Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
పాడువాకు చెందిన ఫెర్నాండో మార్టిన్స్ 1195లో జన్మించాడు. అంథోనీగా 35, 36 సంవత్సరాలకే దేహాన్ని విడిచాడు. దేహాన్ని అయన విడిచిన కొద్ది కాలానికే ఆంథోనీ, సెయింట్ ఆంథోనిగా కీర్తింప బడినాడు.
ఫెర్నాండో చిన్నతనం నుండి దైవారాధకుడు. ఒకసారి ఆంథోని (ఫెర్నాండో) సముద్ర తీరాన ఉన్న మిని పట్టణంలో ప్రవచనం చేస్తున్నాడు.
అక్కడున్న వారంతా దైవారాధకులుకారు, ఆంథోనీని హేళన చేయసాగారు. “మీరు దైవాన్ని గూర్చి వినటానికి అనర్హులుగా ఉన్నారు. సాగరంలో ఉన్న చేపలకైనా చెబుతాను” అని సాగరంవైపు తిరిగాడు.
ఆయన మాటలు విని ఎన్నో చేపలు సాగరపు ఒడ్డుకు చేరాయి. వినటానికి వచ్చాయి అవి. ఆయన ప్రసంగం అయిపోగానే చేపలను దీవించాడు. అవి మరల సాగరంలోనికి పోయాయి.
ఈ దృశ్యాన్ని చూచిన వారికి, దైవంపై నమ్మకం కలిగి, వారు ప్రశ్చాత్తాపంచెంది, ఆంథోని ప్రసంగాన్ని విన్నారు.
“విష్ణు నాకర్ణించు వీనులు, వీనులు” అంటాడు ప్రహ్లాదుడు.
దైవాన్ని, దైవ ప్రసాదాన్ని కాదనరు భక్తులు. అంథోనీ చుట్టూ చేరిన వారందరూ భక్తులు కానక్కరలేదు కదా! దైవాన్ని, దైవ ప్రసాదాన్ని ఒక వ్యక్తి దూషించసాగాడు.
“మీరు (ఆంథోనీ) నా గాడిదచే భగవత్ ప్రసాదాన్ని తినిపించితే, నేను నమ్ముతాను” అన్నాడు ఆ వ్యక్తి. ఐతే దైవాన్ని ఈ రగడలోనికి దింపటం ఇష్టంలేదు ఆంథోనీకి.
ఆథోనినీ కనుక ఇప్పుడు వెనుకడుగు వేస్తె, దైవపు ఉనికిని ఎవ్వరూ నమ్మరు. అందుకని ఆంథోని సరే అన్నాడు.
మూడు రోజులపాటు తన గాడిదకు ఏమీ పెట్టకుండా, దాని కడుపు మాడ్చాడు దాని యజమాని. మూడు రోజులు అలా గాడిదకు తిండి పెట్టని వ్యక్తి తన గాడిదను ఆంథోనీ చెంతకు తెచ్చాడు.
ఏమి జరుగుతుందోనని చూడటానికి జనం గుమిగూడారు. ఆ గాడిదను మాడ్చిన వ్యక్తి. ఆ గాడిద ముందు పచ్చ గడ్డిని పెట్టాడు.
ఆంథోనీ చేతిలో భగవత్ ప్రసాదం (రొట్టె) ఉంది. ఆ గాడిద ఆకలితో ఉన్నా పచ్చగడ్డి వైపు చూడకుండా, రొట్టె ముందు నమ్రతగా తలవంచి నిలబడింది.
అంతే కానీ మూడు రోజులుగా యజమాని పస్తు ఉంచినా, గడ్డి కరవలేదు. అందరూ ఆంథోనికి దైవంపై గల నమ్మకాన్ని, దైవ శక్తిని గుర్తించారు.
అందరూ ఆంథోని గొప్పదనాన్ని పొగుడుతుంటే, ఒక వ్యక్తి హర్షించలేకపోయాడు.
తన చేతిలో ఉన్న గాజు గ్లాసును చూపి, “దీనిని ఈ గచ్చుపై పడవేస్తాను. అది పగలకుంటే, నేను ఆంథోనిని నమ్ముతాను” అన్నాడు. బలంగా గ్లాసును గచ్చుపై విసిరాడు, గాజు గ్లాసు పగలలేదు. పగిలింది గచ్చు.
సాయి దైవంపై విశ్వాసాన్ని పెంచటానికి ఎన్నో విధాల ప్రయత్నించారు.
ఆంథోని, సెయింట్ ఆంథోని అయ్యాడు.
ఆయన జ్ఞాపకార్థం విందును జూన్ 13న జరుపుతారు, నేడు 13 జూన్ ఆంథోనీని స్మరించుదాం.
దైవంపై విశ్వాసాన్ని పెంచుకుందాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఇసుక రేణువంత దయ…. మహనీయులు – 2020… అక్టోబరు 13
- ఉన్నది ఊర్ధ్వగతి, లేదు అధోగతి! …. మహనీయులు – 2020… జూన్ 15
- వచ్చినవాడు రాముడు …. మహనీయులు – 2020… జూన్ 11
- రాచరికం…. మహనీయులు – 2020… జూన్ 27
- సచ్చా పాదుషా …. మహనీయులు – 2020… జూన్ 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments