Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కర్ణాటక దేశంలోని హరిదాసులలో ఒకరు కనకదాసు. అయన జన్మదినం కార్తీక కృష్ణపక్ష తృతీయ.
దైవమైన ఆదికేహ్శవస్వామి దయను పొందిన కనకదాసు, అది కేశవస్వామి సూచనలతో వ్యాసరాయల వారి వద్దకు పోయి, ఆయన ప్రియా శిష్యుడౌతాడు.
వ్యాసరాయలకున్న అనేక శిష్యులలో పురందరదాసు కూడా ఒకరు. పురందరదాసే స్వయంగా కనకదాసును కీర్తించాడు, కనకదాసు మహత్తును గూర్చిన సంఘటనను కూడా తెలిపాడు.
ఒకసారి వ్యాసరాయలు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. అకస్మాత్తుగా వ్యాసరాయలు తన గుప్పిటను మూసి, అందులో ఏముందో చెప్పమన్నారు శిష్యులను.
శిష్యులు ఎవరూ చెప్పలేకపోయారు. వ్యాసరాయలు కనకదాసు వంక చూచారు. కనకదాసు అదే తన గురువు ఆజ్ఞగా భావించి “గుప్పెటలో వాసుదేవ సాలిగ్రామం ఉంది” అని చెప్పాడు.
వ్యాసరాయలు గుప్పెటను తెరిచారు. అందులో వాసుదేవ సాలిగ్రాం ఉంది. శిష్యులు ఆశ్చర్యపడ్డారు.
మరోసారి వ్యాసరాయలు తన శిష్యులందరకూ తలా ఒక అరటి పండు ఇచ్చి, ఎవరూ చూడని స్థలంలో తినమన్నారు.
కొంత సమయం గడిచింది. శిష్యులందరితోపాటు కనకదాసు కూడా తిరిగి వచ్చాడు. కనకదాసు చేతిలో అరటి పండు అలానే ఉంది.
తినకుండుటకు కారణం అడిగారు గురువు గారు. “నేనెంత రహస్య స్థలానికి వెళ్లినా దైవం నన్ను చూస్తూనే ఉన్నాడు. ఎలా తినను?” అన్నాడు కనకదాసు.
కనకదాసు విశిష్ట పురుషుడని, అందుకే గురువు అతనిని అభిమానిస్తారని ఇతర శిష్యులు తెలుసుకున్నారు.
సాయిబాబా కూడా అలాగే తన గురువు అభిమానాన్ని చూరగొన్నాడని సాయి సాహిత్యం తెలుపుతోంది.
వ్యాసరాయల శిష్యులకు కాదు, జన బాహుళ్యానికి కూడా అయన (కనకదాసు) ఎంత గొప్ప భక్తుడో తెలిసింది.
ఒకసారి కనకదాసును ఆలయ అర్చకులు గుడిలోనికి రానీయలేదు. కనకదాసు కలత చెందక గుడి వెనక తట్టుకు వెళ్లి కూర్చుని భగవంతుని ప్రార్ధించసాగాడు.
గుడి లోని స్వామి విగ్రహం గుడి వెనక ప్రార్థన చేస్తున్న కనకదాసు వైపు తిరిగింది. అంతే కాదు, వెనక తట్టున ఉన్న గోడ విరిగిపడింది. దైవ దర్శనం కలిగింది కనకదాసుకు.
ఎంతటి మహనీయుడైనా ఆ కనకదాసు తనను గురుంచి తక్కువగానే చెప్పుకునే వాడు.
“నాలో నువ్వుగింజంతైనా
భక్తి లేదు!
నేను దొంగల్లో దొంగని,
నాది కొంగ జపం….”అంటారు హరిదాసు, కనకదాసు
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- రాజగురు …. మహనీయులు – 2020… మార్చి 8
- గురువును మించిన శిష్యుడు …. మహనీయులు – 2020… నవంబర్ 1
- దొంగ కూడా మనవాడే …. మహనీయులు – 2020… మే 16
- ఎందరో మహానుభావులు …. మహనీయులు – 2020… నవంబర్ 7
- పదవి – సాధన . …. మహనీయులు – 2020… నవంబర్ 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments