Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా దక్షిణను అందరివద్ద నుండి స్వీకరించేవాడు కాదు. ఒకసారి రామకృష్ణ పరమహంస మెడలో వేయటానికి, పూలదండతో ఆయనను సమీపించాడు సురేంద్రనాథ్ మిత్రా.
రామకృష్ణ పరమహంస ఆ మాలను అందుకొని ప్రక్కకు విసిరేశారు. సురేంద్రనాథ్ మిత్రా ధనవంతుడు. రామకృష్ణులు అలా చేయటంతో బయటకుపోయి కూర్చున్నాడు.
ఆ పూలమాలకై అతడెంతో ఖర్చుపెట్టాడు. ఆ వస్తువు విలువ పేద బ్రాహ్మణుడైన రామకృష్ణులకు ఏం తెలుస్తుందని తలచాడు.
మిత్రాలో అంతర్మధనం మొదలైంది. తన తప్పును తాను తెలుసుకున్నాడు. భగవంతుడిని ధనంతో కొనలేమనుకున్నాడు. గర్విష్ఠి భగవానుని పొందలేదు.
ధనవంతుడననే అహంకారంతో చేసే ఆరాధనను రామకృష్ణులు ఎందుకు స్వీకరిస్తారు. మిత్రాలో అహంకారం నశించింది.
ఇకముందెన్నడు అహంకారం దరిదాపులకు రాకుండా, రామకృష్ణులు మిత్రా అహాన్ని చావుదెబ్బ కొట్టారు. ఇక పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాడు.
మరల రామకృష్ణులున్న గదిలోనికి పోయాడు. రామకృష్ణులు ఆనంద పారవశ్యంలో నృత్యం చేస్తున్నారు. అంతేకాదు, విసిరిపారేసిన మిత్రా పూలమాల రామకృష్ణుని మేడలో ఉంది.
మనిషిలో కపట భక్తి లేనప్పుడు, భగవానుడు ఏ కానుకనైనా స్వీకరిస్తాడు.
రామకృష్ణుల వారి మొదటి తైలవర్ణ చిత్రాన్ని సురేంద్రనాథుడే గీయించాడు. ఆ చిత్రం శ్రీరామకృష్ణుల, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ, హిందూ మతాల సామరస్యాన్ని చూపిస్తుంది.
ఆ చిత్రాన్ని చూచి రామకృష్ణులు “దీంతో అంతా ఇమిడి ఉంది. ఆధునిక కాలానికి అది ఆదర్శప్రాయం” అన్నారు. అహంలేశమైనా లేకుంటే తప్ప, అటువంటి తైల వర్ణ చిత్రం గీయించుకోవటానికి రామకృష్ణులు అంగీకరించరు.
రామకృష్ణుల ఛాయాచిత్రాలు మూడు ఉన్నాయి. అందులో రెండవ చిత్రాన్ని సురేంద్రనాథుడే తీయించారు.
ఆ చిత్రాన్ని తీసే సమయంలో రామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. అంత క్రితమే భక్తి అనే పూతతో, మనస్సు ఎలా భగవంతుని ముద్రను నిలుపుకోవచ్చన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ చిత్రం శోభిస్తోంది.
అహంభావం లేనప్పుడు ఆ భక్తుడు ఇచ్చినవి స్వీకరించటమేకాక, ఏమి చేయాలో అనే ఆదేశాన్ని కూడా రామకృష్ణులు ఇస్తారు.
రామకృష్ణ పరమహంస మహాసమాధి చెందిన తరువాత, సురేంద్రనాథ్ మిత్రా తన పూజామందిరంలో ధ్యానం చేస్తున్నప్పుడు, రామకృష్ణులు దర్శనమిచ్చి “ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నివసించే చోటు లేక నా బిడ్డలు తిరుగాడుతున్నారు. ముందు ఆ వ్యవహారం చూడు” అని రామకృష్ణులు అంతర్దానమయ్యారు.
అది నిజమే. సురేంద్రనాథ్ మిత్రా ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటే ముందు ముందు శ్రీరామకృష్ణ సంఘంగా విరాజిల్లటానికి పునాది వేసింది.
మే 25, 1890న.సురేంద్రనాథ్ మిత్రా దేహాన్ని విడిచారు.
నేడు మే 25, సురేంద్రుని స్మరిద్దాం! ఆయనవలె అహాన్ని పారద్రోలుదాం!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తల్లికి తగిన బిడ్డ …. మహనీయులు – 2020 – జనవరి 30
- షిరిడీ నుండి హర్దాకు …..సాయి@366 జూన్ 7….Audio
- నవ్య ప్రాచీన నవ్యుడు…. మహనీయులు – 2020… ఆగస్టు 16
- ప్రేమ …. మహనీయులు – 2020… జూలై 13
- తీరిన కోరిక…. మహనీయులు – 2020… మార్చి 20
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments