చెప్పుదెబ్బలు …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 28



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా భక్తుడైన దాసగణు ఒక క్రొత్త ఆచారాన్ని నెలకొల్పాడు – అది ఏమిటంటే – శ్రీరామనవమి నాడు కోపర్ గాం వద్ద ప్రవహించే గోదావరి జలాలను తెచ్చి సాయినాథుని పూజలో వినియోగించటం.

రామకృష్ణ పరమహంస భక్తుడైన గిరీష్ చంద్ర ఘోష్ నాటకాలలో నటించే ప్రతి నటుడు, ప్రతి నటీమణి శ్రీరామకృష్ణుల చిత్తరువును నమస్కరించాలనే నూతన సంప్రదాయాన్ని నెలకొల్పాడు.

గిరీష్ బెంగాలీ నాటకరంగంలో గొప్ప ప్రయోక్త, నటుడు, రచయిత.

ఒకనాడాయన నటిస్తుండగా, ఆ నాటకాన్ని ప్రఖ్యాత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు తిలకిస్తున్నాడు.

ఒక దృశ్యంలో గిరీష్ ఒక స్త్రీని నానా దుర్భాషలాడుతున్నాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు ఎంతో చలించిపోయాడు – దుర్భాషలాడుతున్న ఆ పాత్ర (అంటే గిరీష్ చంద్ర)పై తన చెప్పును విసిరాడు.

ఆ నటుడు వెంటనే ఆ చెప్పును తీసుకుని తన తల మీద పెట్టుకుని ప్రేక్షకులకు సలాం పెట్టి, తాను ఇంత గొప్ప ప్రశంసను ఎన్నడూ పొందలేదని సంతసించాడు.

నాటకరంగంపైనే ఆయన జీవించలేడు. ఆ మహానటుడు పచ్చి తిరుగుబోతు, త్రాగుబోతు, గర్విష్టి.

ఒకసారి ఆయన రామకృష్ణులతో “మహాశయా! నేను కూర్చున్న బోటు సైతం అపవిత్రమైపోతుంది” అన్నాడు.

“అది నువ్వెలా చెప్పగలవు? వేల సంవత్సరాలుగ చీకటిలో మ్రగ్గుతున్న గదిలోనికి దీపం తెచ్చాననుకో, అది కాస్త ఆ గది ప్రకాశవంతమవుతుందా? లేక క్షణకాలంలోనే అవుతుందా?” అని అన్నారు రామకృష్ణులు.

“క్షణకాలం పట్టదు” అన్నాడు గిరీష్. రామకృష్ణుల పోలిక తనను గూర్చి అని తెలుసుకున్నాడు.

ఇక రామకృష్ణులనే తన జీవిత రథసారథిగా చేసుకున్నాడు. రామకృష్ణుల అనుంగు శిష్యులలో ఒకడయ్యాడు.

రామకృష్ణ ఫల వృక్షాన్ని అంటి పెట్టుకుని ఉన్న పూవు గిరీష్. ఆ పూవు కాయగా మారింది.

ఒకసారి గాలి వీచింది. ఆ కాయ కొంచెం ఊగింది. అంతే, ఒకసారి గిరీష్ కు మరణానంతరం తానెక్కడకు పోతానో అనే సంశయం క్షణకాలంపాటు కలిగింది.

వెంటనే తమాయించుకున్నాడు. అదే క్షణం రామకృష్ణుని మరో భక్తుడు మహేంద్రనాథ్ వచ్చాడు “మీ చెప్పులతో నన్ను కొట్టండి, నేను తమాషాగా మాట్లాడటం లేదు అన్నాడు.

గిరీష్ మాటలో “కారణం ఏమిటి?” ‘మ’ ప్రశ్నించాడు. “నిజంగా చెప్పాలంటే, నేను చెప్పుదెబ్బలకు అర్హుణ్ణి. శ్రీరామకృష్ణులు నా హృదయంలో సదా కొలువై సంరక్షిస్తుంటే, నేను నా మరణానంతరం ఏమవుతుందోనని యోచిస్తున్నాను” అన్నాడు గిరీష్

క్షణకాలం గాలికి ఊగిన ఆ కాయ రామకృష్ణ మహావృక్షాన్నే అంటిపెట్టుకుని పండింది.

ఫిబ్రవరి 28 (1844) గిరీష్ జన్మదినం.

గిరీష్ వలె మనం మన సద్గురువును అంటిపెట్టుకుని ఉందుము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles