బాబా పటములో పాదముల నుండి గంగా, యమునా జలములు వచ్చుట–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio prepared by Mr Sri Ram

  1. పాదముల నుండి గంగా యమునా జలములు వచ్చుట 3:03

మీకిప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన, అద్భుతమైన లీలా చెపుతాను.

తనకు, తన పటమునకు అను గ్రహించుటలో భేదములేదను లీల, నేను ఇప్పుడు యున్నానను లీల.

పూలమ్మగా ప్రసిద్ధి చెందిన చుండూరు కామేశ్వరమ్మ గారు గుంటూరులో కొత్త పేట లో యుంటూ బాబా పూజలు చేయుచుండగా ఎందరో భక్తులు ఆమెను దర్శించి బాబా అనుగ్రహము పొందుచుండుట జరుగుచున్నది.

ఒకసారి ఆమె వద్దకు వచ్చు భక్తులు కాశి వెళ్ళుచుండ తనకు ఆర్థిక స్థోమత లేక కాశి వెళ్లలేక పోయి నందుకు బాధ పడినది.

 

మరుసటి రోజు ఎప్పటివలె ఉదయము పూజామందిరములోనికి వచ్చినది. అచ్చట నున్న శ్రీ సాయిబాబా పటములోని బాబా పాదములనుండి నీరు ప్రవహించుచుండుట చూచినది.

 

ఆ వచ్చుచున్న నీటిని చెంబులతో పట్టుచు రెండు బిందెల నిండా నింపినది.

ఆ విషయము తెలిసి భక్తులు అమ్మగారింటికి రాసాగిరి. కామేశ్వరమ్మగారి ఆనందమునకు అవధులులేవు.

 

అలనాడు దాసగణకు బాబా తమ పాదములనుండి గంగా – యమునా జలమును ప్రవహింపజేసి అనుగ్రహించిరి.

ఇప్పుడు తనకు అదేవిధముగా తమ పటమునుండి బాబా గంగా యమునా జలములను ప్రవహింపజేసి అనుగ్రహించిరి.

 

ఈ రెండు లీలలకు ఇసుమంతయు బేధములేదు. బాబా ఇప్పుడును తన కార్యము కొనసాగించుచున్నారని ప్రత్యక్ష నిదర్శనమిచ్చిరి.
పూలమ్మగారు,ఆమె భర్త రామారావుగారు ఒక బిందెలోని నీటితో స్నానము చేసిరి.

రెండవ బిందెలోని నీటిని భక్తులు తీర్ధముగా తీసుకొని, తలలపై చల్లుకొనిరి.

ఈ లీలను రచయితనైన నాకు పూలమ్మగారు స్వయముగా చెప్పిరి. నండూరు కారణంగారైన శ్రీనండూరు వెంకట సుబ్బారావుగారు ఆ లీల చూచి యుండి నాతో చెప్పిరి.

బాబా పాదము నుండి నీరు వచ్చిన ఆ ద్వారకామాయి పటము యం.ప్రసాద్ అను సాయి భక్తుని వద్ద హైదరాబాదులో యున్నది.

ఈ లీల సాయి సచ్చరిత్రకాదా! ఈ లీలలు మరుగునపడరాదు.బాబా భక్తులు కోరిన కోర్కెలను తీర్చగలరని విశ్వసించుదముగాక.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల ( మే  – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా పటములో పాదముల నుండి గంగా, యమునా జలములు వచ్చుట–Audio

kishore Babu

ఈ లీల ద్వారా సాయి బాబా వారి అద్భుత శక్తి రోజు రోజు కి రెట్టింపు అవుతుంది. ఈ లీల లో బాబా వారి పాదపద్మములనుంచి వచ్చిన గంగాజలం ద్వారా గంగా కూడా బాబా వారిలో అంతర్భాగం అని గ్రహించవచ్చు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles