Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నేను పుట్టినప్పుడు మా అమ్మ ఎంతో సంతోషించింది” అన్నారు సాయిబాబా.
తల్లి సరస్వతి, తండ్రి దేవరాజ భట్టు కూడా తమకు కలిగిన ప్రథమ బిడ్డడిని చూచి ఎంతో సంతోషించారు.
ఆ పసికందు తరువాత వాదిరాజస్వామిగా మధ్వ సంప్రదాయంలో ఎంతో ఖ్యాతి చెందారు.
సోడే మఠంలో ప్రతి దినం శనగపప్పు, బెల్లం, ఎండు ద్రాక్షలతో ప్రసాదంచేసి నివేదన చేసేవాడు వాదిరాజు.
ఒక్క తెల్లని గుర్రము వచ్చి వాదిరాజుల భుజములపై రెండు కాళ్ళను ఉంచి, వాదిరాజు శిరస్సుపై ఉంచిన పళ్ళెరములోని ప్రసాదాన్ని స్వీకరించటం జరిగేది.
ఆ దైవం కొంత ప్రసాదాన్ని మిగల్చగా దానినే వాదిరాజుస్వామి స్వీకరించేవాడు.
ఒక కంసాలి గణపతి విగ్రహాన్ని బంగారంతో తయారుచేస్తున్నాడు. ఎన్నిసార్లు గణేశ విగ్రహాన్ని చేయటానికి ప్రయత్నించినా, అది హయగ్రీవునిగా మారేది.
ఒకనాటి రాత్రి ఆ కంసాలికి ఆ స్వర్ణ హయగ్రీవుడిని వాదిరాజులకు ఇమ్మని స్వప్నంలో హయవదనుడు తెలిపాడు. ఆ విగ్రహం సోడే మఠంలో నేటికి పూజలందుకుంటోంది.
హయవదనుడు వాదిరాజును ఎల్లవేళలా వెన్నంటి ఉండేవాడు. ఒకసారి వాదిరాజస్వామి పండరీపుర క్షేత్రం వెళ్ళి కొన్ని దినాలు ఉన్నారు.
ఆ సమయంలో అయన ఒక ఆశ్రమంలో ఉండేవారు. పండరీపురంలో ఒక రైతు శనగలను పండిస్తున్నాడు.
ఆ రైతు పొలంలో పని చేస్తుండగానే, ఒక తెల్లని గుర్రము ఆ పంటచేనులోని శనగలను తినసాగింది.
చివరకు అది ఒక ఆశ్రమంలోనికి పోవటం రైతు చూసి, ఆ ఆశ్రమ అధికారులతో ఈ విషయం చెప్పాడు. ఆ ఆశ్రమవాసులు తమకు అసలు గుర్రమే లేదన్నారు.
అక్కడున్న వాదిరాజులు ఆ రైతుతో పంటచేను వద్దకు వెళ్ళాడు. గుర్రం మేసిన ప్రదేశాన్ని చూపమన్నారు. రైతు చూపాడు.
ఆ గుర్రం మేసిన స్థలంలో బంగారు శనగలు కానవచ్చాయి వారికి. వాదిరాజస్వామి ఆ రైతు ఎంతో అదృష్టవంతుడని చెప్పారు.
ప్రతి దినం వాదిరాజులు సమర్పించే ప్రసాదాన్ని, కొంత మిగల్చటం అలవాటు.
ఒక దినం హయవదనుడు ఏమీ మిగల్చకుండా, మొత్తం నైవేద్యాన్ని తానే భుజించాడు. అందరూ ఆశ్చర్యపోయారు ఆ వింతను చూచి.
హయవదనుని విగ్రహపు మెడ నీలి రంగుగా మారింది. వాదిరాజులను మట్టుపెట్టాలని ఎవరో విషం కలిపారు. ప్రసాదం మిగిల్చితే, వాదిరాజస్వామి తిని మరణించేవాడు.
అందుకని ప్రసాదాన్ని ఏమీ మిగల్చక, ఆ విషాన్ని తానూ స్వీకరించాడు హయవదనుడు. ఇది శిష్యునిపై భగవంతునికి గల ప్రేమ.
వంకాయలతో వంటకాన్ని చేసి నివేదన చేయగా హయవదనుని మెడ నీలి రంగు నుండి మాములు రంగుకు మారింది.
వాదిరాజులు ఫాల్గుణ (సామాన్యంగా మార్చి నెలలో వస్తుంది) బహుళ తృతీయనాడు సజీవ సమాధి చెందారు.
హయవదనుని, హయవదన భక్తుని స్మరిద్దాం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ప్రసాదపు విలువ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 13
- గడ్డి కరవని గాడిద. …. మహనీయులు – 2020… జూన్ 13
- దైవానికి హృదయంలో గూడుకట్టు… …. మహనీయులు – 2020… మార్చి 28
- తీయని బాధ .. …. మహనీయులు – 2020… అక్టోబరు 4
- దూరంగా ఉండని గురువు… మహనీయులు – 2020 – జనవరి 6
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments