సాయి – శ్రామికుడు …..సాయి@366 మే 1…..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


మే 1 శ్రామిక దినంగా పరిగణిస్తారు ప్రజలు. సాయిబాబా అందరి అంతరాత్మ అయినా భౌతికంగా శ్రామికునిగానే కనిపించాడు – అదీ బాల కార్మికుని గానే.

”ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకుని బ్రతకటానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను.

నడుస్తూ, నడుస్తూ బీడ్‌గాం అనే ఊరు చేరుకుని విశ్రమించాను. మా ఫకీరు వింత సంకల్పాన్ని చూచి నాకు ఆనందం కలిగింది.

నాకు అక్కడ జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది” అంటారు సాయి.

ఎవరైనా శ్రమించ వలసినదే. ఆ శ్రమలో మనసు పెడితే ఎంతో ప్రయోజనం కనిపిస్తుంది.

సాయియే మరల అంటారు ”నా కంటే ముందుగా ఉన్న వారు తెలివైన వారని పేరు పొందారు.

నలుగురు బాలురు పని చేశారు. ఒకడు యాభై రూపాయల పని చేస్తే, రెండవ వాడు వంద, మూడవ వాడు వందా యాభై. నాది అందరిది కలిపిన దానికంటే రెండింతలు.

నా చాతుర్యాన్ని చూచి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారికంటే అధికంగా నన్ను అభిమానించాడు.

నాకు దుస్తులు ఇచ్చాడు. తలకు పాగా, శరీరంపై కప్పుకొనుటకు శాలువ ఇచ్చాడు” అంటారు.

ఏదో గానుగెద్దు లాగ శ్రమించటం కాదు, చాతుర్యంతో పని చేయాలని, అప్పుడే ప్రతిభ బయట పడుతుందని సాయి సూచన.

ఇది బీడ్‌గాం గాథ

సాయిబాబా బంతి, జువ్వి మొదలైన మొక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటి, అక్కడ ఒక ఉద్యాన వనాన్ని ఏర్పరచారు. సాయి తోటమాలియే. శ్రామికుడే.

ద్వారకామాయి వద్ద గోడను కట్టిన శ్రమజీవి. గ్రామస్తులతో కలసి బావిని త్రవ్విన క్రియాశీలుడు.

నిచ్చెన తెచ్చిన వ్యక్తికి రెండు రూపాయల నిచ్చుటయే గాక, అతనికి సంతాన ప్రాప్తి కలిగించెను. కష్టానికి మించిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు సాయి.

సాయి కూడా తన భక్తులకు శ్రమకు ఖరీదు కట్టకుండా ఉదారంగా ఇవ్వమని చెప్పాడు.

నేడు మే 1 ప్రపంచ శ్రామిక దినం. శ్రామికునిగా శ్రమించుదుము గాక!

శ్రమయేవ జయతే!!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles