నా సమాథి మాట్లాడుతుంది. నా సమాథి నుండే నేను సర్వ కార్యాలూ నిర్వర్తిస్తాను.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

నానాని రమ్మన్నట్టుగా చేత్తో సైగ చేశారు. వచ్చాడతను.‘‘చెప్పండి బాబా’’‘‘నాకు భగవద్గీత రెండవ అధ్యాయంలోని 22వ శ్లోకం అర్థం చెప్పు.’’ అడిగారు బాబా.

‘‘ఇప్పుడది ఎందుకు?’’ నానాకి ఆ శ్లోకం చదవడం, అర్థం వివరించడం ఇష్టం లేదు.‘‘నువ్వు చదవాలి. గట్టిగా చదవాలి. అర్థాన్ని కూడా అందరికీ వినబడేట్టుగా చెప్పాలి. నా మాట కాదనకు.’’ చెప్పారు బాబా.

తప్పదిక అనుకున్నాడు నానా. దగ్గరగా ఉన్న భగవద్గీతను అందుకున్నాడు. రెండవ అధ్యాయాన్ని తెరిచాడు. అందులోని 22వ శ్లోకాన్ని చదవసాగాడు.

శ్లో:వాసాంసి జీర్ణాని యథా విహాయనవాని గృహ్ణాతి నరోపరాణితథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ!!శ్లోకాన్ని చదివి ఆగిపోయాడు నానా.

అర్థం చెప్పేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్నట్టుగా బాబాని చూశాడు.‘‘ఉన్న మాట, శ్రీకృష్ణుడు అన్న మాట చెప్పు. ఆలస్యం చెయ్యకు, అర్థాన్ని చెప్పు.’’ అన్నారు బాబా. నానాకి తప్పలేదు.

గొంతు సవరించుకున్నాడతను. చెప్పసాగాడిలా.‘‘చిరిగిన వస్త్రాన్ని వదలి నూతన వ స్త్రాన్ని మానవుడు ఎలా ధరిస్తున్నాడో అలాగే జీవుడు శిథిలమయిన శరీరాన్ని వదలి, నూతన శరీరాన్ని ధరిస్తున్నాడు. ఈ విషయమై శోకించడం తగదు.’’‘‘విన్నారు కదా’’ అన్నారు బాబా అందర్నీ చూస్తూ.

‘‘అరవై ఏళ్ళ పాటు మీ సేవలందుకున్న ఈ శరీరం శిథిలమయిపోయింది. కొత్త శరీరాన్ని వెదుక్కుంటోంది. దీనికి బాధపడితే ఎలా? అయినా నేనెక్కడికి పోతున్నాను, ఇక్కడే ఉంటాను.

నా సమాథి మాట్లాడుతుంది. నా సమాథి నుండే నేను సర్వ కార్యాలూ నిర్వర్తిస్తాను. దయచేసి ఎవరూ ఏడవకండి.’’ అన్నారు బాబా.

శ్యామా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. భోరుమన్నాడు.‘‘పదే పదే సమాథి అని అనకు బాబా! భయం వేస్తోంది.

నువ్వు లేకపోతే మేము లేము. మమ్మల్ని అనాథల్ని చెయ్యకు.’’ అన్నాడు శ్యామా.

అంతలో అక్కడికి పరుగు పరుగున వచ్చాడు రామచంద్రపాటిల్‌. బాబా దగ్గరగా ఆయాసపడుతూ నిల్చున్నాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

‘‘తాత్యాకేం బాగా లేదు బాబా! ఇప్పుడో అప్పుడోలా ఉన్నాడు. చనిపోతాడనిపిస్తోంది.’’ అన్నాడు.పాటిల్‌ని చుట్టుముట్టారంతా. ‘నిజమా’ అన్నట్టుగా చూశారతన్ని.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles