Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబాకు ప్రతిరోజూ వాడుకునేందుకు భక్తులు వెండి సింహాసనాన్ని సమర్పించుకున్నారు. కానీ చావడి ఉత్సవం సమయంలో మాత్రమే దానిని వాడేవారు సాయిబాబా.
వ్యాసరాయలు వేదవ్యాస తీర్థులు ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల సింహాసనంపై కూర్చున్నారు. వ్యాసరాయల కోరిక కాదు సింహాసనాన్ని అధిష్టించాలని.
ఒకసారి కుహు యోగం వచ్చింది. ఆ సమయంలో సింహాసనాన్ని అధిష్టించినవారు అగ్నికి ఆహుతై మరణించవలసినదే.
ఆ సమయంలో యతి అయిన వ్యాసరాయలు సింహాసనాన్ని అధిష్టించారు. ఆ కుహు యోగ ఫలితాన్ని తన మంత్రం బలంతో నిర్వీర్యం చేశారు. దీనికి గుర్తుగా వ్యాసరాజ వైభవం జరుపుతారు.
ఈయనది మధ్వ మతం. మధ్వ మతమునకు పుష్టినిచ్చే అనేక రచనలు చేశారు.
వాటిలో కొన్ని న్యాయామృత, తాత్పర్య చంద్రిక, తర్కతాండవ…ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రత్యర్థులను వాదనలో ఓడించి, రత్నాభిషేకాన్ని శ్రీకృష్ణదేవరాయలచే చేయించుకున్న ప్రతివాద భయంకరుడు.
ఈయన ద్వైతాన్ని ప్రజాబాహుళ్యంలోనికి తెచ్చారు. హరిదాసు కూటమిని ఏర్పరచారు.
కుల, వృత్తి, విచక్షణ లేకుండా అందరినీ హరిదాసుగా చేశారు. ఈయనకు ముఖ్య శిష్యులెందరో. ఉ. దా. పురందర దాసు, కనక దాసు.
ఈ హరిదాసులచే సంకీర్తనలు వ్రాయించి, ద్వైతాన్ని ప్రజల నోటివెంట పలికించారు.
ద్వైతానికే అయన పాటుపడలేదు. విజయనగరాన్ని పాలించిన సాళువ నరసింహ, తుళువ నరసింహ నాయక, కృష్ణదేవరాయదులకు రాజగురువు అయ్యారు.
వ్యాసరాయలు తన గురువు ఆదేశంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆనంద నిలయంలో అర్చకునిగా, 12 సంవత్సరాలు అర్చకత్వం చేశారు.
ఆ కాలంలోనే ఆనందనిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరుని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి, దానినే విమాన వెంకటేశ్వరునిగ చేశారు.
ఆనందనిలయంలోని శ్రీ వేంకటేశ్వరుని దర్శించకుండా తిరిగి వెళ్ళిపోవలసిన వారు విమాన వేంకటేశ్వరుని దర్శించుకుంటారు.
రాజ గురువుగా, మఠాధిపతిగా, గ్రంథకర్తగా, కీర్తనకారుడిగానే కాక, ప్రజా సంక్షేమానికై పాటుపడేవారు. తిరుమలలో ఎన్నో నీటి వనరులను ఏర్పాటు చేశాడు.
వ్యాసతీర్థులు మార్చి 8 (1535)న సమాధి చెందారు. వీరి బృందావనం (సమాధి) అనేగొందె సమీపంలో ఉంది.
ఆ బృందావనాన్ని దర్శించలేకున్నా వ్యాసతీర్థులకు నమస్కరించెదము ధన్యులమవుదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- విన్నపాలు వినవలె…. …. మహనీయులు – 2020… మే 9
- రాచరికం…. మహనీయులు – 2020… జూన్ 27
- పిచ్చి సన్నాసి! …. మహనీయులు – 2020… మార్చి 5
- విషయదానం … …. మహనీయులు – 2020… మార్చి 31
- తాతకు తగ్గ మనుమరాలు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 8
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments