Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘బాబా’’ అన్నాడు నానా. అయన పాదాల్ని ఆశ్రయించాడు.
‘‘మీ తల్లిదండ్రుల్ని అనుగ్రహించి, మీకు జన్మనిచ్చిన ఫకీరు ఎవరో తెలుసా అయ్యా? ఈ ఫకీరే, ఈ బాబానే’’ అన్నాడు అక్కడున్న కులకర్ణి.
కన్నీళ్ళతో బాబాని చూశాడు నానా.‘‘నాకు జన్మనిచ్చావు. నన్ను ఇంత వాణ్ణి చేశారు. నా మరణాన్ని కూడా అడ్డుకున్నావు. నువ్వు దేవుడివి.
ఈ రోజు నుంచి ఈ నానా మీకు దాసానుదాసుడు. దయచేసి, మీ నుంచి నన్ను దూరం చెయ్యకు. మీ సేవాభాగ్యాన్ని నాకు అనుగ్రహించు.’’ అన్నాడు నానా.
నవ్వుతూ పైకి చూశారు బాబా.‘‘సబ్ కా మాలిక్ ఏక్! అల్లా మాలిక్’’ అన్నారు. అంటూ శూన్యంలోకి పరిశీలనగా చూస్తూ ధుని దగ్గరగా నడవసాగారు.
సరిగ్గా అదే సమయానికి షిరిడికి కొద్ది దూరంలో ఓ గ్రామంలో బాబా భక్తురాలు ఒకామె, తన ఏడాది బిడ్డను ఒడిలో పెట్టుకుని కట్టెల పొయ్యి ముందు కూర్చుని వంట చేస్తోంది. పొయ్యి భగభగా మండుతోంది. నాలుకలు సాచి మరీ మంటలు లేస్తున్నాయి.
అంతలో ఆమెను భర్త పిలిచాడు. ఆ పిలుపునకు ఒక్కఉదుటన లేచిందామె. అలా లేవడంలో పట్టు తప్పి, ఒడిలోని బిడ్డ మంటల్లో పడిపోయింది. కెవ్వున కేకేసి ‘బాబా’ అంటూ కళ్ళు మూసుకుందామె.
అక్కడ ఆమె బాబాని తలచుకోవడం ఏమిటి, ఇక్కడ బాబా, మండుతున్న ధునిలో తన రెండు చేతుల్నీ ఒక్కసారిగా దూర్చారు.
ఆ దృశ్యం చూసి పరుగు పరుగున వచ్చారు శ్యామా, షిండేలు. బాబాని పట్టుకుని వెనక్కి లాగారు.
రారే బాబా! ఇద్దరూ బలంగా గట్టిగా లాగితే అప్పుడొచ్చారు. మంటల్లోంచి చేతులు తీసుకున్నారు. ధ్యానంలో నిమగ్నమయినట్టుగా ఉన్నారు బాబా.
ఒకంతటికి కళ్ళు తెరవలేదు. కాస్సేపటికి కళ్ళు తెరిచి చూశారు.
కాలిన తన చేతుల్ని పట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్న షిండే, శ్యామాలు కనిపించారాయనికి.‘‘ఏమిటి బాబా ఇది? మంటల్లో చేతులు పెట్టి కావాలని కాల్చుకున్నారెందుకు?’’ బాధగా అడిగాడు షిండే.
‘‘ఎందుకంటే…అక్కడ పసిబిడ్డ మంటల్లో పడిపోయింది. తల్లికి ఏం చెయ్యాలో తెలియక నన్ను తలచుకుంది. వెంటనే నేను ఆ బిడ్డను రక్షించేందుకు ధుని లో నా చేతులు ఉంచి బిడ్డ ప్రాణాలు కాపాడాను. అల్లా మాలిక్.’’ అన్నారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా నుంచి నిన్ను దూరం చేసి, ఆ మృత్యుదేవత నిన్ను పట్టుకుపోవాలని ఆలోచిస్తోంది.
- ‘‘బాపూగిర్ అని బాబా ఒక్కరే నన్ను పిలిచేది. ఇంకెవరూ నన్నలా పిలవరు.
- “బాబా” అని గట్టిగా కేకేశాడు ‘నానా’. అంతే! రెండు అదృశ్య హస్తాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి.
- నా సమాథి మాట్లాడుతుంది. నా సమాథి నుండే నేను సర్వ కార్యాలూ నిర్వర్తిస్తాను.
- దాహం! దాహం!!…..సాయి@366 మే 24….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments