నా మట్టి మాట్లాడుతుంది! నా నామం పలుకుతుంది!!–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-120-నా మట్టి మాట్లాడుతుంది 2:20

నిజామాబాద్ జిల్లాలో మండలం కేంద్రమైన బోధన్ సాయిబాబా మందిరంలో గత 13 సంవత్సరములుగా సత్సంగం జరుగుతూవుంది.

ఈ మద్యనే అంటే 2008 సంవత్సరం నుండి నేను సత్సంగానికి పోతున్నాను.

అందుకు ఒక కారణం వుంది. నేను నడుము నొప్పితో విపరీతంగా బాధపడుతుండేదానిని.

ఎంతోమంది డాక్టర్లకు చూపించి, ఎన్నో రకాల మందులు వాడినాను అయినా ఫలితం కనబడలేదు.

చివరికి డాక్టర్లు “ఆపరేషన్ చేసినా ఫలితం వుండదు, మందులు వాడుకుంటూ జీవితాంతం బెడ్ రెస్ట్ తీసుకుంటూ కాలం గడపవలసినదే” అని తేల్చి చెప్పారు.

పట్టుమని పది సెకండ్లు కూడా కుర్చొలేకపొయెదానిని. ఇక నడక సంగతి సరేసరి, మంచం మీద నుండి బాత్ రూంకు కూడా వెళ్ళలేకపోయేదానిని.

ఇలాంటి పరిస్థితులలో బాబా మందిరానికి చాలా కష్టంగా వెళ్ళినాను.

అక్కడ “మీరు నన్ను నడిచేలా చేయండి, లేదా నన్ను తీసుకుపోండి. నాకు ఈ బ్రతుకు వద్దు, జీవితాంతం ఇలా మంచం మీద ఉండలేను.” అని ప్రార్దించుకొని వచ్చేశాను.

ఆ రోజు నుండి శ్రీ సాయిబాబా నామస్మరణ చేయడం అలవాటు చేసుకున్నాను.

నామస్మరణ మొదలైన 4-5 నెలల తర్వాత మెల్లగా కూర్చోవడం. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నడవడం మొదలై, ఆ తర్వాత మాములుగా నడవడంతో నాలో నేనే ఆశ్చర్య పోయినాను.

తంలో ఎన్నో మందులు వాడినా కన్పించని ఫలితం యే మందులు వాడకుండా శ్రీ సాయిబాబా వారి నామస్మరణతో నాలో జరిగిన మార్పుకు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

అప్పటినుండి నేను క్రమం తప్పకుండా బాబా మందిరానికి వెళ్ళడం నా దిన చర్యలో భాగమైపోయింది.

నాకు క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన శ్రీ సాయిబాబా వారికి మరియు శ్రీ సాయినాధుని శరత్ బాబూజీ గారికి జీవుతాంతం ఋణపడివుంటాను.

జగదీశ్వరి,
బోధన్, నిజామాబాద్ జీల్లా.

సంపాదకీయం: సద్గురులీల ( సెప్టెంబరు  – 2009 )
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles