Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయి వద్దకు పోయి కోర్కెలు తీర్చమనే వారందరూ బిచ్చగాండ్రే! సాయి మహాసమాధి అనంతరం కూడా మన కోర్కెలు తీరుస్తున్నారు.
భక్తులు ఆ కోర్కెలు తీర్చుకోవటానికి, సాయిని అడగక తప్పదు. అలా అడగటంలో ఎన్నో రకాలు! కొందరు సాయి సన్నిధిలో ఉన్నా, ఇది చేయి బాబా, అది చేసిపెట్టు బాబా అని అడగరు.
బాబాకు తెలియదా మన అవసరం అని భీష్మించుకుని కూర్చుంటారు. కాకా మహాజని ఒకసారి షిరిడీకి వచ్చాడు.
నీళ్ళ విరోచనాలతో బాధపడుతున్నాడు. ”బాబా నా ఈ విరోచనాలను తగ్గించు” అని అడగలేదు.
అడుగుతాడేమో అని సాయి చూచాడు. కాని కాకా మహాజని అడగలేదు. ఎంతైనా కాకా మహాజని సాయికంటే మొండివాడు.
అత్యవసరంగా మరుగు దొడ్డికి పోవటానికి చెంబు, చెంబు నిండా నీళ్ళు తెచ్చుకున్నాడు ద్వారకామాయికి.
కానీ, కాకా మహాజని నోరు విప్పి అడగలేదు. చివరకు బాబాయే దిగివచ్చి, వేరు శనగ పప్పులు తినిపించి, నీరు త్రాగించి, విరోచనాలను అరికట్టాడు.
నానా సాహెబ్ చందోర్కర్ బాబాకు అంకిత భక్తుడు. నానాకు తుంటిపై కురుపు వచ్చి తీవ్రమైన బాధను కలిగిస్తోంది.
ఈ విషయం బాబాకు చెబితే, సాయి తన బాధను తీసుకుంటాడని నానా చెప్పలేదు. చివరకు శస్త్ర చికిత్సకు కూడా సిద్ధమయ్యాడు.
మరునాడు శస్త్ర చికిత్స చేస్తారనగా, ఆ నాటి రాత్రి సాయి చిత్రపటాన్ని తన తలక్రింద పెట్టుకొని నిద్రించాడు.
ఇంకో అరగంటలో శస్త్ర చికిత్స చేస్తారనగా, పైకప్పు నుండి ఒక పెంకు రాలి, సరిగ్గా కురుపుపై పడ్డది. కురుపు పగిలి అందులో నుండి చెడు రక్తం బయటకు వచ్చింది.
అది చూచి, పరీక్షించిన డాక్టరు ఇక శస్త్ర చికిత్స అవసరం లేదన్నాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు సాయిబాబా వద్దకు వెళ్ళాడు నానా.
”నానా, నీ కురుపును నేనే గోటితో తీసివేసాను” అన్నాడు సాయి. నానా సంతసించాడు, ఎందుకంటే సాయి తన బాధను తీసుకుని అనుభవించనందుకు.
సాయి మహాసమాధి అనంతరం డాక్టర్ బి.జి. దాసు గారు ఒక విద్యా సంస్థలో పనిచేస్తున్నాడు.
ఆ సంస్థలోని ఇద్దరు సభ్యులు ఆ సంస్థ మీద అభూతకల్పనలు చేసి అలహాబాదు హైకోర్టులో కేసు వేశారు.
కేసు విచారణకు వచ్చింది. దాసుగారు బాబా పటం వద్ద ”బాబా, నీవెంత మహిమాన్వితుడవో అందరకూ చెపుతున్నాను. ఇప్పుడు కేసు ఓడిపోతే అందరూ నిన్ను చులకన భావంతో చూస్తారు” అని వేడుకున్నాడు.
చివరకు తీర్పు దాసుగారికి అనుకూలంగా వచ్చింది. ఇది ఆగస్టు నెలలో జరిగింది.
సాయిని కోర్కెలు తీర్చమనే తీరు భక్తునిబట్టి ఉంటుంది!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి ‘పిచ్చుక’ నానా …..సాయి@366 ఆగస్టు 21….Audio
- సలహా…..సాయి@366 ఏప్రిల్ 22….Audio
- నేనే జగన్మాతను …..సాయి@366 జూలై 22…Audio
- దాహం! దాహం!!…..సాయి@366 మే 24….Audio
- ఏది సబబు? …..సాయి@366 మే 2….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments