Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-153-0312-నా చరిత్ర కోసం 4:18
చికాగో దక్షిణ దిక్కున వున్న నా స్నేహితురాలిని కలవడానికి నేను 1985 లో వెళ్లాను.
ఆ ప్రాంతంలో ఎక్కువగా నల్ల జాతీయులు నివసిస్తూ వుంటారు, ముఠాలకీ, దొమ్మీలకీ, హింసకీ పేరొందింది. నేనూ, నా స్నేహితురాలూ చాలా సేపు చీకటి పడడం కూడా గమనించకుండా మాట్లాడుకుంటూ వుండిపోయాము.
ఆమె మరొక చోటికి వెళ్లవలసి రావడంతో ఇంటికి పోవడానికి ఒంటరిగా పోవడానికి సిద్ధపడ్డాను. ఈ దక్షిణ ప్రాంత ప్రదేశం నుండి నువ్వు ఒక్క దానివి వెళ్ళగలవా అని స్నేహితురాలంది.
భయపడవద్దు ఏదైనా బస్సులో ఇంటికి చేరుకుంటానని చెప్పాను. ఈ దక్షిణ ప్రాంతం నుండి ఒంటరిగా వెళ్ళగలనని చాలా విశ్వాసంతో చెప్పున్నావే అని ఆశ్చర్యపోయిన స్నేహితురాలితో ’నా బైబిల్ నా దగ్గరుండగా నాకు భయమెందుకు?
నా ’శ్రీ సాయి సచ్చరిత్ర్’ నా దగ్గర వుండగా నేనెందుకు భయపడతాను’ అని సమాధానమిచ్చాను. ఆమె నవ్వుకుంది, నేను బయలుదేరాను.
అది శీతాకాలపు చల్లని రాత్రి , బస్సు వెంటనే రావడం నాకు సంతోషాన్నిచ్చింది. బస్సు ఎక్కాను, మూడో వరుసలో పూర్తిగా వెనుకకు కాకపోయినా డ్రైవరు తన వెనుక అద్దం నుండి నన్ను చూడగలిగేటట్లు కూర్చున్నాను.
తరువాతి స్టాపులో కొందరు ఆకతాయి కుర్రవాళ్ళు నా సీటు వెనుక కూర్చున్నారు. నా చేతి సంచి నా ప్రక్కనే వుంది, కానీ జిప్ తెరిచి వుంది. తరువాయి స్టాపు వచ్చేసరికి ఈ కుర్రాళ్లు నా మీదకి గెంతి నా చేతి సంచిని నా నుండి లాక్కుని బస్సు దిగి వెళ్ళిపోయారు.
నేను కూడా గెంతాను, వారిని వెంబడించాను. నా మనసులో అప్పుడు మెదిలిన ఒకే ఒక్క ఆలోచన నా శ్రీ సాయి సచ్చరిత్ర దొంగలించబడిందని.
ఆ ముఠా చేతిసంచి నుండి దొరికిన నగదుని తీసికుని ఖాళీ సంచిని నా మీదకి విసిరివేసి పారిపోయారు.
ఆశ్చర్యకరంగా డైవర్ అంతసేపూ వేచి వున్నాడు. నా సంచిని చూసికుని శ్రీ సాయి సచ్చరిత్ర అందులోనే వుందని నిర్ధారించుకుని బస్సులోనికి తిరిగి ఎక్కాను.
’అమ్మా! మీరు ఆ విధంగా వారిని తరుముకుంటూ వెళ్లవలసింది కాదు, వారు మిమ్ములను కాల్చి చంపివేసేవారు, ఆ సంచిలో అంత విలువైనది ఏముంది దానికోసం నీజీవితాన్నే ఫణం గా పెట్టబోయావు’ అని డ్రైవర్ ఆశ్చర్యపోయాడు.
ఆనంద భాష్పాలు కంట నిండుగా కారుతుండగా ’నా సాయి సఛ్చరిత, నా బైబిల్, అదిలేకుండా నేనెలా జీవించగలను’ అన్నాను. డ్రైవర్ ఆశ్చర్యకరంగా చూసి బస్సుని నడపడం మొదలు పెట్టాడు.
నాకు శ్రీ సాయి సచ్చరిత్ర్ గ్రంధానికి వున్న శక్తి గురించి తెలుసు. ఇప్పుడు మరింతగా అవగతమయింది. నిజానికి శ్రీ సాయి సఛ్చరిత్ర ద్వారా బాబా సశరీరంగా నన్ను కాపాడారు.
నాకు తెలుసు శ్రీ సాయి సచ్చరిత్ర కేవలం గ్రంధమే కాదు, నా పూజా మందిరంలో శ్రీ సాయి సచ్చరిత్ర ని ఉంచినప్పుడు నా తాలూకు దురదృష్టాలూ చీకటి కోణాలూ దూరమై నాలో మంగళ ప్రదమైన స్పందనలు కలుగ సాగాయి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ సమావేశానికి హాజరయినా, ఎక్కడ ఏదయినా విషయాన్ని సమర్పించవలసి వచ్చినా శ్రీ సాయి సచ్ఛరిత్ర నా దగ్గర వున్నందువలనే, ఆ కృప వలనే, నేను విజయం సాధించేదానినని నాకు గుర్తుకు వచ్చింది.
ఒంటరితనంతో బాధపడ్తున్నప్పుడు శ్రీ సాయి సచ్చరిత్ర ని నా హృదయానికి హత్తుకున్నప్పుడు లబించిన ఓదార్పు ఎలా మరచిపోగలను?
శ్రీ సాయి సచ్చరిత్ర వైభవమ్ గురించి ఎంతైనా వ్రాయగలను, చెప్పగలను, చివరిగా ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను – ఏదయినా గ్రంధం మీ దగ్గర వుండాలని కోరుకుంటే అది కేవలం శ్రీ సాయి సచ్చరిత్ర మాత్రమే.
విన్నీ చిట్లూరి ద్వారా వ్యక్తీకరణ.
అనువాదము, సేకరణ:
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా చరిత్ర తలదిండు కాదు, చదివి అర్దం చేసికో–Audio
- నేనే నా సచ్చరిత్ర రాస్తానని చెప్పు–Gopal Rao– 5–Audio
- నా మట్టి సమాధానమిస్తుంది,నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.
- నా మట్టి మాట్లాడుతుంది! నా నామం పలుకుతుంది!!–Audio
- నా కోసం ఒక పనిని చేయగలవా?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments