Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-152-0312-పూలమ్మగా ప్రసిద్ది చెందుట 2:54
కామేశ్వరమ్మ గారికి వివాహమగుట, అత్తింట బాబాను సేవించుటలో ఇబ్బందులు పొందుట, గుంటూరు చేరి అచట బాబా పూజలు జరుపుచుండ భక్తులు ఆమె చెంతకు రాసాగిరి.
ఆమె బాబా అనుగ్రహమునకు పాత్రురాలైనది. ఆమె నుండి బాబా కొన్ని లీలలు ప్రకటింప సాగిరి. పూజాసమయమున యిల్లంతయు సుగంధభరితమగుట జరుగుచున్నది.
వీరు యిచ్చు బాబా తీర్దముతొ అనారోగ్యులు ఆరోగ్యవంతులగుచుండిరి. క్రమేపి భక్తుల సంఖ్య పెరగసాగినది.
ఒక రోజున నిత్య పూజ చేసి నైవేద్యమిడుచు రెండు చేతులు కలుపు అందు గులాబి పుష్పము వచ్చినది.
క్రమముగా దోసిట నిండా మల్లెపూలు, గులాబీపూలు రాసాగినవి. ఈ లీల తెలిసిన భక్తులు కిటకిటలాడసాగిరి.
ఇక ప్రతిరోజూ ఆమె దోసిట గులాబీలు వచ్చుచుం డుటచే భక్తులు ఆమెను పూలమ్మగా పిలువసాగిరి.
ఆంధ్రప్రదేశ్ లో చుండూరు కామేశ్వరమ్మ అను పేరుకంటే పూలమ్మగా ప్రసిద్ది చెందినది. ఇంకను రవ్వకేసరి, కలకండ ప్రసాదాములుగా వచ్చుచుండెను. అక్షతలు కూడా వచ్చుచుండేవి.
సాధరణముగా ఇట్టి లీలలు సిద్దులుగానో, తాంత్రిక విద్యలుగానో భావిమ్తుము.
అట్టివి బాబా లీలలు కావు. భక్తుల విస్వాసమునకు ఏవైనా బాబా చూపుదురు.
బాబా దేహధారిగా యున్నప్పటికన్నా ఇప్పుడే అద్బుత లీలలు బాబా చూపుచున్నారని పూజ్యశ్రీ శివనెశన్ స్వామి, శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లు ఇవి బాబా నిదర్శ నములని తలచవచ్చు.
పూలమ్మ గారితో వారి చివరి సమయమునకు ఐదు సంవత్సరముల ముందు నుండి నాకు(రచయిత) పరిచయ మేర్పడినది.
ఎందరెందరో దూర ప్రాంతముల నుండి వారి వద్దకు వచ్చుట అనేక విషయములు తెలుసుకొనుచుండట జరిగేడిది. సాధన నేర్పెడివారు.
చివరి రెండు మూడు సంవత్సరముల ముందు నుండి వారిట్టి మహిమలు చూపుట ఆపిరి. సాధకులకు వాటితో పనిలేదనిరి.
ఆమె దేహము చాలించుటకు కొద్ది రోజుల ముందు ది 20-7-1993వ తేదిన అమ్మగారు చాలా సేపు నాతొ మాట్లాడుచు,
బాబా విషయములు చెప్పుచు చివరగా “గోపాలరావు! మహావిష్ణువైన శ్రీసాయిబాబా మనకు అండగా యున్నారు.నీవు మంత్రాలు కాని తాయెత్తులు వంటి వాటిని గాని, ఎవరిని కాని ఆశ్రయించవద్దు” అని చెప్పారు.
ఇదే ఆమె ఆఖరి సందేశమైనది.
సంపాదకీయం: సద్గురులీల ( మార్చి – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా ఇప్పుడు దర్శనమిచ్చుచున్నారని శ్రీశివనేశన్ స్వామి చెప్పుట–Audio
- “దేవుణ్ణి నమ్మడానికి ఋజువులూ, సాక్ష్యాలూ కావాలా? తప్పుకాదూ?’’
- బాబా పటములో పాదముల నుండి గంగా, యమునా జలములు వచ్చుట–Audio
- శిరిడీసాయి దర్శనం.
- నైవేద్యం ఏమి పెట్టలేదని బాధపడుతున్న భక్తురాలి కలలో కనిపించి బీసీ బెల్ బాత్ అడిగిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments