“వాడు నన్ను నమ్ముకొని షిరిడికి వచ్చాడు. మీకు నేను చాలా డబ్బులు ఇచ్చాను కదా! డబ్బు కోసం అతన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు.”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


1998 లో కొయ్యల గూడెం రాక ముందే మా గురువు గారు మేము అందరం కలిసి బస్సు మాట్లాడి దత్త క్షేత్రాలు తిరిగాము.

అందులో భాగంగానే షిరిడి కూడా వచ్చాము. అన్ని దత్త క్షేత్రాలు చూసి వచ్చాము.

నేను బయలుదేరేముందు నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాను మా గురువు గారితో.

ఆయన ఆ విషయం పక్కన పెట్టి బయలుదేరు అన్నారు. అప్పటికే బాబా ధ్యాసలోనే ఎక్కువ సమయం గడుపుతున్న నేను బాబా దర్శనం వల్ల నేను పొందిన అనుభవం ఇది అని, ప్రత్యేకంగా నేను ఏమి చెప్పలేను.

నేను ఎక్కువగా కలల్లో షిరిడీ పుర వీధుల్లోనే సంచరిస్తూ ఉండేవాడిని. నాకు కొయ్యల గూడెంలో మూడు సంవత్సరాలు పూర్తి అవ్వగానే భువనేశ్వర్ దగ్గర చిన్న పల్లెటూరికి ట్రాన్సుఫర్ చేసారు.

అక్కడ రెండు మూడు కుటుంబాలు తెలుగు వారు ఉన్నారని తెలుసుకొని నేను వారితో పరిచయం చేసుకున్నాను.

వాళ్ళు సత్య సాయి భక్తులు. ఒక రోజు వాళ్ళు నగర సంకీర్తన చేస్తూ తిరుగుతున్నప్పుడు నేను కాకడ హారతి పడుతున్నాను. అది విని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు.

అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సత్య సాయి భక్తులు అవడం వల్ల ఎక్కువగా సేవ కార్యక్రమాలు, రోగులకు మందులివ్వడం, గదులను శుభ్రపరచడం, దుప్పట్లు పంచడం, ఇలాంటి కార్యక్రమాలు బాగా చేసేవాళ్ళు.

వాళ్ళతో నేనూ వెళ్ళేవాడిని. అక్కడ మూడు సంవత్సరాలు సరదాగా ఎలా గడిచిపోయాయో గడిచిపోయాయి.

ఆ తర్వాత నేనూ ట్రాన్సుఫర్ అంటే అక్కడా ఇక్కడా కాదు షిరిడీలోనే అయితే బావుంటుందనిపించి షిరిడి బ్రాంచి లో ఏమైనా అవకాశం ఉంటుందా అని నేనూ వాకబు చేశాను.

ప్రస్తుతం ఏం ఖాళీ లేదు ఉంటే మాత్రం తప్పకుండా మిమ్మల్ని రికమండ్ చేస్తానన్నాడు ఆఫీసర్.

ఆయనపై ఆఫీసర్ తో తప్పకుండా నేను మాట్లాడి పెడతాను. ఏ మాత్రం షిరిడి లో అవకాశం ఉన్నా మిమ్మల్ని వేయమని చెబుతాను అన్నాడు.

ఆ తర్వాత షిరిడి లో ఖాళీ లేకపోవటాన ముంబై లో వేశారు. మొత్తానికి మహారాష్ట్ర లో పడ్డాను.

ఒక సారి షిరిడి లో ఖాతాదారుల మీటింగ్ పెట్టారు మా బ్యాంకు వాళ్ళు. ఇక్కడ మా బ్యాంకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని అడిగారు. అంతా బాగా ఉన్నాయి అన్నారు.

మా వాళ్ళు అనుకున్నారట ఇక్కడ బిజినెస్ బావుంది కానీ మన స్టాఫ్ తక్కువగా ఉన్నారు, వేరే ఎక్కడినుంచైనా మన మనిషిని ఇక్కడ వేస్తే బావుంటుందన్న ఆలోచన చేసారట.

అప్పటికే నేను షిరిడి రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలుసు కాబట్టి నన్ను ముంబై నుండి షిరిడీ కి ట్రాన్సుఫర్ చేసారు అలా నేను షిరిడీ కి చేరుకున్నాను .

నేను షిరిడీకి వచ్చాక ఇక్కడ చాలా పని ఉండేది. స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు.

వెంట తీసుకొని వెళ్లిన టిఫిన్ బాక్స్ మూత తీయడానికి కూడా ఒక్కోసారి సమయం ఉండేది కాదు. అంత పని ఉండేది .

షిరిడీ లో నేను ఒక ఇంట్లో అద్దెకుంటుండే వాడిని. గుడికి చాలా దగ్గరగా ఉందని అది తీసుకున్నాను.

నేను ఏదైనా పారాయణ చెయ్యాలి అంటే మధ్యలో అటు తిరిగే వాళ్ళకి లేచి పుస్తకాన్ని పక్కకు జరిపితే తప్ప అవతల మనిషి ఇవతలికి రావడానికి అవకాశం లేనంత ఇరుకుగా ఉండేది.

అలాంటి ఇంట్లో మేము ఉండేవాళ్ళం. ఆ సమయం లో ఇక్కడేదైనా ఇంటి స్థలం చూసుకో  కొనుక్కోవడానికి అని మా గురువు గారు అన్నారు.

నాకు ఆర్ధిక పరిస్థితి అంతగా బాగా లేదు కదా అని అనుకున్నాను.

నాకు ఒక రోజు ఒక కల వచ్చింది. ఆ కలలో,  ఒక ఇల్లు దానికి తోరణాలు, కొబ్బరాకులు కట్టి ఉన్నాయి. గోడలకి సున్నం మరకలున్నాయి.

”నేను గుడికి వెళ్లి వస్తాను, నువ్వు తలుపులు వేసుకో” అని నేను మా ఆవిడకి చెబుతున్నాను. అదీ కల.

అదే కల రెండవ రోజు కూడా వచ్చింది. ఆ కల గురించి మా గురువు గారికి ఫోన్ చేసి చెప్పను. ”నువ్వు షిరిడి లో ఇల్లు కట్టుకొని ఉండమని బాబా చెబుతున్నట్లు ఉన్నారు”.

నువ్వు ”స్థలం కోసం ప్రయత్నించు” అని చెప్పారు. నువ్వేమీ ఆలోచించకు అన్నీ ఆయనే చూసుకుంటారు అని చెప్పారు.

అనుకోకుండానే బ్యాంకు లో కూలర్ అవీ బాగుచేసేటటువంటి కస్టమర్స్ ఉన్నారు.

వాళ్ళు ఒక రోజు మా బ్యాంకు కి వచ్చారు. ”ఇక్కడేమైనా ఇళ్ల స్థలాలు దొరుకుతాయా నేను ఇక్కడే ఉండి పోదామనుకుంటున్నాను అని చెప్పాను.”

సరే నండి మా ఇంటి దగ్గర ఒకళ్ళున్నారు. వాళ్ళు ముంబై లో ఉంటారు. ఇక్కడ వాళ్ళకో స్థలం ఉంది వాళ్ళా స్థలాన్ని అమ్మేద్దామనుకుంటున్నారు. ఈస్ట్ ఫెసింగ్, 130 గజాలు ఉందన్నారు.

”సరే అయితే కనుక్కోమని” చెప్పాను. వాళ్ళు ముంబై వాళ్ళకి ఆ స్థలం ఎంత ఖరీదు చెబుతున్నారో వాళ్ళని బ్యాంకు నుండి ఫోన్ చేసి కనుక్కున్నారు.

మూడు లక్షలని చెప్పారట. నాకా విషయం చెప్పారు. నేను అన్నాను ”సరే లేవయ్యా మూడు లక్షలు నాకు చేరినప్పుడు నేను మాట్లాడతాను” అన్నాను.

ఒక వారం తర్వాత మళ్ళీ ఆ కుర్రాళ్లు వచ్చి సార్ వాళ్ళు ఫోన్ చేసారు. మీరా స్థలం తీసుకోండి సార్ అన్నారు.

”ఏం తీసుకుంటావయ్యా అంత రేటు చెబుతున్నారు” అన్నాను నేను.

వీళ్ళు మళ్ళీ ముంబై కి ఫోన్ చేసారు. ఆయన తీసుకుంటారట మీరు కొంచెం తగ్గించండి అని అడిగారు.

వాళ్ళు ”సరే రెండు లక్షల యాభై వేలకి అయితే ఓకే అన్నారట.”

”నేను మళ్ళీ ఆ డబ్బు జమైన తర్వాత చూద్దాం అన్నాను. ఆ కుర్రాళ్ళు తీసుకోండి సార్ ఈ రేటులో ఈ ఊరిలో ఎక్కడా రాదు అన్నారు.

ఈ లోపులో 2006 లో ముంబై లో వరదలు వచ్చాయి. ఆ వరదలకి మా బ్యాంకు వాళ్ళు కొంత ఫండ్ ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇచ్చారు.

మా బ్యాంకు వాళ్ళు అందులో కొంత నాకు ఇప్పించారు. అలా కొంత డబ్బు ఏర్పాటు చేసుకున్నాను.

నాకు ఆ స్థలం తాలూకా ముంబై పార్టీ వాళ్ళు నాకు తిన్నగా ఫోన్ చేసారు. ఏమండీ ఆ స్థలం అడిగారు. మళ్ళీ ఇంకేం మాట్లాడలేదు ఏం చేసారు అని అడిగారు.

తగ్గించండి అప్పుడు తీసుకుంటాను అన్నాను. అది కాదు గానీ అసలు మీరు ఎంత అయితే పెడతారండీ అని అడుగుతున్నారు. ఈ లోపు వాళ్ళింటవిడ లైన్లోకి వచ్చింది.

ఒక ముసలాయన మా ఆయనకి రోజు కలలో కనపడి వాడు నన్ను నమ్ముకొని షిరిడికి వచ్చాడు. మీకు నేను చాలా డబ్బులు ఇచ్చాను కదా! డబ్బు కోసం అతన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, అని మా ఆయన్ని తెగ తిడుతున్నారట. మనశాంతి లేకుండా చేస్తున్నారు.

మీరు ఎంత ఇవ్వగలరు సార్ మీరు అన్నారు.” లక్షా యాభై వేలు ఇవ్వగలను” అన్నాను.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles