ఉన్నది ఊర్ధ్వగతి, లేదు అధోగతి! …. మహనీయులు – 2020… జూన్ 15



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఆగస్టైన్ మేధావి. గొప్ప వాక్చతురత గలవాడు. అందుకు ఆయన ఎంతగానో గర్వించేవాడు.

చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు లోనయ్యాడు. నీతి బాహ్యమైన జీవితాన్ని గడిపేవాడు. తల్లి క్రీష్టియన్. తండ్రి క్రీష్టియన్. తల్లి ఆగస్టైన్ ను నిజమైన క్రీష్టియన్ గా చేయాలని ఎంతో తపించేది. ఆమె పేరు మౌనిక.

శారీరక మానసిక వాంఛలను నిగ్రహించుకోలేకపోయాడు. ఒక ఉంపుడుగత్తె వలన ఆగస్టైన్ తండ్రి అయ్యాడు. సుమారు 19వ ఏట.

మౌనిక కన్నీటితో భగవానుని ప్రార్ధించేది. ఆమె జీవితమంతా కన్నీటిమయమే.

గతం ఆగస్టై ను వెంటాడేది. బాప్టిజం తీసుకున్నాడు. ఒకసారి ఆయన సెయింట్ ఆంథోని జీవిత చరిత్ర చదివాడు.

అందులో పాపాత్ములైన ఇరువురు వ్యక్తులు మంచివారుగా మారిపోయారు. అనామకులు, అనాగరికులైన ఆ ఇరువురు వ్యక్తులు మారగాలేనిది, తానెందుకు మారకూడదు అనిపించింది. పట్టరాని దుఃఖంతో తోటలో కూలబడ్డాడు.

ఒక అపూర్వమైన ధ్వని “తీసి చూడు, చదువుకో” అని వినిపించింది.

వెంటనే గదిలోనికి వెళ్ళి బైబిల్ తెరవగానే “అల్లరితనంలోను, తాగుబోతుతనంలోను సుఖంలేదు. జారత్వంలోను, స్వేచ్చాచారంలోను లేదు; పనికిమాలిని పోరాటాలలోను, అసూయలోను లేదు.

ప్రభువగు జీసస్ మీద ఆధారపడవలె గాని, రక్త మాంసాల శరీర సుఖంమీద కాదు” అని కనబడ్డాయి. ఈ వాక్యాలు సంశయాన్ని, అంధకారాన్ని చెదరగోట్టాయి.

“భగవంతుడు ప్రతి ఆత్మతోను ప్రత్యేక వ్యక్తిగత సంబంధం పెట్టుకుంటాడు” అని ఆగస్టైను తరువాత వ్రాశాడు. అదే CONFESSIONS అనబడే గ్రంథం. ఆధ్యాత్మిక స్వీయ చరిత్రను వ్రాసిన వారిలో ఆయనే ప్రథముడంటారు.

ఆయన హిప్పో చర్చిలో బిషప్పు అయ్యారు. ఆ పట్టణాన్ని శత్రువులు ముట్టడిస్తారని, ఆయనను వేరే చోటుకు వెళ్ళమన్నారు అందరూ. ఆయన అంగీకరించలేదు.

అక్కడే దేహాన్ని వదిలాడు. అనంతరం ఆ పట్టణాన్ని ముట్టడించి తగలబెట్టారు దుండగులు. ఐతే ఆయన చర్చి, గ్రంథాలయాలు అగ్నికి ఆహుతి కాలేదు.

సాయిబాబా ఎవరినీ నిందించవద్దనే వారు.

ఆగస్టైన్ తన భోజన బల్లమీద “పరాయివాని పేరును మలిన పరిచేవానితో భోజనానికి కూర్చోవద్దు” అని వ్రాయబడిన ఫలకం ఉండేది. ఆగస్టైన్ సెయింట్ ఆగస్టైన్ అయ్యాడు.

ఆయన పుణ్యతిధిని జూన్ 15న కొన్ని దేశాలవారు జరుపుకుంటారు.

సెయింట్ అగస్టైన్ దేహానంతరం చూపిన లీలలో ఒకటి మేడపై నుండి పడబోయే బిడ్డను రక్షించటం.

ఈ సంఘటన సాయిబాబా ఒకసారి తనవారిని “పడనీయను, చెడనీయను” అనే వాక్కును జ్ఞప్తికి తెస్తుంది.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles