Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిరాం నాన్నగారు సాయి భక్తులు. కనుకనే కుమారునికి సాయిరాం అనే పేరు పెట్టారు.
కుటుంబంలో ఒకరు సాయి భక్తులైతే చాలు, మిగిలిన వారు కూడా సాయి భక్తులవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సాయిరాం తన స్వవిషయాలను ఇలా వివరించాడు:
”మా నాన్నగారు సాయి భక్తులు. ప్రతి గురువారం మా ఇంట్లో పూజలు, వేడుకలు చేయిస్తారు.
నేను పుట్టగానే సంవత్సరంన్నరకు పెద్ద జబ్బు చేసింది. నేను చనిపోతానని అనుకున్నారు.
మా నాన్న సాయికి మొక్కుకున్నారు ”సాయిబాబా ఇంతవరకు మా కుటుంబాన్ని కాపాడుతున్నారు. ఈ కష్టాన్నికూడా గట్టెక్కించు. పిల్లవానికి నీ పేరు పెట్టుకుంటాము ” అన్నారు.
వారం రోజులలోపే నేను ఆరోగ్యవంతుడనయ్యాను. మా నాన్నగారు నాకు సాయి మహిమను గురించి తెలిపారు”.
1955 వేసవి సెలవుల్లో ఒక మరపురాని సంఘటన జరిగింది.
అతను వేసవి సెలవుల్లో వాళ్ళ బాబాయిగారి ఇంటికి నూజివీడు వెళ్ళాడు.
వారింట్లో సాయి బాబా పటం లేదు. సాయిరాం పటం కొని వాళ్ళ బాబాయి ఇంట్లో ప్రతి గురువారం పూజ చేయసాగాడు.
అతను అక్కడున్నప్పుడే సెకండు ఫారం పాసై థంర్డ్ ఫారంలోకి వచ్చాడు. అది సాయి మహిమే అని అతను చెప్పాడు.
ఒక రోజున టెలిగ్రాం వస్తే తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రికి సుస్తీగా ఉన్నది. ఆయన సాయి పూజ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. అందుకని కుమారుని పిలిపించి పూజలు చేయిస్తున్నాడు.
ఒకరోజు తండ్రి గారు సాయిరాంకు ఇలా చెప్పారు ”ఒక రాత్రి నలుగురు యమకింకరులు వచ్చారు నన్ను తీసుకుపోవటానికి.
వారం సమయం కోరాను. ఎందుకంటే మా సాయిరాం ఇక్కడ లేడు. అతన్ని పిలిపిస్తాను. వాడు సాయి పూజ చేస్తుంటే అది చూసి నేను తృప్తిగా కన్నుమూస్తాను” అని. యమకింకరులు అంగీకరించారు.
సాయిరాంతో తండ్రి ”నా జీవితాన్ని చాలిస్తాను. నేను తీసుకున్న గడువు అయిపోయింది” అని ఆ తెల్లవారే సాయిలో ఐక్యమయ్యారు. అప్పటి నుండి సాయిరాంకి బాబాపై భక్తి అపరిమితమైంది.
సాయి తన భక్తులకు ఎన్నటికి అన్యాయం చేయడు.
తండ్రి సాయి భక్తికి కుమారుడు సాయిరాం వారసుడయ్యాడు!
అదే సాయి వారసత్వం!!
కొత్త వారసత్వం!!!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- సాయి సాయి.. స్మరణ తోనే పునర్జన్మ..
- సాయి వేసిన బేడీ…..సాయి@366 నవంబర్ 23….Audio
- ప్రకృతిని శాసించే సాయి …..సాయి@366 జూలై 12….Audio
- మరల సాయి సన్నిధికి…..సాయి@366 సెప్టెంబర్ 11…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments