సాయి వేసిన బేడీ…..సాయి@366 నవంబర్ 23….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


కే.ఎం. భగవతి తండ్రి వ్యాపారి. భగవతికి బాల్యంలో పెద్ద జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.

ఒక రోజు భగవతి ఇంటి గుమ్మం ముందు ఒక ఫకీరు నిలబడ్డాడు. ఆ ఫకీరు భగవతి తల్లితో మీ బిడ్డడి పరిస్థితి చాలా ప్రమాదకరముగా ఉన్నది కదా.

షిరిడీలో సాయిబాబా అనే పేరుతో ఒక సాధువు ఉన్నాడు. వారి వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఈ విషయం ఆమె భర్తతో చెప్పింది.

1918లో భగవతి తండ్రి షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించి, తన బిడ్డ అనారోగ్యం గూర్చి చెప్పాడు. బాబా బిడ్డడి కాలికి వెండి కడియమును వేయమని ఆశీర్వదించారు.

తను వచ్చిన పని పూర్తి అయినది. ఇంక తాను వ్యాపార నిమిత్తమై బొంబాయిలో జరిగే మీటింగుకు పోవాలి. అందుకు గాను సాయిబాబాను ఆయన అనుమతి అడిగాడు. కొంత తడవు ఆగి వెళ్ళమన్నారు.

కొంత తవు ఆగితే రైలు అందుకోవటం కష్టమవుతుంది. కానీ, సాయిబాబా మాటను కాదనక, ఆయన చెప్పినట్లు ఆగి బయలుదేరాడు.

ఆ నాడు రావలసిన రైలు ఆలస్యంగా వచ్చింది. అప్పుడు సాయి అన్న మాటలు అర్థమయ్యాయి.

ఇంటికి చేరి వెండి కడియం చేయించి భగవతి కాలికి తొడిగాడు. భగవతి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు.

భగవతికి వయస్సు పెరిగిన కొలది, కొంత వెండిని చేర్చి కడియాన్ని పెద్దది చేయించే వాడు.

భగవతికి 32 ఏళ్ళు వచ్చాయి. కడియాన్ని చూచే వారంతా ‘సాయి నీకు బేడీలు వేసారు’ అని చమత్కరించే వారు.

దీనిని తట్టుకోలేని భగవతి తండ్రిని ”వెండి కడియం ఎప్పుడు తొలగించాలి” అని అడిగాడు.

తండ్రి విస్మయం చెందాడు. షిరిడీకి వెళ్ళి, సాయి పూజ అనంతరం కడియాన్ని తీసివేయమని, షిరిడీ సంస్థానం వారికి మనం ఏమైనా చేయగలమేమో కనుక్కొని రమ్మన్నారు.

కొంత కాలం తరువాత భగవతి తండ్రి మరణించాడు. భగవతి తన కుటుంబంతో నవంబరు 1950లో షిరిడీ వెళ్ళి సంస్థానానికి తాము ఏ విధంగా ఉపయోగపడగలమని అడిగాడు.

షిరిడీ సంస్థానంలో అప్పటికి అన్ని పనులు అయ్యాయి. ఇక మిగిలింది ఎలక్ట్రికల్‌ పనులు మాత్రమే. భగవతి ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టు తీసుకుని, సంస్థానానికి సంతృప్తి కలిగేలా పనులు చేసిపెట్టాడు.

భగవతికి అంతుచిక్కని ప్రశ్న తాను కడియాన్ని తీసివేయాలనే ప్రశ్నకు తండ్రి మరణానికి ఏమి సంబంధం అనేది?

ఏది ఏమైనా తన తండ్రి కోరినట్లు భగవతి సంస్థానానికి చక్కటి సేవ చేశాడు. ఆయన ఆత్మ శాంతి పొందటానికి!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles