సౌందర్య లహరి…. మహనీయులు – 2020… ఆగస్టు 20



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“సాయిబాబా  తమ మోమును మృదు మధుర మందహాసాలొలికిస్తూ చూపారు. ఒక్కసారైనాసరే, అలా చూడటం కోసం ఇక్కడ (షిరిడీలో) ఎంతకాలమైన పడి ఉండవచ్చు” అంటారు సాయి దరహాస వదనాన్ని దర్శించిన ఆనందంలో కపర్డే.

భగత్ సేన్ జీ (సేనానహ్వి) వృత్తి రీత్యా మంగలి. రామానందుని శిష్యులలో ఒకరు. స్నానానంతరం పూజ చేసుకుంటేగాని, అయన గడపదాటడు.

ఒకసారి అతని కోసం నవాబు కబురు పెడితే, భార్య తన భర్త పూజకు భంగం అవుతుందని, ఇంట్లో భర్త లేడని చెప్పింది.

భగవంతుడు తన పూజ నిమ్మిత్తం వృత్తి ధర్మాన్ని మానమని చెప్పడు. సేనానహ్వి నవాబు దగ్గరకు వెళ్ళాడు.

ఎప్పటిలాగే, ఒక నూనె గిన్నెలో నూనె  పోసి, తల అంటుతున్నాడు. యాదృచ్చికంగా నవాబు నూనె గిన్నెలోకి చూచాడు.

శంఖు చక్ర గద పద్మ హస్తుడైన మాధవుడు కనిపించాడు. నవాబు కన్నులార్పకుండా, ఆ సుందరమూర్తిని చూడసాగాడు.

సేనానహ్వి నవాబును గమనించాడు. నవాబు ఆనందంతో నహ్వికి అనేక బంగారు నాణేలు ఇచ్చాడు. నహ్వి వెళ్ళిపోయాడు.

ఆ నవాబుకు మరల ఆ సుందర రూపాన్ని చూద్దామనిపించి, కబురు చేసాడు నహ్వికి. సేనానహ్వి ఎప్పటిలాగే వచ్చి గిన్నెలో నూనెను పోశాడు.

నవాబు ఆత్రంగా నూనె గిన్నెలో చూచాడు. సుందర విగ్రహం కనిపించలేదు. ఎన్నిసార్లు చూసినా కనిపించలేదు.

“నీ నూనె గిన్నెలో మరల విష్ణు రూపం కనిపించదేమిటి?’ ప్రశ్నించాడు నవాబు. సైనాకు ఏమి అర్థంకాలేదు.

ఉదయం జరిగిన సంఘటనను గూర్చి నవాబు చెప్పాడు సేనాకు. సేనాకు అప్పుడు అరమైంది. తాను పూజ చేసుకుంటున్న సమయంలో, తన పూజకు భంగం కలగకూడదని మాధవుడే తన రూపంలో వచ్చినాడని,

తన దివ్యరూపాన్ని నూనె గిన్నెలో చూపాడని అర్ధం చేసుకుని, ఉదయం తన రూపంలో వచ్చింది మాధవుడేనని, ఆయనే తన రూపాన్ని నూనె గిన్నెలో చూపాడని, నవాబు అదృష్టవంతుడిని చెప్పాడు సేనానహ్వి.

ఎలాగైనా మరల ఆ సుందర రూపాన్ని చూపమని నవాబు సేననహ్విని కోరాడు. సేనానహ్వి, మాధవుని ప్రార్ధించాడు.

నవాబు కోసం,  మరల చతుర్భుజుడు ప్రత్యక్షమైనాడు. ఆ ఇద్దరు తనివితీరా మాధవుని తిలకించారు.

సేనానహ్వి మందిరం హుబ్లీ స్టేషన్ వద్ద ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో (సాధారణంగా ఆగస్టులో వస్తుంది) కృష్ణపక్షంలో ద్వాదశినాడు ఉత్సవం చేస్తారు.

సేనానహ్వి కీర్తన గురు గ్రంధ్ లో చేర్చబడింది.

సాధనకు ఎక్కడికో వెళ్లనక్కరలేదు. ఇంట్లోనే ఉండి స్వధర్మాన్ని శ్రద్దగా నిర్వహిస్తే, భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవచ్చు. ప్రతి క్రియలోను భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవచ్చు.

మంగలి వృత్తిలో జుట్టును కత్తిరించటం అంటే, ప్రపంచంతో మమేక భావాన్ని కత్తిరించుకుని, భగవత్ సాన్నిధ్యానికి దగ్గరవటమే అంటారు సేనానహ్వి.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles