దీక్షిత్ వాడా …..సాయి@366 ఏప్రిల్ 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబాయే సాఠేను వాడాను నిర్మింపుమన్నారు.

సాయిబాబాను దర్శించిన బొంబాయి నివాసి కాకా సాహెబ్‌ దీక్షిత్‌, షిరిడీకి వచ్చే భక్తులు, సందర్శకులు వసతికి కష్టపడటం చూచాడు.

తానే స్వయంగా ఒక వాడాను నిర్మిద్దామని తలంచి, శ్యామా ద్వారా సాయిబాబా అనుమతిని పొందాడు.

ఇక అద్వితీయమైన వాడా నిర్మాణానికి నిశ్చయమైనది అదియే దీక్షిత్‌ వాడా.

కాకా సాహెబ్‌ దీక్షిత్‌ జ్యేష్ట సోదరుడు భాయిజీకి ఈ విషయం చెప్పాడు. అతను ఒక పెద్ద కాంట్రాక్టరు. వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించినాడు.

నిర్మాణము పూర్తయిన తరువాత 1911 శ్రీరామనవమి రోజున గృహ ప్రవేశము జరిగినది. అనగా ఏప్రిల్‌ 7న గృహప్రవేశం జరిగింది.

వాడా పైభాగమును తనకోసం, తన తోటి సాయి భక్తులకు కేటాయించారు. వాడా పైభాగములోనికి స్త్రీలు నివసించుట నిషిద్ధమని కూడా నిర్ణయించారు.

ఈ వాడాలో ఎన్నో దివ్య లీలలు జరిగినవి.

ఉపాసనీ మహారాజ్‌ను తన అతిథిగా ఉండమన్నాడు కాకా సాహెబ్‌ దీక్షిత్‌. ఆయన మంచితనాన్ని గుర్తించి ఉపాసనీ కొన్ని రోజులు దీక్షిత్‌ అతిథిగా వాడాలో ఉన్నాడు.

సాయిబాబా హేమాడ్‌పంత్‌తో ”దీక్షిత్‌ మంచి స్వభావము గలవాడు. అతనితో నుండుము” అన్నాడు. హేమాడ్‌పంత్‌ అలానే చేశాడు.

వాడాలో బసచేయ వచ్చిన వారందరినీ కాకా సాహెబ్‌ దీక్షిత్‌ స్వపర బేధము లేకుండా పరామర్శించేవాడు. సమాన అంతఃకరణతో, సౌమ్యంగా మెలిగేవాడు అందరితో.

ఈ వాడా కాలాంతరమున భోజనాలయముగా మారినది.

ఈ విషయము కాకా సాహెబ్‌ దీక్షిత్‌కు హర్షము కలిగించునట్టిదే. ఎందుకనగా ఆయనతో అతిధులు బొంబాయిలోను, షిరిడీలోను ఉండెడి వారు. ఆయన ఏనాడూ ఒంటరిగా భోజనము చేసి ఎరుగడు..

కొంతకాలము అది టీ క్యాంటీనుగా మారినది.

ప్రస్తుతము అది మ్యూజియంగా ఉపయోగపడు చున్నది.

ప్రతి నిత్యము వందలమంది భక్తుల పాద ధూళులను శిరసున ధరించు ఆ వాడా పావన కట్టడమే.

అది దీక్షిత్‌ తీపి గురుతుగా మన్ననలందుకుంటోంది.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles