Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
దత్త పరంపరలో తనదంటూ ఒక స్థానం ఏర్పరచుకొనిన రంగావధూత జన్మించినది 1898, నవంబర్ 21 (సోమవారం). ఆయన దత్తునిలో ఐక్యమైన దినం 19 నవంబర్, 1968.
వీరు మహారాష్ట్రులైన, గుజరాత్ లోని వాలమేలో జన్మించారు. రంగావధూత బాల్య నామం పాండురంగ.
పాండురంగకు 8 ఏండ్ల వయసులో ఉపనయనమైంది. ఆ దినమే వాసుదేవానంద సరస్వతులు వారు ఆ గ్రామం విచ్చేశారని తెలిసి, తల్లి, తమ్మునితో 8 ఏండ్ల పాండురంగడు వారి దర్శనానికి పోయాడు.
“పాదాలను తాక కూడదు” అంటూ అక్కడున్న వారు హెచ్చరించినా పాండురంగ వినకుండా వాసుదేవానంద సరస్వతుల వారి పాదాలపై తన శిరస్సునుంచాడు.
సరస్వతుల వారు కోపగించుకోలేదు. సంతోషంగా “ఎవరి బిడ్డడివి?” అని అడిగారాయన. తడుము కోకుండా “మీ బిడ్డనే” అన్నాడు పాండురంగ.
శిష్యునకు గురువు తండ్రియే కదా. అంతే! ఒకేసారి ఆ గురు శిష్యులు లేదా ఆ తండ్రి కుమారుల కలయిక జరిగింది.
తెంబేస్వామి (వాసుదేవానంద) పాండురంగని గురువైనాడు. గురువుపై నిశ్చల విశ్వాసము పెట్టుకున్నాడు పాండురంగ. అతనే అనంతరం రంగావధూత అయ్యాడు.
పాండురంగ బీదరికంలో ఉన్నాడు. ఒకసారి పరీక్ష రుసుము కట్టవలసి వచ్చింది. అందరూ అతనిని అప్పో సొప్పో చేసి డబ్బు కట్టమన్నారు.
అప్పు చేయనన్నాడు. అతనికి తన గురువైన వాసుదేవానందులపై నమ్మకముంది. తన గురువు తనకు సహాయపడగలడని నమ్మకం ఉంది.
చివరి దినం వచ్చింది. ఆనాడు ఎవరో పాండురంగని తండ్రి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును తీర్చి వెళ్లిపోయారు.
ఆ డబ్బు సరిగ్గా పరీక్ష రుసుముకు సరిపోతుంది. గురువు కరుణతో పరీక్ష రుసుము చెల్లించాడు.
ఒకనాడు రంగావధూత నర్మదా నదిలో అర్ఘ్య ప్రదానం చేస్తున్నాడు. మూడు దిక్కుల నుండి మొసళ్లు ఆయన వైపు వస్తున్నాయి.
ఒడ్డున ఉన్నవారు కేకలు వేయసాగారు. అవేవి వినే స్థితిలో లేడు ఆయన. అప్పుడు ఆయన కన్నులు తెరచి చూచాడు.
మూడు దిక్కుల నుండి మొసళ్లు రావటం చూచాడు. బెంబేలు పడలేదు.
“ఓ దేవతలారా, నన్ను ఈ రూపంలో దీవించటానికి వచ్చారా? దీవించండి” అలాగే అని నీటిని వాటివైపు చల్లారు.
“ఒడ్డున అందరూ భయపడుతున్నారు. వెళ్లిరండి” అన్నారు రంగావధూత.
నేడు నవంబరు 21.
రంగావధూత జయంతి నేడే.
మనలను నిర్భయులను చేయమని రంగావధూతను ప్రార్దించెదము గాక!
ఓం జయ జయ రంగ గురో….
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి మహమ్మదీయుడా? ……సాయి @366 ఫిబ్రవరి 6….Audio
- గుజరాతీ జరీ శాలువ …..సాయి@366 ఆగస్టు 10…Audio
- పయనమైన ప్రియతముడు…. మహనీయులు – 2020… మే 21
- దెబ్బకు దెబ్బ…..సాయి@366 నవంబర్ 21….Audio
- సోదరా! నన్ను మరచిపోకు!! …..సాయి@366 ఆగస్టు 13….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments