Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అందరకు పుట్టగానే దైవ భీతి ఉండనక్కరలేదు. బాలా సాహెబ్ భాటే అనే ఒక తహసీల్ దార్ మహారాష్ట్రలో ఉండేవారు.
తిను, త్రాగు, అనుభవించు అనే తత్వానికి అలవడిపోయాడు. ఆస్తికులను దుయ్యపట్టేవాడు.
ఒకనాడు సాయిబాబాను కలిశాడు. సాయి భక్తుడైపోయాడు – ఎంతటి భక్తుడయ్యాడంటే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా కూడా పంపే ఆలోచనలేదాయనకు.
రామచంద్ర దత్తా ప్రభుత్వంలో ఉన్నత రసాయనిక పరీక్షాధికారి. వైద్య కళాశాలలో సైన్యానికి చెందిన వైద్య విద్యార్థులకు బోధకుడు.
“ఆ రోజులలో మెం భగవంతుడున్నాడని నమ్మలేదు. మేము పచ్చి భౌతికవాదులం. తినటం, నిద్రించటం, లైంగిక సుఖాలు జీవిత పరమావధిగా భావించేవారం” అన్నాడాయన.
ఆయనకు భగవంతుని గురించి, మతం గురించి, ఇతరులతో చర్చించటమంటే మహా ఇష్టం. ఎందుకంటే చర్చలో ప్రత్యర్థులను ఓడించి తృప్తిపొందేవాడు.
కొన్ని సంఘటనలు జీవితాన్నే మార్చివేస్తాయి. ఆయన చిన్న కుమార్తె అకాల మరణానికి తట్టుకోలేకపోయాడు.
రామకృష్ణుల సన్నిధికి చేరాడు మనశ్శాంతి కోసం. ఆయన సన్నిధివల్ల హానికరమైన, అనారోగ్య భావాలు నశింపసాగాయి.
భగవంతుని భక్తులను సేవించటం ద్వారా, శాంతి, ఆనందాలు లభిస్తాయని పరమహంస నొక్కి చెప్పారు.
రామచంద్ర దత్తాను రామకృష్ణులు దగ్గరకు తీయటం ఆశ్చర్యంగానే ఉంటుంది. లౌకిక జీవనం గడుపుతున్నా, అతడు సత్యపథం నుండి ప్రక్కకు తొలగలేదు.
ఒక వ్యాపారస్తుని నూనె తక్కువ ప్రామాణిక స్థాయిలో ఉంది. తగిన స్థాయిలో ఉన్నట్లు వ్రాస్తే 40 వేలు రూపాయలు ఇస్తానన్నాడు ఆ వ్యాపారస్తుడు.
రామచంద్ర అలా వ్రాయకుంటే వ్యాపారస్తునికి కొన్ని లక్షల రూపాయల నష్టం వస్తుంది. రామచంద్ర లంచానికి లొంగలేదు. రామకృష్ణులు సత్యానికి పెద్ద పీత వేసేవారు.
ఒకసారి సాయిబాబాకు షిరిడీలో నూనె వ్యాపారులు నూనె ఇవ్వలేదు. తమవద్ద నూనె లేదన్నారు.
సాయి తనకు నూనె ఇవ్వనందుకు చింతించలేదు, వ్యాపారస్తులు అబద్దం చెప్పినందుకు విచారించారు.
రామకృష్ణుల జీవిత చరిత్రను ప్రచురించిన మొదటి వ్యక్తి అతడే. ఆయన అవతార పురుషుడని విశ్వసించి, ప్రచారం చేసిన ప్రథముడూ ఆయనే.
రామకృష్ణుల మహా సమాధి చెందారు. రామచంద్రకు ఉబ్బస వ్యాధి వచ్చింది. నిద్రపట్టని రాత్రులు గురుదేవుల నామాన్ని స్మరించేవాడు.
రామచంద్ర “నా మరణానంతరం నా చితాభస్మంతో కొంత యోగోధ్యానం ముఖద్వారం క్రింద పాతిపెట్టండి.
యోగోధ్యానంలోనికి వచ్చేవారు నా తలమీదుగా నడిచిపోతారు. ఆ విధంగా గురుదేవుని భక్తుల పాదస్పర్శ సదా నేను పొందగలుగుతాను” అన్నారు.
ఆయన జనవరి 17, 1899న తుది శ్వాస విడచి రామకృష్ణునిలో ఐక్యమయ్యాడు.
రామచంద్రుని భక్తి ఆదర్శమగును గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తల్లికి తగిన బిడ్డ …. మహనీయులు – 2020 – జనవరి 30
- రామచంద్ర మాలిక్ ఊది! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 27
- సౌందర్య లహరి…. మహనీయులు – 2020… ఆగస్టు 20
- తీరిన కోరిక…. మహనీయులు – 2020… మార్చి 20
- చెప్పుదెబ్బలు …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 28
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments