Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
వినోబాభావే బెంగాలును పర్యటించి, విశ్వ విఖ్యాత రాజా రామమోహన రాయ్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్లకంటే చెతన్య మహాప్రభు పేరు పల్లెపల్లెలయందు వినబడినదని తెలిపారు.
జనన్నాథ మిశ్రునకు వరుసగా ఎనిమిది మంది స్త్రీ సంతానం కలిగింది. అనంతరం జన్మించిన విశ్వరూపుడు సకల శాస్త్ర పారంగతుడై, ఆధ్యాత్మికచింతన ఎక్కువై సన్యసించి పడరీపురం వెళ్ళిపోయాడు.
చివరగా ఆయనకు మరొక శిశువు జన్మించాడు. వేప చెట్టు క్రింద జన్మించాడు కనుక నిమాయి అనేవారు.
పండితులు ఆ బిడ్డడు జగద్విఖ్యాతి చెందుతాడన్నారు. విశ్వంభరుడు అనే పేరు పెట్టారు. ఈయనే తరువాత కాలంలో చైతన్య ప్రభువుగా పేరు గాంచాడు.
అన్నవలె నిమాయి కూడా సన్యసిస్తాడని విద్య నేర్పించలేదు. కాని చివరకు నేర్పించక తప్పలేదు.
18 ఏండ్ల ప్రాయంలో ఆయన విద్య నభ్యసిస్తున్నప్పుడు కాశీ నుండి తపన మిశ్రుడనే వృద్ధ పండితుడు వచ్చి ఆయన పాదాలపై వ్రాలాడు.
“మహాత్మా నేను చిరకాలం నుండి ఈశ్వర తత్వమును తెలుసుకొనగోరినాను. సాధనము చేసి ప్రయోజనము లేదని గ్రహించాను.
ఒకనాటి రాత్రి అశరీరవాణి చైతన్యుని ఆశ్రయింపుము అని పలికింది. నా కోర్కెను తీర్చండి” అని వేడుకున్నాడు వృద్ధ పండితుడు. చైతన్యుడు ఆయన సమస్యను తీర్చాడు.
గంగాధర పండితుని వద్ద ఆయన తర్కవ్యాకరణములు నేర్చుకొంటుండగా, తోటి విద్యార్థికి చైతన్యులు తాను వ్రాసిన గ్రంథాన్ని తెచ్చి చూపాడు.
ఆ తోటి విద్యార్థి ఆ గ్రంథాన్ని చదివి కన్నీరు కార్చాడు. కారణం అడిగాడు చైతన్యుడు.
“నేనును ఇటువంటి గ్రంథమును రచించుచున్నాను. నీ గ్రంథము చదివిన వారు నా గ్రంథమును చదువరు” అన్నాడు.
చైతన్యుడు ఏ మాత్రము సంకోచింపక తాను రచించిన అద్వైత ప్రకాశమును గంగలో పారవేశాడు. ఇది చైతన్యుని ప్రవర్తన.
ఆ స్నేహితుడు “నిమాయ్, నీ త్యాగశీలం ఆచంద్రార్కం నిలుస్తుంది” అన్నాడు.
చైతన్యుడు జన్మించింది పేరు ప్రతిష్టలు పొందేందుకు కాదు. ప్రజానీకానికి దైవ చింతనను నేర్పి ప్రభావితం చేసేందుకే ఆయన జన్మించాడు.
సన్యాసం స్వీకరించాడు. నామ సంకీర్తనను ప్రోత్సహించాడు. దుర్జనులు సైతం సజ్జనులయ్యారు ఆయన అపార కరుణతో.
కృష్ణ భక్తి ప్రచారమే ఆయన ఊపిరి అయ్యింది. ఒకరేమిటి, ఆయనను దర్శించిన వారందరకు ఆయన శుద్ధ ప్రేమ అందింది. చెతన్యవంతులైనారు ప్రజలు.
ఆయన కుల, మత ప్రసక్తి లేని కృష్ణ భక్తి సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.
ఆయన ఫిబ్రవరి 18, 1486న జన్మించాడు.
ఆయన జన్మదినం నాడు చైతన్య మహాప్రభువును స్మరించెదము గాక!
హరేరామ హరేరామ రామరామ హరేహరే!
హరేకృష్ణ హరేకృష్ణ హరే హరే!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కొడుకు పుట్టాల! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 14
- రాముడే చూసుకుంటాడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 19
- శ్రమ విలువ…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 15
- ప్రకాశించే ప్రసాదం …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 23
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments