Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఇక కొద్ది రోజులలో రామకృష్ణ పరమహంస తన అవతారాన్ని చాలించబోతున్నారని శిష్యులు గ్రహించారు.
ఆయన అవతార పురుషుడనని చెప్పుకునే విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన వివేకానందునకు కలిగింది.
ఆ రోజు రామకృష్ణులు భరించరాని నొప్పితో తల్లడిల్లిపోతున్నారు.
శారీరక వ్యాధితో ఇంతగా తల్లడిల్లిపోతున్న సమయంలో తనకు తాను అవతార పురుషునిగా తెల్పితే, ముమ్మాటికి రామకృష్ణులు అవతార పురుషుడేనని నమ్ముతాను అని వివేకానందుడు మనసులో అనుకున్నాడు.
అలా మనసులో అనుకోగానే, రామకృష్ణులు లేచి కూర్చుని ”నరేన్, మునుపు ఎవరు రాముడు గాను, కృష్ణుడుగాను అవతరించారో వారే ఇప్పుడు రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు, కానీ, నీ వేదాంత భావన ప్రకారం కాదు” అన్నారు వివేకానందునితో.
ఎన్నో దివ్య దృశ్యాలు, శక్తులూ, రామకృష్ణునిలో చూచిన తరువాత కూడా, తనకు సంశయ నివృత్తి కాలేకపోయినందులకు నరేంద్రుడు లజ్జతో, అవమానంతో శిరస్సు వంచాడు.
అదేకాక పోయినా, అలాంటి సంఘటనే సాయి జీవితంలోను జరిగింది. ఆనాడు దసరా – అక్టోబరు 6, 1916. సాయి భక్తులు సీమోల్లంఘనం చేసి ద్వారకామాయిలోనికి వచ్చారు.
సాయి వంటిమీద ఉన్న కఫ్నీ, లంగోటీ, తల గుడ్డ అన్నిటిని ధునిలో వేసి తగులబెట్టాడు.
ఆగ్రహావేశాలతో రౌద్రమూర్తి అయి చూడండి ”నేను హిందువునా? ముస్లింనా?” అని అరుస్తూ రెండు గంటలపైనే దిగంబరంగా ఉన్నారు.
బాబా ఆగ్రహానికి అందరూ భయకంపితులయ్యారు. ”బాబా ఇది పర్వదినం. ఎందుకు ఇలా చేస్తున్నారు?” అని అడిగారు కొందరు. ”ఇదే నా సీమోల్లంఘనం” అన్నారు సాయి కోపంగా.
భక్తులు బలవంతంగా నూతన లంగోటీ, కఫ్నీ, తలగుడ్డను ధరింపచేసారు. తరువాత సాయి శాంతించాడు.
అలనాడు వివేకానందునికి తన గురువుపై సందేహం కల్గినట్టు, సీమోల్లంఘనం నాడు సాయి హిందువా? ముస్లిమా? అనే సంశయం ఎవరికో కలిగి ఉంటుంది.
సాయి నగ్నమూర్తిగా ఉన్న సమయంలో ఆ సంశయం తీరి ఉంటుంది. వివేకానందుడు తన సందేహనికి తానే సిగ్గుపడ్డాడు. ఐతే సాయిని శంకించిన అనుమానగ్రస్తుని మానసిక పరిస్థితి మనకు తెలియదు
కనీసం నేడైనా, సాయి హిందువా? ముస్లిమా? అనే చింతన, పరిశోధన వదలి, ఆ తండ్రికి తగిన బిడ్డల మవుదాం – పరమత సహన విషయంలోనైనా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తీరిన కోరిక…. మహనీయులు – 2020… మార్చి 20
- తెలుసుకో ఈ నిజం…. మహనీయులు – 2020… మే 25
- సాయిబాబానా? రామకృష్ణుడా? …..సాయి@366 జూన్ 11….Audio
- నవ్య ప్రాచీన నవ్యుడు…. మహనీయులు – 2020… ఆగస్టు 16
- భక్తి పాదధూళి! … మహనీయులు – 2020 – జనవరి 17
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments