తల్లికి తగిన బిడ్డ …. మహనీయులు – 2020 – జనవరి 30



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా యశ్వంత్ జనార్దన్ గాల్వంకర్ అనే భక్తుని గూర్చి మాట్లాడుతూ, అతను నీతి నిజాయితీలు గల సచ్చీలుడని, ప్రస్తుత జన్మలో ఉత్తమురాలైన తల్లి గర్భమున ప్రవేశ పెట్టానని చెప్పారు.

శ్యామసుందరి ధర్మపరాయణురాలు, ఆమె ప్రగాఢ ధ్యానంలోనికి పోతుందని అందరకు తెలుసు.

ఒకరు ఒక తేలును ఆమె ధ్యానంలో ఉన్న సమయంలో ఒడిలో వేశాడు. ఏమి కాలేదు. ఆమె కుమారుడే మన్మోహన్ మిత్రా. రామకృష్ణ పరమహంస భక్తుడయ్యాడు.

మన్మోహన్ మిత్రా అత్తగారు “నీ కుమారుడిని తరచు దక్షిణేశ్వరం వెళ్ళనివ్వకు. మిత్రా సర్వసంగ పరిత్యాగం చేస్తే నీవేమి చేయగలవు?” అని శ్యామసుందరిని ప్రశ్నించింది.

“నా కుమారుడు తన జీవితాన్ని సాధు సేవకు అంకితం చేసే సుదినం ఎప్పుడు వస్తుంది?” అని మిత్రా తల్లి మిత్రా అత్తగారిని అడిగింది. మిత్రా అత్తగారు అవాక్కయింది.

యాదృచ్చికంగా ఈ మాటలను మిత్రా విన్నాడు. అనంతరం రామకృష్ణుల వద్దకు వెళ్ళాడు.

రామకృష్ణులు అక్కడున్న వారితో “ఒక భక్తుడు నా దగ్గరకు వస్తుంటాడు. అది అతని అత్తగారికి నచ్చలేదు. ఆమె అతడి తల్లిని రెచ్చగొట్టి ఇక్కడకు రాకుండా చేయాలనీ ప్రయత్నిస్తోంది” అన్నారు.

మిత్రా ఆ మాటలను రామకృష్ణులు  తనను గూర్చి పలికారని గ్రంహించాడు. సర్వజ్ఞులైన రామకృష్ణులపై భక్తి హెచ్చింది మిత్రాకు.

ఒకసారి మిత్రా కుమార్తెకు జ్వరం వచ్చింది. అటువంటి సమయంలో కుటుంబాన్ని వదలి రామకృష్ణుల వద్దకు వెళ్ళటం తగదని భావించాడు.

తల్లి “ఆ గురుదేవుల వద్దకు వేళ్ళు, ఆ సమయంలో ఏ దుర్ఘటనా జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ విశ్వసాన్ని వ్యక్తం చేసే సమయమిదే” అన్నది కుమారునితో.

ఆ తల్లికి తగ్గ తనయుడు గురుదేవులను దర్శించాడు. మిత్రా కుమార్తెకు ఏ హాని జరగకపోవుటయే గాక ఆమె జ్వరము కూడా తగ్గి పూర్తి ఆరోగ్యవంతురాలైంది. ఇదంతయూ గురుదేవుల మహిమయే అని గుర్తించాడు మిత్రా.

ఒక పర్వదినం  నాడు మిత్రా ఇంట్లో కీర్తన ఏర్పాటయింది. తల్లి కుమారుని పిలిచి “ఈ రోజు నేను కీర్తన సమయంలో భగవన్నామమును వింటూ ఈ లోకాన్ని వదులుతాను.

ఎవరికీ చెప్పకు, నామ సంకీర్తనకు ఆటంకం రాకుండా చూడు” అన్నది. తల్లి నామ సంకీర్తన వింటూనే కన్ను మూసింది.

మిత్రా కూడా జనవరి 1903లో రామకృష్ణుల నామ శ్రవణంతోనే దేహాన్ని వదిలాడు.

రామకృష్ణులు వెన్నంటి యుండగా సర్వమూ ప్రశాంతమే గదా!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles