Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాబా హారతులు (మనకి) చాలా ముఖ్యమైనవి. హారతులనేవి మన జీవితాలలో మనల్ని గమ్యానికి చేర్చే మార్గాలు.
10-02-2015 నఉదయం లేవంగానే నాకెందుకో మనసంతా చాలా చికాకుగా అనిపించింది. విరక్తి కలిగి ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపించింది.
మర్నాడు ఉదయం లేచి హారతి పాడుకొని గవర్నమెంట్ వాళ్ళిచ్చిన ‘సీనియర్ సిటిజెన్ కార్డు జేబులో పెట్టుకొని ఫిలిం నగర్ బాబా గుడికి వెళ్ళాలని బయలుదేరాను.
నేను వెళ్ళిన సమయానికి గుడి మూసేశారు. ఆ గుళ్ళోనే ఒక పక్కగా కూర్చొని నాకు వచ్చిన స్తోత్రాలన్నీ గంటపాటు చదువుకున్నాను.
ఇంటికి వెళ్ళబుద్ది కాక శ్రీనగర్ కాలనీలోని “దత్తాత్రేయుడి” గుడికి వెళ్ళాను. 150 మెట్లు ఎక్కిదిగాను.
పైన దేవుడి’గుడి మూసేసి వుంటే బయట నుంచే దండం పెట్టుకుని దిగాను.
‘దత్తాత్రేయుడి గుడి నుండి రోడ్డు మీదకి వచ్చేటప్పటికి హారతి సమయం అవటంతో నా దగ్గర సెల్ లొ బాబా హారతులు వుంటాయి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కడ వున్నా కూడా హారతి ని ఫాలో అవుతుంటాను.
ఇప్పుడు కూడా ఆలాగే హారతి వింటుంటే మరో పక్కన వేరే వేరే ఆలోచనలతోటి ఆన్య మస్తకంగానే రోడ్డు దాటుతుంటే ఎవరో ఆటోవాడు నన్ను గుద్దేశాడు.
అంతే నేను వెనక్కి పడిపోయాను. తలకి వెనకాల దెబ్బతగిలింది. వెంటనే ఆటోవాడు నన్ను హాస్పిటల్ లో చేర్చి ఫస్ట్ ఎయిడ్ చేయించి మా పిల్లలకి ఫోన్ చేసాడు.
ఒకళ్ళు నాగోల్ లో ఉంటారు. ఒకళ్ళు మెహదీపట్నంలో ఉంటారు. వాళ్ళు వచ్చి మహావీర్ హాస్పిటల్ కి తీసుకోనివెళ్ళారు.
ఎం.ఆర్. ఐ తీసి ఏమి ఫర్వాలేదన్నారు. 4 కుట్లు వేస్తే చాలు కానీ 6 కుట్లు వేసారు.
అంతా బాగానేవుంది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా ఆవిడకి మనసంతా విపరీతమయిన అలజడి కలిగి ‘బాబా’ ఫోటో ముందు నిలబడి ఏడుస్తూ
“ఏమిటి బాబా ఈ మనిషి ఉదయం అనంగా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో. ఫోన్ చేస్తే ఎత్తటం లేదు. నా మనసెందుకో బాగా ఆందోళనగా వుంది. నీదే భారం అనుకుందిట”.
అప్పుడు నేను ఆవిడతో ఫోన్ లో మాట్లాడాను. బాగానే ఉన్నాను, నాకేం కాదు, ఇంటికి వచ్చేస్తున్నాను, నువ్వేం కంగారుపడకు అని చెప్పాను.
“నేను హారతి పాట వింటుంటే రోడ్డు మీద నడుస్తుండగా నన్ను ఆటో గుద్దేసి తలకి దెబ్బ తగిలినా కూడా తల పగలకుండా కుట్ల తోనే సరిపోయింది”, అలా బాబా నన్ను పెద్ద ఆపద నుండి కాపాడాడు
బాబా భక్తులందరికీ ఒక విన్నపం: “మనం ఇంటి నుండి బయటకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా బాబా ఫోటో ముందు నిలబడి
ఫలానా పని మీద వెళుతున్నాము, ఈ పని సక్రమంగా అయ్యేటట్లు గా నన్ను ఆశీర్వదించండి అని బాబాకి దండం పెట్టి,
ఓ చిటికెడు ఊదీ నుదుట పెట్టుకొని మరోచిటికెడు నోట్లో వేసుకొని బయలుదేరితే, ఆ పని దిగ్విజయంగా చేస్తాడు బాబా.
విజయాలన్నీ మనతోనే వుంటాయి. బాబా ‘ఊదిరూపంలో మన వెంటే వుంటాడు”.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- నాలుగు హారతులు చూడాలనుకున్నా భక్తురాలి కోరికను తీర్చిన బాబా వారు….
- ఆరతి పాడాలి అని కోరుకున్న ప్రతిసారి, భక్తుని కోరికను నెరవేర్చుతున్న బాబా వారు.
- మందిర మొదటి మెట్టు కూడా ఎక్కని విద్యార్థి, తరువాత తన జీవిత పర్యంతం బాబా పట్ల శరణాగతి చూపుట–Audio
- మన మనసులోని ఆలోచనలను బాబా గ్రహించగలరు
- నిజ దర్శన ప్రాప్తి … కోవా అడిగిన బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments