Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఎవరికి, ఎక్కడ జన్మించాడని కచ్చింతా ఎవరికీ తెలియదు. అందరివీ ఊహాగానాలే.
సాయిబాబాయే స్వయంగా ఆ విషయాన్ని గూర్చి ప్రస్తావించనప్పుడు మిడి, మిడి జ్ఞానంతో అదీ, ఇదీ అని చెప్పటం సమంజసం కాదు.
సామాన్య మానవులు చూచే దృష్టి వేరు, ఆధ్యాత్మిక శిఖరాలపై నడయాడే వారి దృష్టి వేరు.
మహాత్ముల నో టి నుండి పొల్లు రాదు. వారు ఎవరి పరపతిని పెంచనక్కరలేదు, పెంచరు, తగ్గించే పని చేయరు.
సాయిబాబా సమకాలికుడు వాసుదేవానంద సరస్వతి. ఆయనను తెంబే స్వామి అని కూడ అంటారు.
ఆయన తెలుగు ఊరు అయిన రాజమహేంద్రవరంలో సాయి భక్తుయిన దాసగణు మహారాజును కలిశాడు.
అప్పుడు వాసుదేవానంద సరస్వతి, దాసగణు మధ్య సంభాషణ జరిగింది.
వాసుదేవానంద సరస్వతి కర్మిష్టిడు. ఆచార వ్యవహారాల పట్ల తీవ్రమైన శ్రద్ధను చూపేవాడు.
సాయిబాబా అలా కాదు. వాసుదేవానంద స్వామి తన అన్నగారైన సాయిబాబాకు తన నమస్కారాలు పంపుతూ నారికేళాన్ని కూడ పంపారు.
ఆచార వ్యవహారములలో ఆ ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవముల వలె ఉండేవారు.
వాసుదేవానందులకు సాయి బాబాపై అవ్యాజమైన ప్రేమ. సాయి మహమ్మదీయుడను శంక ఆయనకు లేదు.
తనకు సాయి సోదరుడే అవుతాడని తెలిపాడు.
ఆయనే కాదు…. ఇలా ఎందరో సాయినాథుని ఉత్తమోత్తమునిగా కీర్తించారు.
ఫిబ్రవరి 6, 1944న తమిళనాడులోని మాయావరానికి చెందిన వి. స్వామినాథ అయ్యర్ సాయిబాబా పూజ చేయదలచాడు.
అప్పుడు ఆయన మార్తురు సనాతన గణపతిని నలుగురు వేద పండితులతో పూజను చేయించానికి తీసుకురమ్మని ఆహ్వానించాడు.
కాని సనాతన గణపతికి సాయి బాబా మహమ్మదీయుడనే సందేహంతో పూజకు రానని తెలిపాడు.
కాని ఆ రాత్రి సనాతన గణపతి కలలో కంచి కామకోటి పీఠాధిపతి కన్పించి ”మాయను వదలి వెళ్ళి పూజ చేయి” అని పలికారు.
వెంటనే వేద పండితులను తీసుకువెళ్ళి పూజ జరిపించాడు.
సాయి మహమ్మదీయుడనే సంశయం దేనికి? ఒక ప్రక్క పరబ్రహ్మగా కీర్తిస్తూనే, మనసులో హమ్మదీయుడనే శంక పెట్టుకోవటం ఎందుకు.
మనం మాత్రం సాయి ఆశీస్సులతో ఈ శంకలకు దూరంగా ఉందుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- పటం కాదు, సాయిబాబాయే …. సాయి@366 ఫిబ్రవరి 17….Audio
- జిత్తులమారితనం…. సాయి@366 ఫిబ్రవరి 12….Audio
- అందరిని ఆదరించు ….. సాయి @366 ఫిబ్రవరి 7….Audio
- తప్పు ! ….. సాయి@366 ఫిబ్రవరి 22….Audio
- ఆది భిక్షువు సాయినేమి కోరేది? ….. సాయి @366 ఫిబ్రవరి 10….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments