విద్యా ప్రదాత!…..సాయి@366 నవంబర్ 17…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


బాలా షింపే గణపతి సాయి బాబా భక్తుడు. ఒక సమయంలో అతనిని ఆదరించేవారే కరువయ్యారు.

వ్యాధిగ్రస్తుడై రోడ్డు మీద పడిపోయాడు. సాయి అతనిని చూచి నీంగాంలో నానా సాహెబ్‌ డేంగ్లే ఇంటికి వెళ్ళమని చెప్పాడు.

బాలా, డేంగ్లే ఇంటికి వెళ్ళగానే డేంగ్లే అతనిని ఆహ్వానించి, గత రాత్రి బాబా తనకు స్వప్నంలో కనిపించి బాలా షింపే విషయంలో శ్రద్ధ తీసుకొనమని చెప్పారని పలికాడు.

సాయి చెప్పినట్లే డేంగ్లే, బాలా షింపేను ఆదరించాడు. దిక్కులేని వారికి దిక్కు అవుతాడు సాయి.

సాయి మహా సమాధి చెందాడు.

డాక్టర్‌ అవిరెడ్డి రంగారావు, భీమవరంలో పేరు గడించిన వైద్యుడు. ఆయన బాబా భక్తుడు కాదు.

ఒకసారి రోగులను చూచుటకు కారులో వెళ్తుండగా, కారు దానంతట అదే ఏ కారణం లేకుండా ఆగిపోయింది.

ఆయన కారు దిగి చూచాడు. ఎక్కడి నుండో ఒక సన్నని మూలుగు వినిపించగా ఆ దిక్కుకు వెళ్ళి చూడగా

ఒక ముదుసలి ”బాబా, బాబా” అని మూలుగుచుండగా ఇతరుల సాయంతో అతనిని తన నర్సింగ్‌ హోమ్‌కు తీసుకువెళ్ళి చికిత్స చేయగా ఆ ముదుసలి ఆరోగ్యవంతుడై ఆ డాక్టరుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు.

ఒక అనాధను రక్షించుట కోసం తన కారును ఆపిన సాయి దయార్ధ్ర హృదయానికి ముగ్దుడైనాడు. నాటి నుండి సాయి భక్తుడైనాడు.

డాక్టరు గారి పెద్ద అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం. డాక్టరు గారు అకస్మాత్తుగా మరణించారు. తన పిల్లలు కూడా డాక్టర్లు కావలెనని తీవ్ర వాంఛతో ఉండేవారు ఆ డాక్టరుగారు.

తన పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం డాక్టరు కావాలని ముచ్చటపడేవాడు. పి.యు.సి.లో డాక్టరు కోర్సుకు సంబంధించిన కోర్సులనే తీసుకున్నాడు.

కానీ తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ భారం అతనిపై పడింది. ఆ సమయంలో డాక్టరు కోర్సు చదవటం అసాధ్యమని భావించి బిఎస్‌సీలో చేరాడు. తమ్ముళ్ళు డాక్టర్లయ్యారు.

కాని తండ్రి కోర్కె తీరలేదని చింతించే వాడు. అకస్మాత్తుగా ఆల్‌ ఇండియా మెడికల్‌ ఎంట్రెన్సు పరీక్షకు తాను అర్హుడనని తెలుసుకుని ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడయ్యాడు.

నవంబరు నెలలో టెలిగ్రాము వచ్చింది, డాక్టరు కోర్సులో చేరమని. అతడు 1975 నవంబరులో ఎం.బి.బి.యస్‌.లో చేరి డాక్టర్‌ సుబ్రహ్మణ్యం అయ్యాడు.

ఇది సాయి కృపయే. రోగులను పరీక్షించేముందు సాయిని స్మరించుట, ఆయన సాయికి చూపే కృతజ్ఞతా భావములలో ఒకటి.

సాయి ఆరోగ్య ప్రదాతయే కాదు, విద్యా ప్రదాత కూడా!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles