ఏది సబబు? …..సాయి@366 మే 2….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support BY: Mrs. Jeevani


ఇది మే 2, 1986న జరిగిన సంఘటన. దీనిని శ్రీ సుబ్రహ్మణ్యంగారు తెలిపారు పత్రికా ముఖంగా.

మానవులకు ఎన్నో కోరికలుంటాయి. సాయివంటి కల్ప వృక్షము, కామధేనువు లభ్యమైన తరువాత, సాయిని ఆ కోర్కెలను తీర్చమని కోరకుండా ఉండటము సామాన్యముగా జరగదు.

సాయిబాబా కూడా తనను కోర్కెలని కోరవద్దని చెప్పలేదు. ఒకరు కోరిన కోరికలు వేరొక భక్తునకు అతి చిన్నవిగా కనబడి, ఇవి కూడ అడగవలసి కోర్కెలా? అనిపిస్తుంది.

కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏపాటిదైనా ఒక చిన్న ఉద్యోగం చాలుననిపిస్తుంది.

సరిగ్గా అదే విషయం చోళ్కరు జీవితంలో జరిగింది, చోళ్కరు సాయిని ప్రార్ధించాడు. హరి వినాయక సాఠే డిప్యూటీ కలక్టరు హోదాలో ఉన్నాడు. ఉద్యోగ విషయమై ఆయన సాయిని కోరినాడు.

జీవితములో ఎవరి పరిస్థితులు వారివి. వారికి అనుగుణంగానే కోరికలు కోరుకుంటారు. అవి పెద్ద కోర్కెలు, చిన్న కోర్కెలు అని ఉండవు. ఆనాటి అవసరాన్ని బట్టి ఉంటాయి.

29 ఏప్రిల్‌ 1986లో ఢిల్లీ నుండి బయలుదేరేటప్పుడు సుబ్రహ్మణ్యంగారు, తన ఆఫీసు సిబ్బందిని 2 మేకు బెంగళారు నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్‌ చేయించుమని కోరి, షిరిడి చేరినారు.

మన్మాడ్‌లో దిగిన ఆయనకు తిరిగి రిజర్వేషన్‌ దొరకలేదని ఆఫీసు సిబ్బంది చెప్పారు. రైల్వే ఆఫీసులో విచారించగా బెర్తు దొరకదన్నారు.

ఇక ఆయన సాయిని షిరిడీలో దర్శించుకుని మే 2న మన్మాడ్‌ చేరాడు. ఆనాడు ఊహించనంతమంది ప్రయాణీకులున్నారు.

మామూలు పెట్టెలో కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. అయితే రిజర్వేషన్‌ లేకున్నా ధైర్యంచేసి రిజర్వుడు పెట్టెలో ఎక్కాడు.

అది తప్పని అతనికి తెలుసు. సాయిని ప్రార్థించాడు ఆయన. ఎవరో ఒక అరగంట తరువాత సీటు ఖాళీ అవుతుంది ఇస్తానులే అన్నాడు. సంతోషాన్ని వెలిబుచ్చాడు సాయి కృపకు.

కొద్ది నిముషాలలోనే అయిదుగురు ఆ పెట్టె నుండి దిగిపోయారు. వాటిలో ఒక దానిని సుబ్రహ్మణ్యానికి ఇచ్చారు. సాయిబాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని ప్రయాణించాడు.

జీవితంలో సాయిని ఇటువంటి అతి చిన్న కోర్కెలను కోరవచ్చా? అని కొందరు ఈసడించుకుంటారు.

కోర్కెలు కోరటం అసమంజసం కాదు. కానీ, కోర్కె తీర్చమని సాయిపై కోపగించుకోవటం కూడా అసమంజసమే.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles