”గురువుకి దండం పెట్టాలి, నేను ఆయనికే దండం పెడతాను, రాముడికి, కృష్ణుడికి కూడా గురువులున్నారు. అందుకని గురువుకి దండం పెట్టాలి “.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు సరస్వతి, నేను వృత్తి రీత్యా డాక్టర్ ని ,హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఉంటాము. మా అమ్మ నాన్నలు బాబా భక్తులు.

నాకంతగా బాబా తెలియదు. నేను అమ్మవారి పూజలు చేసేదాన్ని, అమ్మవారి ధ్యానం చేస్తూ, రుద్రాక్షలు తిప్పిమరీ చేస్తుండేదాన్ని. నా కంటే ముందు మా తమ్ముడికి పెళ్లి అయింది.

అమ్మా వాళ్ళు కేశవయ్య స్వామిజీని, తమ్ముడికి సంతానం కోసం అడగడానికి వెడితే, ఆయన తమ్ముడికి ఎప్పుడు సంతానం అవుతారో చెప్పి నా గురించి ”మీ అమ్మాయిని బాబా తాను స్వయంగా చూసుకుంటానని చెప్పా” డంటూ మా వాళ్ళకి చెప్పారట .

ఆ తర్వాత నాకు తరచుగా ఒక కల వస్తూ ఉండేది . అది ఏమిటంటే గురుస్థాన్ లాంటి స్థలం లో , అక్కడంతా బాగా వెలుతురుగా ఉంది, అందులోకి బాబా నన్ను చేతులు చాపి ఆ వెలుగులోకి పిలుస్తున్నాడు .ఆ కల నాకు ఒక్కసారి కాదు తరచూ వస్తూ ఉండేది.

నేనీయన భక్తురాలిని కూడా కాదు మరి నన్నెందుకు ఈయన ఇలా పిలుస్తున్నాడు అనుకునేదాన్ని. ఆ సమయంలో అమ్మా వాళ్ళు శిరిడి కి వెళుతూ నన్నూ రమ్మంటే నేను రాను అన్నాను.

వాళ్ళు వెళ్లి వచ్చేటప్పటికి నేను చూడడానికి వెళ్ళాను . అప్పుడే నేను అక్కడ ” శ్రీ సాయి సచ్చరిత్ర ” పుస్తకం చూసి , ఆ పుస్తకం అక్కడే తెరిచాను .

ఇందులో నాకు ఈయన నన్నెందుకు ఇలా పిలుస్తున్నాడో తెలుస్తుందేమో అనుకున్నాను.

తెరిచేటప్పటికి ‘‘వారి కర్మలు తీరినప్పుడు నేను వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా దరికి చేర్చుకుంటాను” అని కనపడింది.

వెంటనే నేనా పుస్తకం ఇంటికి తీసుకువచ్చి ఎక్కడ సమయం ఉంటే అక్కడ చదువుతూ వారం రోజులలో పూర్తి చేశాను.

ఆ రోజు ఆదివారం, మధ్యాహ్నానికి పూర్తి చేశాను, ఆ పుస్తకం లో బాబాకి నైవేద్యం పెట్టాలి అని రాసి ఉంది,

నేనదేమీ పట్టించుకోకుండా ఎదో మాములుగా చదివానులే అనుకుంటూ ఉండగానే కిందనుంచి ఏవో ఘుమ ఘుమలు వస్తున్నాయి ,

నేను వెళ్లి చూస్తే మా వంటమ్మాయి నేను చెపితేనే గాని చెయ్యనిది ఆ రోజు నేను చెప్పకుండానే సమోసాలు చేస్తోంది, నేనా అమ్మాయిని అడిగాను , ” ఈ రోజు ఎందుకు చేస్తున్నావు?” అని

”ఏమి లేదమ్మా ఈ రోజు ఆదివారం కదమ్మా, సారు మీరు ఇంట్లో ఉన్నారు కదా వేడి వేడిగా తింటారు కదా అని చేశానమ్మా! అంది.

సరే అని నేను తీసుకెళ్లి అప్పుడే అమ్మ వాళ్ళు శిరిడి నుంచి తీసుకువచ్చి న బాబా ఫోటో దేవుడు  గదిలో ఉంచి, దాని ముందు ఆ సమోసాల ప్లేట్ ఉంచాను.

ఇలా పెట్టి నేను చూస్తూనే ఉన్నాను, ఎక్కడినుంచో ఒక పిచ్చుక వచ్చి బాబా ఫోటో మీద వాలి ముందుకు వంగి మరీ నేను పెట్టిన సమోసాని పొడిచి పొడిచి మరీ తినేసింది .

అప్పటినుంచి  నేను అమ్మవారితో పాటు బాబాకి కూడా ఏదొక నైవేద్యం పెడుతున్నాను. ఆ సమయంలో మా బావగారబ్బాయి మా ఇంట్లో నే ఉండి చదువుకుంటున్నాడు,

అతను ఒక రోజు  ”పిన్నమ్మా! రోజూ మీరు బాబా ముందు పెడుతున్న ప్రసాదం ఒక పిచ్చుక వచ్చి తిని వెడుతోంది” అని చెప్పాడు.

నా మనసెందుకో కలతపడింది నేను చాలా రోజులుగా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను, ఇన్నాళ్లూ అది ఆ అమ్మ తింటున్న దాఖలాలు లేవే అని.

ఆ సమయంలో మా భార్యాభర్తలిద్దరికీ ఒకే రకమయిన కల వచ్చింది. అదేమిటంటే, నాకేమో మా అమ్మానాన్న మా ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నారు,

నేను వాళ్ళకి వడ్డిస్తున్నాను, మా అమ్మ ”చూడవే చూడు నేను నువ్వు పెట్టినవన్నీ తింటున్నాను, నాకు సరిగా వడ్డించు, నీ తర్వాతి కానుపు కూడా నేనే చూసుకుంటాను” అంటోంది.

మా వారికేమో  వాళ్ళమ్మ గారు ఆయన చిన్నప్పుడే పోయారు అందుకని నేనే ఆయన కలలోకి వచ్చి టేబుల్ పైన కూర్చొని అన్నీ వడ్డించుకొని, జుట్టు విరబోసుకొని, చాలా లావుగా ఉండి, భోజనం చేస్తున్నానట ఆలా ఆయనకీ కల వచ్చిందట,

నువ్వు పెట్టిన ప్రసాదం నేను కూడా తింటున్నానని అమ్మవారు చెప్పినట్లనిపించింది.

అప్పుడు అమ్మవారు  ”నేను బాబాకి దండం పెడతాను, నువ్వు కూడా దండం పెట్టు” అని చెప్పింది.

అప్పుడు నేను ”అమ్మా నువ్వుండగా బాబాకెందుకు దండం పెట్టడం” అని అంటే

”గురువుకి దండం పెట్టాలి, నేను ఆయనికే దండం పెడతాను, రాముడికి, కృష్ణుడికి కూడా గురువులున్నారు. అందుకని గురువుకి దండం పెట్టాలి ‘. అని అమ్మవారు నాకు చెప్పింది .

కలలోనే ఇదంతా , ఆవిడ బాబా ముందు నిలబడి తానూ పెడుతూ నన్నూ పెట్టమనేది .

స్వామి తపోవన్ మహారాజ్ గారు ( wondering in the himalayas ) అనే పుస్తకంలో

”గురువు , దేవుడు ఇద్దరూ ఒక్కసారే ప్రత్యక్షమైతే, ముందు గురువుకే దండం పెట్టాలి, ఎందుకంటే దేవుడు కంటే కూడా గురువే గొప్పవాడు .

దేవుడిని చూపించేదే గురువు, ఆయన చూపించక పోతే దేవుడికి స్థానం లేదు. గురువు మాత్రమే బ్రహ్మ జ్ఞానం ఇవ్వగలడు” అని రాసారు .

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles