నీ పదధూళులే పదివేలు! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 29



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒక వ్యక్తి శరీరం కంపుకొడుతొంది. శరీరమంతా పుండ్లతో నిండిపోయింది. ఇది తాను చేసిన పాపాల ఫలమని తెలుసుకున్నాడు. పాశ్చాత్తప్తుడయ్యాడు.

ఏ మహనీయుని కరుణ అయినా సోకదా అంటూ అతి నెమ్మదిగా నడక సాగించాడు. అతడు సెయింట్ ఆస్ వాల్డ్ సమాధి వద్దకు వచ్చాడు.

అతని కన్నుల వెంట ధారాపాతంగా నీరు కారుతొంది. సాయిబాబా చెప్పినట్లు “నా సమాధి నుండే అన్ని కార్యములను నిర్వర్తించుదును” అని సెయింట్ ఆస్ వాల్డ్ చెప్పాడో లేదో తెలియదు గాని, ఆ రోగి యొక్క చర్మం వ్యాధి పూర్తిగా తగ్గి మాములుగా మారింది.

పుండ్లు, దుర్గంధం అన్నీ మాయమయ్యాయి. ఆరోగ్యవంతుడయ్యాడు. ఇటువంటి అద్భుతాలెన్నో ఆ సెయింట్ జీవితంలో కానవస్తాయి.

ఆస్వాల్డ్ కు జీసస్ పైన, మత గ్రంథాలపైన మక్కువ ఎక్కువ. సదాచార సంపన్నుడు.

ఏసు తన చరమరాత్రి తనపై వస్తమును అవతలపెట్టి, ఒక తువాలు నడుముకు కట్టుకున్నాడు. పళ్లెములో నీళ్ళుపోసి శిష్యుల పాదములు కడిగి తువాలుతో తుడవటం ప్రారంభించాడు.

“నీవు నా పాదములు కడుగుటయా?” అని అన్నాడు ప్రభువుతో. “నేను ఇప్పుడు చేయుచున్నది నీకు తెలియదు. ఇకమీదట తెలుసుకుంటావు” అన్నాడు క్రీస్తు.

కొందరు కాదన్నా మిగిలిన వారందరి పాదములు కడిగిన పిమ్మట క్రీస్తు “నేను చేసిన పని మీకు తెలిసింది కదా! బోధకుడని, ప్రభువని మీరు పిలుచుట న్యాయమే.

కాబట్టి ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు వేరొకరు కడుగవలసినదే. నేను చేసిన ప్రకారము మీరును చేయవలెనని ఇలాగు చేసితిని” అన్నారు శిష్యులతో. పాదములు కడుగుట అనునది సంప్రదాయమైంది.

ఆస్వాల్డ్ 992లో గుడ్ ఫ్రెడ్ ముందు వచ్చే 40 రోజుల ప్రార్థనా కార్యక్రమంలో దినమునకు 12 మంది నిరుపేదల పాదములు కడిగి, తుడిచేవాడు.

ఆ దినమునాడు కడగవలసిన 12 పాదములలో 11 మంది పాదములు కడిగి తుడిచాడు. ఇక 12వ వ్యక్తి పాదములు కడిగి, తుడుస్తూ, అతనిని దీవిస్తూ ప్రాణములను విడిచాడు ఆస్వాల్డ్. ఆ దినం ఫిబ్రవరి 29 (992వ సంవత్సరం).

సాయిబాబా కూడా పాద పూజకు ప్రాధాన్యమిచ్చాడు. తాత్యా పాదములు ఒత్తేవాడు. “ఏం ఫర్వాలేదులే! మనద్దిరం ఒకటే” అనేవాడు సాయి.

అంత అహంభావ హీనంగా ప్రవర్తించిన జీసస్, సాయిల పదములె చాలును, ఆ పద ధూళులే పదివేలు!

వారి సంప్రదాయాన్ని పాటించిన ఆస్వాల్డ్ ను నేడు ఫిబ్రవరి 29న స్మరించెదము గాక!

వినమృలమై ఉండెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles