Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
బాబా గురించి భక్తులు కథలు కథలుగా చెబుతారు. విన్నవారికి ఈ కథలు నిజమా? అనిపించవచ్చు, అనుమానాలు కూడా రావచ్చు, అది సహజం. నిజానికి భక్తులు చెప్పినవి కథలు కావు, లీలలు, బాబా లీలలవి. లీలలని ప్రచారం చేస్తున్నారు,
ఎవరు చూశారని అంటారేమో! పొరబాటు. బాబాలీలలన్నీ భక్తుల అనుభవాలే! అందులో అనుమానాల్లేవు. అలాంటి అనుభవాల్ని చాలా విన్నాడు భీమా. విన్నదేదీ నమ్మలేదతను. ఏదయినా తను కళ్ళతో చూడాలి. అనుభవంలోకి రావాలి. అప్పుడు నమ్ముతాననుకున్నాడు భీమా.
షిరిడీకి బయల్దేరాడు. బాబా లీలలు చూడాలని ఆశపడ్డాడు. తన ఆశను శ్యామాకు చెప్పాడతను.
‘‘మీరు బాబాని నమ్మాలంటే, బాబా మీకు తన లీలలు చూపించాలి. చూపిస్తే మీరు బాబాని నమ్ముతారు, లేదంటే లేదు, అంతేనా?’’ అడిగాడు శ్యామా.‘‘అంతేనా అంటే అది కాదుగాని, బాబా లీలలు చూడాలని చాలా కోరిగ్గా ఉంది.’’ చెప్పాడు భీమా.
‘‘బాబా లీలలు చూడాలని కోరిక కాదు, ఆయన్ని మీరు పరీక్షించాలనుకుంటున్నారు, అవునా?’’సమాధానం లేదు భీమా దగ్గర్నుంచి. నీళ్ళు నమలాడతను.‘‘ఆ దృష్టితో మీరు చూసినట్టయితే బాబాకి చాలా కోపం వస్తుంది. బాబా కోపాన్ని తట్టుకోవడం కష్టం. అయినా దేవుణ్ణి నమ్మడానికి ఋజువులూ, సాక్ష్యాలూ కావాలా? తప్పుకాదూ?’’ అన్నాడు శ్యామా.తల వంచుకుని నిలబడ్డాడు భీమా.
‘‘సరే, ఎలాగూ షిరిడీ వచ్చారు కాబట్టి, ఇవేవీ మనసులో పెట్టుకోకుండా, బాబాని దర్శించుకుని హాయిగా వెళ్ళిపొండి.’’ చెప్పాడు శ్యామా.
తన మనసులోని మాట శ్యామాకి చెప్పి తప్పు చేశాననుకున్నాడు భీమా. బాబా లీలలు చూడడం జరగదా? ఏ ఒక్క లీలా చూడకుండా తిరిగి వెళ్ళిపోవడమేనా? చఛ! అనుకున్నాడు. నిరాశ చెందాడు. ఆ నిరాశతోనే ద్వారకామాయికి చేరుకున్నాడు.
బాబాని దర్శించుకున్నాడు. రెండు చేతులూ జోడించి ఆయనకి నమస్కరించాడు. పట్టించుకోలేదు బాబా. భీమాని కన్నెత్తి కూడా చూడలేదు. గమనించాడది శ్యామా.
భీమాని పక్కకి పిలిచి చెప్పాడిలా.‘‘చూశావా, తనని పరీక్షించేందుకు వచ్చావని బాబాకి తెలిసిపోయింది. అందుకే బాబా నిన్ను కన్నెత్తి చూడలేదు. పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు.’’
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నా లీలలు చూడాలని వచ్చి, వాడాకి వెళ్తావా? ఆగు! చూద్దూగాని.’’
- భగవానుని లీల…..సాయి@366 మే 26….Audio
- నైవేద్యం ఏమి పెట్టలేదని బాధపడుతున్న భక్తురాలి కలలో కనిపించి బీసీ బెల్ బాత్ అడిగిన బాబా వారు.
- నోరు తెరచి అడగకుండానే మనసులోని కోరికను తీర్చిన బాబా వారు
- బాబా ఇప్పుడు దర్శనమిచ్చుచున్నారని శ్రీశివనేశన్ స్వామి చెప్పుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments