు బాబా? రెండు మూడు రోజులయింది, ఏ ఇంటా వంటలు లేవు. పిల్లా పాపా ఆకలికి అల్లాడిపోతున్నారు.
ఈ సమస్యను మీరే పరిష్కరించాలి. కళ్ళు తెరువు బాబా! కరుణించు!’’ అన్నాడు మహల్సాపతి.
అయినా కళ్ళు తెరచి చూడలేదు బాబా.
‘‘తరతరాలుగా వస్తున్న నమ్మకాలవి. వాటిని కాదంటారేమిటి? అయినా ఇవన్నీ బాబాగారికెందుకు చెప్పడం, మరేం పనిలేకపోతే సరి.’’ అన్నాడు శ్యామా. మహల్సాపతి మీద విసుక్కున్నాడు.
సరిగ్గా అదే సమయానికి, ఎలా వచ్చిందో ఓ కట్టెలబండి ద్వారకామాయి దగ్గరగా వచ్చింది. పొలిమేరలు దాటి వచ్చిందది. అక్కడ ఎవరూ దాన్ని అడ్డుకున్నట్టు లేరు.
ఇక్కడ బండిని చూస్తూనే గ్రామస్తులు బండివాని మీద విరుచుకు పడ్డారు.‘‘పో పో! వెనక్కి పో’’ అన్నారు. రాళ్ళు రువ్వారు.బతిమలాడుకుంటున్నా బండివాని మొర వినిపించుకోవట్లేదు. తప్పని సరయి బండిని వెనక్కి తిప్పాడతను.
అలా బండి వెనక్కి తిరిగిందో లేదో అప్పుడు కళ్ళు తెరిచారు బాబా. పెద్ద పెద్దగా అడుగులు వేస్తూ ముందు కొచ్చారు. చప్పట్లు చరిచారు. బండివాణ్ణి కేకేశారు.‘‘ఇలారా’’
‘‘ఎలా వస్తాడు?’’ శ్యామా అడ్డుకునేందుకు ముందుకు రాబోయాడు. అడుగుపడలేదు. అలాగే బండివాణ్ణి అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారెవరూ అడుగు తీసి అడుగు వేయలేకపోయారు.
బొమ్మల్లా చూస్తూండిపోయారు. బండివాడు ధైర్యంగా బండిని తీసుకొచ్చి బాబా ముందు నిలిపాడు.
కట్టెలు ఊరిలోకి రావాలి. వంటలు చెయ్యాలి. పిల్లల ఆకలి తీరాలనుకుంటూ అటుగా వస్తూన్న కాశీరాంకి కట్టెల బండి కనిపించేసరికి చాలా సంతోషం కలిగింది. అది బాబా ముందు నిలబడే సరికి ఎక్కడ లేని ధైర్యమూ వచ్చింది. పరుగందుకున్నాడతను.
మనసులో మంచిని తలపెట్టిన కారణంగానో ఏమో కాశీరాం మాత్రమే అడుగులు వేయగలిగాడు. బాబాని చేరుకున్నాడు.‘‘చెప్పండి బాబా, కట్టెలు ఎక్కడ వేయమంటారు?’’ అడిగాడు కాశీరాం.
‘‘అక్కడ’’ అటుగా చూపారు బాబా.మసీదుకి ఆగ్నేయమూలగా కట్టెలు పోగుబడ్డాయి.
బండివాడు, కాశీరాం, మహల్సాపతి కట్టెల్ని మోసుకొచ్చి గుట్టగా పోశారక్కడ.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సర్వరోగ నివారిణి ధుని
- ఊదీ సర్వరోగ నివారిణి
- బిడ్డను రక్షించేందుకు ధుని లో నా చేతులు ఉంచి బిడ్డ ప్రాణాలు కాపాడాను.
- బాబా అని ముందు పిలిచింది ఎవరు (1వ. భాగం)
- మహల్సాపతి ఆహ్వానం ఆవోసాయి (1వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments