తీరిన కోరిక…. మహనీయులు – 2020… మార్చి 20



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా మీ కోర్కెలను తీర్చటానికే వచ్చానంటారు. అవతార పురుషులకు ఎవరు ఏది కోరినా ఇవ్వగల సామర్థ్యం ఉంటుంది.

ఒకసారి రామకృష్ణులు తనను ఆశ్రయించిన పిల్లులకు అసౌకర్యంగా ఉందన్నారు నిస్తారిణితో.

ఆమె వెంటనే పిల్లులను నేను తీసుకుపోయి సాకుతానన్నది. అప్పుడప్పుడు ఆమెను పిల్లులను గూర్చి అడిగేవారు రామకృష్ణులు.

ఆమె సంరక్షణలో ఏ లోపంలేదు. పిల్లికి, పిల్లి పిల్లలకు. ఒక రోజు తల్లిపిల్లికి హఠాత్తుగా జబ్బుచేసి చనిపోయింది.

అది చనిపోతున్నప్పుడు దాని నోట్లో గంగా జలం పోసింది నిస్తారిణి. ఇంకా ఆ సమయంలో గురుదేవుల నామాన్ని ఉచ్ఛరించింది.

సామాన్యులకు ఉత్తమ భక్తురాలు అటువంటివి చేయటం హర్షదాయకం కాదు. పరిణితి చెందిన వారు మాత్రమే గ్రహించగలరు గురువు కోర్కెను తీర్చటంలోని ఆనందాన్ని.

రామకృష్ణులు “నీకు అంతా మంచే జరుగుతుంది. నీ ఇష్టదైవ దర్శనం కలుగుతుంది” అన్నారు ఆమెతో. ఆమె ఇష్టదైవం రాముడు.

ఒకరోజు ఆమె మంత్రజపం చేస్తుండగా శ్రీరాముడు ప్రత్యక్షమవటం గమనించింది.

శ్రీరాముని పాద ధూళి స్వీకరించబోతుండగా శ్రీరాముని స్థానంలో తన ప్రియాతి ప్రియమైన గురుదేవులు ఉండటం ఆమె చూసింది.

అప్పుడు గురుదేవులు నవ్వుతూ “నేనెవరో ఇప్పుడు నీకు తెలిసింది కదా!” అన్నారు.

సాయిబాబా కూడా అరుంధతి అమ్మాళ్ కు రామునిగా దర్శనమిచ్చాడు. మహాత్ములు తమ భక్తుల ఇష్టదైవాలు, తాము, ఒకటిగా తెలుపుతారు.

శరీరం ఆమె స్వాధీనంలో ఉన్నంతకాలం, రామకృష్ణులకు ఇష్టమైన పదార్దాలను స్వయంగా తయారుచేసి నివేదన చేసేది ఆమె.

ఒకసారి ఆమె ఎవరితోనో “నువ్వు రకరకాల ఆధ్యాత్మిక సాధనలు చేసి ఉండవచ్చును. కానీ ఎలా మరణించాలో తెలుసుకోవటంలోనే నిజమైన విజయం ఉంది” అన్నది.

ఆ దినం మార్చి 20, 1932.

ఆమె మరణశయ్యపై ఉంది.

శ్రీరామకృష్ణుల చిత్తరువును తెమ్మన్నది. తెచ్చారు. ఆమెకు ఇచ్చారు. రామకృష్ణుల నామస్మరణ చేస్తూ, రామకృష్ణుల చిత్తరువును హృదయానికి హత్తుకుని, ప్రగాఢ ధ్యానమగ్నురాలైంది. ఆమె ప్రాణం మెల్లగా అనంత వాయువులలో కలిసిపోయింది.

నేడు మార్చి 20. నిస్తారణి అస్తమయదినం. ఆమెకున్నటువంటి భక్తి మనకునూ కల్గుగాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles