షిరిడీ నుండి హర్దాకు …..సాయి@366 జూన్ 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా మహా సమాధి చెందక పూర్వం ఆయన జీవిత చరిత్రకారులు కొద్ది మందే. అలాగే చిత్రకారులు కూడా చాలా కొద్దిమందే.

అందుకనే ఆ చరిత్రకారులకు, చిత్రకారులకు చక్కటి పేరు వచ్చింది.

1914 ఏప్రిల్‌లో బొంబాయి నుండి శ్రీ ఎం.రామకృష్ణ రావు అనే చిత్రకారుడు వచ్చి సాయిబాబాను దర్శించాడు.

సాయినాథుని తేజస్సు ఆ చిత్రకారుని పులకింప చేసింది. చిత్రకారుడు పులకరిస్తే, ఆ పరవశం ఆయన అప్పుడు చిత్రించిన చిత్రంలో నిరంతరం కానవస్తుంది.

రామకృష్ణా రావు 2 1/2′, 2 1/2′ చిత్రాన్ని చిత్రించాడు. దానిని కాకా సాహెబ్‌ దీక్షిత్‌, కాకా మహాజని మొదలైన వారెందరో చూచి ఆనందించారు.

ఆ చిత్రం జూన్‌ 7, 1914న పూర్తయింది. ఇక ఆ చిత్రాన్ని సాయిబాబాకు చూపి ఆమోద ముద్ర పొందాలి.

గతంలో ఎవరో చిత్రకారుడు శ్యామా వద్దకు వచ్చి సాయిబాబా చిత్రాన్ని గీస్తాను, సాయిబాబా అనుమతి ఇప్పించండి అని కోరాడు.

సాయిబాబా వద్దకు వెళ్ళి అనుమతి అడిగాడు శ్యామా. ”నా చిత్రం దేనికి? నీ చిత్రమే గీయించుకో?” అని సాయి అన్నారు.

ఇక రామకృష్ణా రావు గీసిన చిత్రం గతి ఎలా ఉంటుందో అని ఆ చిత్రాన్ని చూచిన భక్తులు తల్లడిల్లారు.

ఏదైతే అది కానీ అని ఆ చిత్రాన్ని తెచ్చి ద్వారకామాయిలో ఉంచి, తెల్లని వస్త్రాన్ని కప్పారు.

మునుపటిలాగే శ్యామా సాయి వద్దకు పోయి ”ఈ చిత్రకారుడు మీ చిత్రాన్ని గీసాడు. మీరు చూస్తారా?” అని ప్రశ్నించాడు.

ప్రశ్న పూర్తి కాకుండనే సాయిబాబా ”ఏది ఆ చిత్రం? నా ముందుకు తే? నా చిత్రాన్ని ఎందుకు గీసారు? పట్టుకురా” అన్నాడు. సాయికి కోపం వచ్చిందని అందరూ గ్రహించారు.

చిత్రాన్ని సాయినాథుని ముందుకు తెచ్చారు. కండ్లను గుండ్రంగా తిప్పుతూ సాయి, సటకాతో ఆ చిత్రం వైపు గిరుక్కున తిరిగాడు. సటకాతో ఆ చిత్రాన్ని పొడిచేవాడే. కానీ, ఆగి పోయాడు సాయి.

వెంటనే శ్యామా ”దేవా! ఈ చిత్రాన్ని ఏం చేయమంటారు?” అని ప్రశ్నించాడు.

అప్పుడు బాబా అక్కడే ఉన్న చోటు భయ్యాతో ”ఈ చిత్రాన్ని తీసుకు వెళ్ళు. నీవు పట్టిన దంతా బంగారం అవుతుంది” అన్నారు సాయి.

ఆ చిత్రాన్ని హార్దాకు తీసుకు పోయాడు చోటు భయ్యా. ఇది ఆనందమే రామకృష్ణారావుకు.

సాయి లీల విచిత్రం- సాయి చేష్ట విచిత్రం-

విచిత్రం ఏమిటంటే సాయి చిత్ర దర్శనం ఆనందదాయకం.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles