Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: వెంకట రామ శర్మ
నివాసం: సిద్దిపేట
సాయి బంధువులందరికి సాయిరామ్.
నా పేరు వెంకటరామ శర్మ. నేను సిద్దిపేటలో సాయిబాబా గుడి పూజారిని. గుడిలోనే ఒకరోజు జరిగిన లీలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఒక రోజు నేను శేజ్ హారతి ఇవ్వడానికి పదిహేను నిమిషాల ముందు ఒక ముసలాయన వచ్చారు. తెల్లటి వస్త్రంతో, భుజమునకు జోలెతో గుడికి వచ్చారు.
నేను అప్పుడు మరొక భక్తునికి పంచాంగం, జ్యోతిష్యం చెబుతూ ఉన్నాను. శేజ్ హారతి సమయం కావస్తు ఉంది కదా! అని జ్యోతిష్యం ముగించి వచ్చి ఆ ముసలాయనకు తీర్థం పెట్టాలా సాయి అని అడిగాను. వద్దు అన్నట్టు అభయ హస్తం చూపారు.
ప్రసాదం ఇవ్వాలా అని అడిగితే నాకు కోవా కావాలి అని అడిగారు. కోవాని కేవలం గురువారం మాత్రమే పంచుతారు ఇప్పుడు లేదని చెప్పినా వినకుండా చిన్న పిల్లలు మారం చేసినట్టు నాకు “కోవా కావాలి” “కోవా కావాలి” అని అన్నారు.
లేదు స్వామి అని చెప్పి మీరు ఎక్కడి నుండి వచ్చారు? అని అడిగాను. తాను శిరిడీ నుండి వచ్చానని చెప్పారు. ఇంకా వివరాలు అడుగుదాం అంటే శేజ్ హారతి టైం అవుతుంది.
అందుకే బాబాకి నైవేద్యం నివేదించి హారతి మొదలుపెట్టే ముందు హారతి పుస్తకం ఇవ్వాలా అని అడిగాను. నాకు అన్ని హారతులు వచ్చు అనిచెప్పారు.
సరే అని హారతి మొదలు పెట్టాను. తాను కూడా హారతి సమయంలో ఉంటూ “అతా స్వామి సుఖే నిద్రా కరా అవధూత బాబా కరాసాయినాథ” అనే చరణం వచ్చిన సమయంలో ఆ ముసలాయన అదృశ్యం అయినారు.
ఆశ్చర్యంగా ఎక్కడ వెతికినా కనిపించలేదు. కానీ, తరువాత తెలిసింది. తాను వేరెవరో కాదు సాక్షాత్ బాబా అని, నాకు నిజ దర్శనం ఇవ్వడానికే వచ్చారని.
నిజంగా నాజన్మ ధన్యం అయిపోయింది. కానీ, పక్కన ఉన్నంత వరకు తెలుసుకోలేక పోయా! అదృశ్యం అయ్యాక బాబా అని తెలిసింది.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయిసూక్తి:
“నీ ముందు ఈ రూపంలో నీకు కనిపించడమే సాక్షాత్కారం”
Latest Miracles:
- ఆరతి పాడాలి అని కోరుకున్న ప్రతిసారి, భక్తుని కోరికను నెరవేర్చుతున్న బాబా వారు.
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
- నిజ జీవితంలో బాబా లీలలు
- కలలో బాబా నిజ సమాధి దర్శనం
- బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments