Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా సశరీరంగా ఉన్నప్పుడు – అంటే మహా సమాధి చెందక పూర్వం ఎందరో రకరకాల కోరికలతో వచ్చి సాయిని దర్శించుకునే వారు.
డాక్టర్ రాజారాం సీతారాం కపాడి ఒక వ్యాపారస్తుని కుమారుడు. ఆయన అన్నగారు షిరిడి వెళ్ళి సాయిని దర్శించి సాయి భక్తుడయ్యాడు.
రాజారాం అన్నగారే తన తండ్రి వ్యాపారంలో చేదోడు వాడోడుగా ఉండే వాడు కనుక రాజారాం తండ్రికి కష్టం లేకపోయేది వ్యాపార నిర్వహణలో.
రాజారాం అన్నగారు మరణించాడు. ఇక వ్యాపార భారమంతా రాజారాం మోయవలసి వచ్చింది.
ఆయనకు వ్యాపారం మీద కోరిక లేదు. వైద్య శాస్త్రంమీద మక్కువ ఉండేది. కాని పరిస్థితులు అనుకూలించాలి కదా!
ఇక చదువుతున్న చదువుకు స్వస్తి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దిక్కు తోచలేదు.
అది 1918 మే. రాజారాం కపాడీకి తన అన్న దైవమైన సాయిబాబా జ్ఞప్తికి వచ్చాడు. తన కోరికను సాయికి వెల్లడించాడు షిరిడీకి వెళ్ళి.
సాయి అతనికి తగు ప్రోత్సాహ సూచనలిచ్చారు వైద్య విద్యను అభ్యసించటానికి.
ఇక రాజారాంకు కొండంత బలం వచ్చింది. అంటే సాయి మీద నమ్మకం ఏర్పడింది. ఇది మొదటి మెట్టు.
సాయికి తన వారు మొదటి మెట్టు ఎక్కగానే పొంగిపోడు. ఇక ముఖ్యమైనది రెండవది సహనం. ఒట్టి సహనం కాదు ధైర్యంతో కూడిన ఓరిమి కావాలి సాయికి.
ఇక సాయి మహా సమాధి అనంతరం కూడ షిరిడీని దర్శించేవాడు. బొంబాయిలోని గ్రాంటు మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.యస్.లో చేరాడు.
అప్పుడు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ మొదలైంది. ఆ పిలుపునకు ప్రభావితమై తన చదువుకు స్వస్తి పలికాడు.
జాతీయ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేసాడు. కొంతకాలం తరువాత వైద్య కళాశాలలో చేరాడు.
కాని అనారోగ్య కారణంగా మరల చదువుకు స్వస్తి పలికాడు. తిరిగి ఆరోగ్యము చేకూరిన తరువాత వైద్య కళాశాలలో చేరి ఎం.బి.బి.యస్. పూర్తి చేశాడు.
1920లో కోర్సులో చేరిన రాజారాం 1931లో పూర్తి చేశాడు. 11 ఏండ్లపాటు అనేక ప్రతిబంధకాలు వచ్చినా సాయి వాగ్దానం మీద నమ్మకం ఉంచి ఉత్తీర్ణుడయ్యాడు.
సాయి వాక్కును సహనంతో పాటించాడు. కుగ్రామంలో వైద్య సేవ నారంభించాడు, పట్టణాలలో మంచి అవకాశాలున్నా గాని.
డాక్టర్ కపాడి ఏప్రిల్ 6, 1896న జన్మించాడు. డాక్టర్ కపాడి వలె ఇతరులకు సేవ చేసే భాగ్యమును మనము కూడ పొందుదుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మనసెరిగిన వాడు మా దేవుడు…..సాయి@366 ఆగస్టు 22….Audio
- రాజారామ్…..సాయి@366 జూలై 20…Audio
- నేనే జగన్మాతను …..సాయి@366 జూలై 22…Audio
- తల్లిని మరువని బిడ్డ …..సాయి@366 డిసెంబర్ 16….Audio
- షిరిడీయే కాశీ…..సాయి@366 ఏప్రిల్ 27….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments