Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఉత్తర హిందూ దేశంలో విద్యావతి పేరు చిరస్మరణీయంగా ఉండిపోయింది. ఈశుని దాసునిగా చేసుకోగలిగినంత గొప్ప భక్తుడు. భక్తుడు మాత్రమే కాదు, మహా రచయిత.
ఈయనను అపర జయదేవుడు అంటారు. రాజుల కొలువులో ఉండేవాడు. చివరి రోజులలో పరమేశ్వర సేవకే అంకితమయ్యాడు.
శ్రీమద్ భాగవతం మొత్తాన్ని స్వహస్తాలతో నకలు వ్రాసి, సంకలనం కూడా చేశాడు. ఇప్పటికి అది దర్భంగా సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉంది.
విద్యావతి ఇంట శివుడు పరిచారకునిగా ‘ఉగాన’ అనే పేరుతొ చేరాడు.
సాయిబాబా కూడా మారు వేషం వేసుకుని భక్తులకు సాయం చేసేవాడు – మైనతాయి విషయంలో ప్రత్యక్షంగా ఆ విషయం తెలిసింది.
ఒకసారి విద్యావతి, ఉగాన అడవిలో పోతున్నారు. విద్యావతికి దాహమైంది. అక్కడెక్కాడా నీరు దొరకలేదు. అప్పుడు అతని సేవకుడు ఆయనకు గంగా జాలం ఇచ్చాడు.
ఆ జలంతో విద్యావతి అంతర్దృష్టి తెరుచుకుంది. ఉగాన మాయమయ్యాడు. ఉగాన స్థానంలో పరమేశ్వరుడు నిల్చున్నాడు.
వెంటనే విద్యావతి పశుపతి పాదాలపై వ్రాలాడు. శివుడు ఆయనకు దివ్య దృష్టిని కూడా ప్రసాదించాడు,
ఉగాన రూపంలో తాను తన వద్ద సేవకునిగా ఉంటున్నట్టు ఎవరికి చెప్పవద్దని, చెబితే, ఇక ఎప్పటికి తన దర్శనం కాదని శివుడు చెప్పాడు.
అలా కొన్నేళ్లు గడిచాయి….
ఒకసారి విద్యావతి భార్యకు ఉగా నపై కోపం వచ్చింది. దూషించటం మొదలు పెట్టింది. విద్యావతి అడ్డుకున్నాడు.
ఆమె నోటికి హద్దు లేనట్లే, చేతికి కూడా హద్దు లేనట్టుంది. మండుతున్న కట్టెను ఉగానపై విసిరింది.
ఇక విద్యావతి తట్టుకోలేక భార్యతో “అయన ఎవరనుకున్నావు? మన దైవం సాక్షాత్తు పరమేశ్వరుడే” అని అన్నాడు. వెంటనే ఉగాన మాయమయ్యాడు.
ఇక విచారించినా ఫలితం లేకపోయింది.
ఇక తన మరణ సమయం దగ్గరవుతున్నదని ఆయన గ్రహించి, చివరి క్షణాలలో గంగా తీరంలో ఉండాలనుకుని, ప్రయాణం చేయసాగాడు, అయినా చేరలేక పోయాడు.
ఇంతలో గంగకు వరదవచ్చి, నీళ్లు విద్యావతి ఉన్న స్థలందాకా వచ్చాయి. అక్కడ ఆయన చివరకు గంగా తీరంలోనే తుది శ్వాస వదిలాడు.
అక్కడ ఆయన అత్య క్రియలు జరిగినప్పుడు, దహనం చేసిన స్థలంలో శివగంగ ఉబికి వచ్చింది. ఆ దినం కార్తీక శుక్ల త్రయోదశి.
భారత ప్రభుత్వం ఆయన స్వరక చిహ్నంగా నవంబర్ 17, 1965లో తపాలా బిళ్లను విడుదల చేసింది. నేడు నవంబర్ 17. విద్యావతి వర్థంతి.
ఈశుని దాసునిగా చేసుకున్న విద్యావతిని స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ‘మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచించు. నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’
- కాలిన మట్టి పాత్ర …. …. మహనీయులు – 2020… నవంబర్ 12
- పోయింది లోభం! వచ్చింది లాభం!! …. మహనీయులు – 2020… అక్టోబరు 28
- దొంగల్లో దొంగ…. మహనీయులు – 2020… నవంబర్ 2
- అనుమానించకు! …. మహనీయులు – 2020… నవంబర్ 24
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments