Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
షిరిడీకి వచ్చిన కొత్తలో సాయిబాబాను పిచ్చి ఫకీరు అనేవారు ఆ గ్రామస్తులు.
వామక్షేపను కూడా జనులు పిచ్చివాడనే వారు.
ఈయన జన్మించిన గ్రామం దగ్గరలోనే సుప్రసిద్ధ శక్తి పీఠమైన తారాపూర్ ఉంది. సతీ దేవి శరీర భాగాలు అక్కడక్కడా పడ్డాయి. తారాపూర్ లో కనుగ్రుడ్డు పడ్డది.
ఈతడు చిన్నతనం నుండి శక్తి ఆరాధన చేసేవాడు. బాల్యంలోనే కాళీకాదేవి విగ్రహాలను స్వయంగా తయారుచేసి పూజించేవాడు.
గురువు మోక్షదానందుడు. గురువు అనంతరం ఈయనే తారాదేవి మందిరంలో పూజాదులన్నీ చేసేవాడు.
దేవికి పూజలు చేయవలసిన సమయంలో స్మశానంలో సాధనలు చేస్తుండేవాడు. నక్కలు, కుక్కలతో కలసి భుజించేవాడు.
భావనావస్థలో ఉండేవాడు. ఒకసారి భక్తులు ఇచ్చిన వస్తువులన్నీ ప్రోగుచేసి నిప్పంటించి, “అదిగో తారాదేవి, చూడండి, చూడండి” అని జయ జయ ద్వానాలు చేసేవాడు.
ఒకొక్కసారి మందిరాన్ని అశౌచం చేసేవాడు. తారాదేవికి సమర్పించవలసిన నైవేద్యాన్ని, దేవికి సమర్పించకుండా, తానే తినేవాడు.
ప్రజలు ఈయనను హర్షించలేకపోయారు, కొట్టారు, తిట్టారు. గుడి నుండి పంపివేసి గుడి యజమానురాలు నాబొర్ రాణికి ఫిర్యాదు చేశారు.
ఆ రాత్రి ఆ యజమానురాలికి స్వప్నం వచ్చింది. స్వప్నంలో తారాదేవి కనిపించింది. ఆమె వీపు చీలిపోయి రక్తం కారుతొంది.
దేవి వెనుకగా వచ్చే నక్కలు ఆ రక్తపుబొట్లను నాకుతున్నాయి. ఆ దేవి కన్నీరు కారుస్తూ ఎంతో విషాదంగా కనిపించింది.
స్వప్నంలోనే యజమానురాలు “అమ్మా! అలా ఉన్నావేమి?” అని ప్రశ్నించింది.
“నాలుగు రోజులనుండి నాకు ఆహారం లేదు. నా పిచ్చి కుమారునికి ఎవరు ఆహారం పెడతారు? నా బిడ్డడు ముందు తినకుండా నేనెలా తింటాను? నేను ఆలయంలో ఉండాలంటే నాకంటే ముందుగా నా కుమారుడు తినాలి” అన్నది.
యజమానురాలు “అమ్మా! నీ ఆజ్ఞను పాటిస్తాను” అన్నది. తారాదేవి మాయమైంది. స్వప్నం అంతరించింది.
ఈ విషయాన్నీ యజమానురాలు అందరకూ చెప్పింది. తారాదేవి వామక్షేపపై చూపుతున్న వాత్సల్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. మరల మందిరాన్ని వామక్షేప స్వాధీనంచేసారు.
వామక్షేప తారాదేవిని మంత్రాలతో, నామాలతోను కాకుండా నోటికి వచ్చినట్లు తిడుతూ, పువ్వులను ఇష్టంవచ్చినట్లు దేవిపై వేయసాగాడు.
అందరూ చూస్తుండగానే ఆ పువ్వులన్నీ ఒక క్రమంలో దండగా ఏర్పడి తారాదేవి మెడను అలంకరించాయి.
వామక్షేపవి, రామకృష్ణ పరమహంసవి, సాయిబాబావి పిచ్చి చేష్టలు కావు. అది వారి భావావేశస్థితి.
వామక్షేప ఆంగ్ల కాలమానం ప్రకారం మార్చి 5 (1836)న జన్మించారు.
జయతారా! జయతారా! జయ జయతారా!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నిన్ను మరువను …. మహనీయులు – 2020… మే 1
- యోగానందం… మహనీయులు @2020 – జనవరి 5
- అరుత్ పెరుంజ్యోతి…. .మహనీయులు – 2020… అక్టోబరు 5
- దొంగకు చిక్కిన రంగనాథుడు …. మహనీయులు – 2020… నవంబర్ 5
- కాషాయానికి వన్నె… …. మహనీయులు – 2020… మార్చి 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments