Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి సంప్రదాయంలో మహిళలు ఎందరో ఉన్నారు. బౌద్ధ మతం స్వీకరించిన వారిలోనూ దీక్షిణులున్నారు.
శుద్దోధనుడు మాయాదేవిని, ఆమె సోదరైన మహా ప్రజాపతి గౌతమిని వివాహమాడాడు.
మాయాదేవి 7 రోజుల పసి బిడ్డడిని సోదరి మహా ప్రజాపతి గోతమి చేతిలో పెట్టి కన్ను మూసింది.
ఆ పసిబిడ్డను స్వంత బిడ్డలాగ సాకింది గౌతమి. బుద్ధుడిని గౌతమ బుద్ధుడంటారు అందుకనే.
ఇంటి నుంచి నిష్కృమించిన గౌతముడు బౌద్ధ మతాన్ని నెలకొల్పాడు. అందులోనికి బుద్ధుని భార్య, కుమారుడు, మహా ప్రజాపతి గౌతమి కుమారుడు, కోడలు చేరారు.
మహారాజు శుద్దోధనుడు మరణించాడు. గౌతమి రాజమాతగా జీవించదలచుకోలేదు. కుమారునిగా సాకిన బుద్ధుడిని భిక్షుకురాలిగా చేర్చుకొమ్మన్నది.
అప్పటివరకు భిక్షుకులున్నారు. భిక్షిణుల వ్యవస్థ లేదు. బుద్ధుడు కాదన్నాడు.
రెండవసారి ఆమె అర్ధించింది, మరలాకాదన్నాడు. మూడవసారి అర్ధించినా కాదన్నాడు.
ఆ రాజమాత, తనవెంట ఉన్న 500 మంది మహిళలు శిరోముండనం (గుండు – జుట్టు తీసివేయటం) చేయించుకున్నారు. పచ్చని దుస్తులు ధరించారు.
ఇక అప్పుడు బుద్దుడున్న జీతావనానికి కాలినడకన బయలుదేరారు. గౌతమి ఎండకన్ను ఎరుగని తల్లి.
ఆమె ఎండలో, వానలో, తనవారితో బయలుదేరటం ఆనాడు అనేక రాజ్యాల వారు ఆశ్చర్యపోయారు. కొందరు రాజులు, యువరాజులు వారికి వాహనాలు ఏర్పరుస్తామన్నారు.
వాళ్ళ కాళ్ళు స్వాధీనం తప్పినా, పాదములు చిట్లి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా 375 మైళ్ళు నడచి జీతవనం చేరారు. ఆనందునకు ఈ విషయం చెప్పింది రాజమాత గౌతమి.
ఆనందుడు ఎంతగానో బ్రతిమాలి, తర్కించి ఎలాగో ఒప్పించాడు బుద్ధుడిని, గౌతమి, మరో 500 మంది మహిళలు మొదటిసారిగా భిక్షిణులయ్యారు.
వారు బుద్ధుని నుండి ఉపదేశం పొందారు. క్షణకాలం వృధాకానివ్వలేదు. ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారు.
ఒకనాడు గౌతమి బుద్ధునకు ఒక సుందర వస్త్రం తయారుచేసి సమర్పించింది. “నాకుకాదు, సంఘమునకు సమర్పించుము” అన్నాడు. మాతృ ప్రేమ గృహము వరకు పరిమితము.
గౌతమి, బుద్ధుడు మహనిర్వాణం పొందుతాడని గ్రహించింది. తన కనులముందే తాను సాకిన బిడ్డ (బుద్ధుడు) మరణాన్ని ఉహించుకొనలేక పోయింది.
తాను శరీరాన్ని విడుస్తానని అందుకు అనుమతి కోరింది బుద్దిని. సన్యాసినులు కూడా ఆధ్యాత్మికంలో తక్కువ కాదని నిరూపించ దలచుకున్నాడు బుద్ధుడు.
“సరే నీవు సాధించినది అందరికీ చెప్పు” అన్నాడు బుద్ధుడు.
బుద్ధునకు, సంఘమునకు తాను నేర్చిన విషయములు తేటతెల్లంగా చెప్పింది.
ఆకాశ గమనం, అదృశ్యమవటం, భూమి నుండి ఎత్తుగా ఆకాశంలోకి పోవటం, 12 సూర్యుల తేజస్సును చూపటం మొదలగునవి ఎన్నో చూపి బుద్ధునకు నమస్కరించి భౌతిక కాయాన్ని (తన 500 మంది సహా) విడిచింది.
అంతిమ సంస్కారాలు జరిగాయి. గౌతమికి, 500 మంది మహిళలకు. ఆ దినం ఏదో తెలియదు. కృషి ఉంటే మహిళలు సాధించలేనిది ఏది?
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దర్శనమే సాధన! …. మహనీయులు – 2020… ఆగస్టు 19
- ఆనందదాయకుడు…. మహనీయులు – 2020 – జనవరి 23
- ఒక అడుగు ముందుకు వెయ్యి …. మహనీయులు – 2020… జూన్ 23
- మహా భిక్షు …. మహనీయులు – 2020… మే 24
- బుద్ధునకు షరతులా!? …. మహనీయులు – 2020… సెప్టెంబరు 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments