పుత్రోత్సాహం… మహనీయులు @2020 – జనవరి 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“నేను జన్మించినప్పుడు మా అమ్మ ఎంతో సంతోషించింది (ఆనందించింది)” అంటారు సాయిబాబా.

జనవరి 2, 1983  ప్రోఖోరు(ర్) జన్మించాడు. అప్పడు ఆ బాలుని తల్లి సంతసించిందో  లేదో తెలియదు.

ఆ పసివానికి జబ్బు చేసింది. మేరీమాత కరుణవల్ల ఆ జబ్బు నయమైంది. ఆ బాలుడే ప్రోఖోర్ పెద్దయిన తరువాత సెయింట్ సిరాపిం అయ్యాడు.

అతనికి చిన్నప్పటి నుండి యోగుల జీవితాలు చదవటం చాలా ఇష్టం. ఒకసారి ఆ బాలునికి స్వప్నంలో మేరీమాత దర్శనమిచ్చింది.

పద్దెనిమిదవ ఏట ఆ యువకుడు సన్యాసి అవుతానని తల్లికి చెప్పాడు.ఆ తల్లి సంతోషించింది.

ఒక రాగి శిలువ ఆభరాణాన్ని కుమారునకు బహుకరించింది. దానిని అతడు జీవితాంతం తనవద్దనే ఉంచుకున్నాడు.

సరోవ్ క్రెస్తవ ఆశ్రమంలో సిరాపిం ఆధ్యాత్మిక ఎదుగుదల కొనసాగింది. సాయి చెప్పినట్లు అతి తక్కువగా తినేవాడు, తక్కువగా నిద్రించేవాడు.

మరల ఒకసారి జబ్బుపడ్డాడు ఆ ఆశ్రమంలోనే. స్వప్నంలో మేరీమాత దర్శనమిచ్చింది. ఆ తల్లి అక్కడ ఉన్న జాన్ తో “ఇతను మనవాడే” అని సిరాపింను దండంతో తాకింది. ఆ జబ్బు నయమైంది.

ఆధ్యాత్మిక ఎదుగుదలేకాదు, ఆశ్రమంలో  పీఠం ఆయనను వరించింది. ఐనా అతను ఆశ్రమానికి కొద్దీ దూరంలో ఉండి ధ్యానం చేసేవాడు. అయన ప్రార్దించేటప్పుడు నడయాడే దేవతలు కనబడేవారు.

ఒక పవిత్ర గురువారంనాడు జీసస్ క్రైస్తు దర్శనమిచ్చాడు. అయన అడవిలో ఆశ్రమంలో ఉంటునప్పుడు క్రూరమృగాలు సైతం ఆయనవద్దకు వచ్చి నిలబడేవి. ఒక తోడేలు నోటికి ఆహారాన్ని అందించటం చూచిన వారున్నారు.

అడవిలో ఒకసారి అయన కట్టెలు కొడుతుంటే, దొంగలు చుట్టుముట్టారు. సిరాపిం బలిష్టుడు, పైగా చేతిలో గొడ్డలి ఉంది, ఇంకా ధైర్యస్థుడు కూడా.

కానీ ఆయన గొడ్డలిని క్రింద పడవేసి, చేతులు కట్టుకుని నిలబడ్డాడు. దొంగలు సొమ్ముకోసం వచ్చారు ఆయన వద్ద ఏమి దొరకకపోతే, చావుదెబ్బలుకొట్టి, చచ్చి ఉంటాడని నిర్దారించుకొని, ఆయన గుడిసెలోనికి పోయి వెతికారు.

వారికి ఏమీ లభించలేదు – ఒక శిలువ ప్రతిమతప్ప. ఆ దొంగలు పట్టుబడితే, సిరాపిం వారిని విడిపించేందుకు న్యాయాధికారితో మాట్లాడాడు కూడా.

ఎంతటి క్షమాగుణం! ఇది జరిగిన కొంతకాలం తరువాత ఆయన వెయ్యి రోజులపాటు ఒక కొండలో చేతులు పైకెత్తి ప్రార్థనలో మునిగిపోయాడు.

ఆయనకు వచ్చిన శక్తులు అపారం. ఎందరో తమ, తమ రుగ్మతలను, కోరికలను ఆయనకు చెప్పుకునేవారు. ఆయన దీవించేవాడు.

రష్యా దేశంలో మహాత్మునిగా పేరు తెచ్చుకున్నాడు. మరణానంతరం సెయింట్ అయ్యాడు. అప్పుడు కదా ఆ తల్లిదండ్రులకు నిజమైన పుత్రోత్సాహం.

ఆయన జన్మదినమైన ఈ రోజున జనవరి 2 న – ఆయన కోరినట్లు మనం శాంతమూర్తులై, చుట్టు ప్రక్కలవారి సౌఖ్యానికి తోడ్పడదాం.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles